- Home
- Entertainment
- అందరి మనసు దోచుకున్న సితార.. ఆమె చేసిన పనికి శెభాష్ అనాల్సిందే.. మహేష్ కూతురా మజాకా!
అందరి మనసు దోచుకున్న సితార.. ఆమె చేసిన పనికి శెభాష్ అనాల్సిందే.. మహేష్ కూతురా మజాకా!
సూపర్ స్టార్ మహేష్‌బాబు కూతురు సితార.. ఇతర ఏ స్టార్ డాటర్‌కి సాధ్యం కాని రేర్ ఫీట్స్ ని అధిగమించింది. చిన్నప్పుడే గొప్ప అఛీవ్‌మెంట్స్ సాధిస్తుంది. కిడ్ స్టార్‌గా వెలుగుతుంది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

మహేష్‌బాబు, నమ్రతల ముద్దుల తనయ సితార.. స్టార్ కిడ్‌గా కాదు, కిడ్ స్టార్‌గా వెలిగిపోతుంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని సితార ఇప్పుడు స్టార్ హోదాకి రీచ్ అయ్యింది. ఆ హోదాని అనుభవిస్తుంది. అరుదైన ఘనతలు సాధిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికే తండ్రి మహేష్‌తో కలిసి ఒకటిరెండు యాడ్స్ లో మెరిసిన సితార.. తానే సోలోగా ఓజ్యూవెల్లరి యాడ్ చేసింది.
పీఎంజే జ్యూవెల్లరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేసింది. ఈ నగల యాడ్‌లో ఆభరణాలు ధరించి కెమెరాకి పోజులిచ్చింది. ఆమెపై చేసిన ఫోటో షూట్ లో చిన్నారి ప్రిన్సెస్‌లా మెరిసిపోయింది. అంతేకాదు ఆమె చేసిన యాడ్ ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్‌లోని టైమ్స్ స్వ్కైర్ బిల్‌బోర్డ్ పై ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి స్టార్ కిడ్‌గా సితార రికార్డు క్రియేట్ చేసింది. అరుదైన ఘనత సాధించింది.
అయితే ఈ యాడ్‌కిగానూ ఏకంగా సితార కోటీ రూపాయల పారితోషికం తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తన తొలి పారితోషికాన్ని సితార ఏం చేసిందనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జనరల్‌గా పిల్లలెవరైనా తొలి సంపాదన తమ ఖర్చులకు, తమకు ఇష్టమైన వాటిని కొనుక్కునేందుకు వాడుకుంటారు. తమ ప్యాకెట్ మనీగానే వాడుకుంటారు. మరీ ఎక్కువ ఎమౌంట్ అయితే కొంత ఇతరులకు ఇస్తారు. కానీ సితార మొత్తం ఇచ్చేసిందట.
`పీఎంజే` యాడ్ చేయడం వల్ల వచ్చిన మొత్తం పారితోషికాన్ని ఆమె ఛారిటీకి ఇచ్చినట్టు చెప్పింది సితార. తొలి సంపాదన ఇలా సేవా కార్యక్రమాలకు ఇచ్చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సితార గొప్ప మనసుకి అంతా ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మహేష్ ఎంతో మంది చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయం తెలిసిందే. వెయ్యి మందికిపైగా పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయించారు మహేష్. ఇప్పుడు సితార కూడా అదే దారిలో వెళ్తుండటం పట్ల అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. శెభాష్ అంటూ కితాబిస్తున్నారు.
సితార ఇప్పటికే `సర్కారు వారి పాట`లో `పెన్ని` ప్రమోషనల్ సాంగ్‌లో మహేష్‌తో కలిసి డాన్సు చేసింది. మరోవైపు హాలీవుడ్ యానిమేటెడ్ మూవీ `ప్రోజెన్ 2`లో బేబీ ఎల్సాకి ఆమె డబ్బింగ్ చెప్పింది. ఇంకోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో డాన్సు వీడియోలు, కిడ్స్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. శనివారం జరిగిన `పీఎంజే` యాడ్స్ కి సంబంధించిన ఈవెంట్‌లో సితార మాట్లాడుతూ తనకు సినిమాలంటే ఇష్టమని, సినిమానే కెరీర్‌గా ఎంచుకుంటానని తెలిపింది.