- Home
- Entertainment
- రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారిన ఈటీవి... వైజాగ్ జాన్సీ వర్సెస్ నెల్లూరు కవిత దంచుడే దంచుడు!
రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారిన ఈటీవి... వైజాగ్ జాన్సీ వర్సెస్ నెల్లూరు కవిత దంచుడే దంచుడు!
శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లెమాల ప్రొడక్షన్ లో మరో సక్సెస్ ఫుల్ షోగా అవతరించింది. కాగా రాను రాను ఈ షో రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారుతుంది. వైజాగ్ ఝాన్సీ చేసిన 'పల్సర్ బైక్' సాంగ్ పిచ్చ పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో పలుమార్లు ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలుస్తున్నారు.

Sridevi Drama company
కాలంతో పాటు అన్నీ మారిపోతున్నాయి. గత పదేళ్ల కాలంలో టెలివిజన్ కంటెంట్ లో విపరీతమైన మార్పులు వచ్చాయి. కుటుంబం మొత్తం కలిసి చూసే టెలివిజన్ కార్యక్రమాల్లో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఒకప్పుడు చూసుకునేవారు. ప్రస్తుతం పంథా మారింది. లెక్కకు మించిన టెలివిజన్ ఛానల్స్ వచ్చిపడ్డాయి. పోటీ పెరిగింది. టీఆర్పీ వేటలో విలువలు వదిలేస్తున్నారు.
Sridevi Drama company
ఒకప్పుడు ఈటీవీ క్లీన్ ఇమేజ్ ఉండేది. సాంప్రదాయవాదుల ఫేవరెట్ ఛానల్ గా ఉండేది. జబర్దస్త్ రాకతో అయిపోయింది. పాడుతా తీయగా లాంటి క్లాసికల్ ఈవెంట్ ప్రసారమైన ఛానల్ లో బూతు జోకులు, పొట్టి బట్టల యాంకర్స్ తో కూడిన జబర్దస్త్ వచ్చి చేరింది. జబర్దస్త్ షో ప్రారంభంలో కామెడీ పేరుతో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బూతు జోకులు విచ్చల విడిగా పేల్చేవారు.
Sridevi Drama company
ఒక దశలో అడల్ట్ జోకులు శృతి మించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ డోసు కొంచెం తగ్గించారు. మెల్లగా జబర్దస్త్ కల్చర్ ఈటీవీ ఇతర షోలకు పాకింది. డాన్స్ రియాలిటీ షో ఢీ స్వరూపం పూర్తిగా మారిపోయింది. దానికి కామెడీ, రొమాన్స్ జోడించి సరికొత్తగా రూపొందించారు. రష్మీ, సుధీర్, హైపర్ ఆది దీనికి ముఖ్య కారణం.
Sridevi Drama company
ఇక జబర్దస్త్-ఢీ షోలను కలగలిపి కొత్తగా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్నీ ఉంటాయి. డాన్సులు, కామెడీ స్కిట్స్, రొమాన్స్, టాలెంట్ షోస్ ఇలా ఫుల్ మీల్స్ వంటి షో అన్నమాట. యాంకర్స్, కమెడియన్స్, ఫేడ్ అవుట్ స్టార్స్ ని కలిపి సమూహంతో శ్రీదేవి డ్రామా కంపెనీ రూపొందించారు.
Sridevi Drama company
శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లెమాల ప్రొడక్షన్ లో మరో సక్సెస్ ఫుల్ షోగా అవతరించింది. కాగా రాను రాను ఈ షో రికార్డింగ్ డాన్సులకు అడ్డాగా మారుతుంది. వైజాగ్ ఝాన్సీ చేసిన 'పల్సర్ బైక్' సాంగ్ పిచ్చ పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో పలుమార్లు ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి పిలుస్తున్నారు.
Sridevi Drama company
వైజాగ్ ఝాన్సీకి పోటీగా నెల్లూరు కవితను దించారు. వీరిద్దరి మధ్య పోటీ పెట్టారు. వైజాగ్ ఝాన్సీ, నెల్లూరు కవిత తమ టీమ్ మెంబర్స్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై ముఖాముఖీ తలపడ్డారు. వారి పెర్ఫార్మన్స్ రికార్డింగ్ డాన్సులను తలపించాయి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం బ్యాన్ చేసిన రికార్డింగ్ డాన్సులను శ్రీదేవి డ్రామా కంపెనీ షో గుర్తు చేసింది.
Sridevi Drama company
లోకల్ టాలెంట్స్ ని ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ డాన్సుల పేరిట వల్గర్ స్టెప్స్ తో రచ్చ చేయడం సరికాదు. జాన్సీ, కవిత డాన్సులు హద్దులు దాటకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఈ డాన్సులపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదే సమయంలో ఈటీవి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది.
Sridevi Drama company
సాంప్రదాయవాదులకు ఈ తరహా షోలు నచ్చడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తే బుల్లితెర ఈవెంట్స్ లో ఈ తరహా కంటెంట్ సరికాదు అంటున్నారు. వీరిని ప్రోత్సహించి సమాజానికి చెడు చేయవద్దని హితవు పలుకుతున్నారు.
Sridevi Drama company
గతంలో సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా ఉండేవాడు. ఆయన ఈటీవిని వదిలి వెళ్ళిపోయాక రష్మీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, ఇంద్రజ వంటి స్టార్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోని నడిపిస్తున్నారు.