MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Dhurandhar 2: అతిక్ అహ్మద్‌కి ఉగ్రవాదులతో లింక్‌లు.. సంచలన నిజాలు బయటపెట్టిన డీజీపీ, వామ్మో ఇంత జరిగిందా ?

Dhurandhar 2: అతిక్ అహ్మద్‌కి ఉగ్రవాదులతో లింక్‌లు.. సంచలన నిజాలు బయటపెట్టిన డీజీపీ, వామ్మో ఇంత జరిగిందా ?

ధురంధర్‌ 2 సినిమాలో సలీమ్‌ సిద్ధిఖీ నటించిన అతిక్‌ అహ్మద్‌ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఆయనకు నిజంగానే ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని డీజీపీ చెప్పడం షాకిస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 24 2026, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్‌ 2
Image Credit : X/@AdityaDharFilms

బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతున్న ధురంధర్‌ 2

క్రిమినల్ నుండి రాజకీయ నాయకుడిగా మారిన అతిక్ అహ్మద్ జీవితం, అతని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే ఇది రూ.800కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కంటే వివాదాల్లోనే ఎక్కువగా వినిపిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అతిక్‌ అహ్మద్‌ పాత్ర వివాదం
Image Credit : jansatta

అతిక్‌ అహ్మద్‌ పాత్ర వివాదం

సలీమ్‌ సిద్ధిఖీ నటించిన అతిక్‌ అహ్మద్‌ పాత్ర ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ పాత్ర రియల్‌ లైఫ్‌ లీడర్‌ అతిక్‌ అహ్మద్‌ జీవితాన్ని ఆధారంగా తీర్చిదిద్దారు. ఆయనకు పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో కనెక్షన్‌ ఉన్నాయట. తాజాగా ఉత్తర ప్రదేశ్‌ మాజీ డీజీపీ ఈ విషయాలను వెల్లడించారు. సినిమాలో అతిక్ అహ్మద్‌కు పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు ఉన్నట్లు చూపించారు. ఇది కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ తీసిన `ప్రచార చిత్రం` (Propaganda) అని, అతిక్ కుటుంబ సభ్యులు, కొందరు రాజకీయ నాయకులు మండిపడుతున్నారు.

Related Articles

Related image1
Nagarjuna Dream Role: నాగార్జున డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? రాజమౌళిని భలే ఇరికించాడుగా
Related image2
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
35
నిజాలు బయటపెట్టిన మాజీ డీజీపీ విక్రమ్‌ సింగ్‌
Image Credit : X/@AdityaDharFilms

నిజాలు బయటపెట్టిన మాజీ డీజీపీ విక్రమ్‌ సింగ్‌

అయితే, ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ ఈ ఆరోపణలను సమర్థించారు. అతిక్ గ్యాంగ్ (IS-277)కు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ నుండి ఆయుధాలు అందేవని, అతని ఇంట్లో పాక్ తయారీ తూటాలు దొరికాయని ఆయన గుర్తు చేశారు. సినిమాలో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ జైలులో ఉండి కూడా విలాసవంతమైన జీవితం గడిపినట్లు చూపించారు. వాస్తవానికి, 2023లో వెలుగులోకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం అష్రఫ్ కోసం పీలిభీత్ నుండి ప్రత్యేకంగా చికెన్ బిర్యానీ జైలుకు వచ్చేది. దీనికి సహకరించిన జైలు సిబ్బందిని, బిర్యానీ సరఫరా చేసిన వారిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

45
కసబ్‌కి బిర్యానీని ఖండించిన అధికారి
Image Credit : X/@AdityaDharFilms

కసబ్‌కి బిర్యానీని ఖండించిన అధికారి

ఈ సినిమా చర్చల నేపథ్యంలో ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ హయాంలో కసబ్‌కు జైల్లో బిర్యానీ వడ్డించారని రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, మాజీ ఐపీఎస్ అధికారిణి మీరన్ చద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో దీనిని ఖండించారు. కసబ్‌కు ఎప్పుడూ స్పెషల్ డిష్‌లు ఇవ్వలేదని, అది కేవలం ఒక ప్రచారం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ఏప్రిల్ 15, 2023న ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముందే అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను దుండగులు కాల్చి చంపిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సినిమాలో ఈ సీన్‌ను అత్యంత సహజంగా చిత్రీకరించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

55
నిజాలు నిర్భయంగా చూపించారు
Image Credit : Asianet News

నిజాలు నిర్భయంగా చూపించారు

సినిమా విషయంలో జనాల నుంచి పాజిటివ్‌ రియాక్షన్‌ వస్తోంది. `నిజాలను నిర్భయంగా చూపించారు` అని కొందరు, మరోవైపు `రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించారు` అని మరికొందరు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా, 'ధురంధర్' సినిమా ఉత్తరప్రదేశ్ నేర చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని మళ్ళీ చర్చకు పెట్టింది. ఈ చర్చ హాట్‌ టాపిక్‌ అవుతుంది. అదే సమయంలో మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌, సంజయ్‌ దత్‌, అక్షయ్ ఖన్నా, ఆర్‌ మాధవన్‌, సారా అర్జున్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలు పోషించిన `ధురంధర్‌ 2` చిత్రానికి ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Recommended image2
Samantha: భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన సమంత.. మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Related Stories
Recommended image1
Nagarjuna Dream Role: నాగార్జున డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? రాజమౌళిని భలే ఇరికించాడుగా
Recommended image2
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved