MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరోసారి ట్రోలర్స్ బారిన పడ్డ ప్రభాకర్‌ కొడుకు.. స్వామి మాలలో ఉండి ఇదేం యాటిట్యూడ్‌ అంటూ నెటిజన్ల రచ్చ

మరోసారి ట్రోలర్స్ బారిన పడ్డ ప్రభాకర్‌ కొడుకు.. స్వామి మాలలో ఉండి ఇదేం యాటిట్యూడ్‌ అంటూ నెటిజన్ల రచ్చ

ఈటీవీ ప్రభాకర్‌ కొడుకు చంద్రహాస్‌ మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయాడు. ఈ సారి స్వామి మాలలో ఉన్న ఆయన లేటెస్ట్ ఫోటోలపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. నెట్టింట రచ్చ లేపుతున్నారు.

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 27 2022, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఈటీవీ ప్రభాకర్‌గా పాపులర్‌ అయిన ప్రభాకర్‌ ఇటీవల తన కుమారుడు చంద్రహాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం రోజే ట్రోలర్స్ బారిన పడ్డారు చంద్రహాస్‌. ఫోటోల్లో యాటిట్యూడ్‌ చూపిస్తూ కనిపించాడని, చూడ్డానికి నిత్యానంద స్వామిలా ఉన్నాడని రకరకాలుగా కామెంట్లతో రెచ్చిపోయారు నెటిజన్లు. దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆ దెబ్బకి తండ్రి ప్రభాకర్‌ స్పందించి రిక్వెస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29

ఎంట్రీతోనే ఇంతటి చర్చ ఏ హీరోకి జరగలేదు. జరగదు కూడా. కానీ ప్రభాకర్‌ కొడుకుపై జరిగింది. ఆయనపై నెగటివ్‌ కామెంట్లు వినిపించినా, పరోక్షంగా అది పాపులారిటీని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అది పరోక్షంగా హీరో సినిమాకి ప్రమోషన్‌ తెచ్చిపెట్టినట్టయ్యింది. దీంతో నటుడు, డైరెక్టర్‌ ప్రభాకర్‌ కూడా లైట్‌ తీసుకున్నారు. సైలైంట్‌ అయ్యారు.
 

39

ఆ తర్వాత మీడియాకి దూరమైన చంద్రహాస్‌ ఇప్పుడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాడు. సోషల్‌ మీడియాలో ఆయన ఫోటోలు ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి. స్వామి మాలలో ఉన్న చంద్రహాస్‌ పోజులు ఇప్పుడు నెటిజన్ల విమర్శలకు కారణమవుతుంది. మరోసారి చర్చనీయాంశంగా మారాడు చంద్రహాస్‌.

49

తాజాగా ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాడు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. కొత్త కారు కొన్న విషయాన్ని, అలాగే ఫ్యామిలీతో కలిసి ఆధ్యాత్మిక టూర్‌కి వెళ్తున్నట్టుగా విషయాన్ని షేర్‌ చేసుకుంటూ ఫోటోలను పోస్ట్ చేశాడు చంద్రహాస్‌. ప్రస్తుతం ఇవి వైరల్‌ అవుతున్నాయి.

59

అయితే ఇందులో చంద్రహాస్‌ ఇచ్చిన పోజులు వివాదంగా, విమర్శలకు తావిస్తుంది. తన కొత్త కారుపై ఆయన ఇచ్చిన స్టయిలీష్‌ పోజులు చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందులోనూ ఆయన యాటిట్యూడ్‌ చూపిస్తున్నారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. స్వామి మాలలో ఉండి ఇలాంటి పిచ్చి వేశాలేంటి స్వామి.. మాలలోనూ ఇలాంటి యాటిట్యూడ్‌ ఏంటని ప్రశ్నిస్తున్నారు. స్వామి మాల వేసినా యాటిట్యూడ్‌ తగ్గించుకోవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

69

ఇదిలా ఉంటే మరికొందరు స్వామి మాల వేసి మా నోళ్లు మూయించావని, లేదంటూ ఈ సారి గట్టిగా అయిపోయేవాడివని సముదాయించుకుంటున్నారు. అయ్యప్ప భక్తులు ఇలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఫోటోలను, ఆయన యాటిట్యూడ్‌గా అనిపించిన పిక్స్ కి మీమ్స్ జోడిస్తూ మరింత రచ్చలేపుతున్నారు నెటిజన్లు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యాడు చంద్రహాస్‌. 

79

మరోవైపు ప్రభాకర్‌ని కూడా ఆడుకుంటున్నారు నెటిజన్లు. ప్రభాకర్‌, చంద్రహాస్‌ కలిసి ఫ్యామిలీతో టూర్‌ ఫోటోలు పంచుకున్నారు. ఇందులో వారి ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగారు. ఆడవాళ్లని తాకుతూ ప్రభాకర్‌, చంద్రహాస్‌ కనిపించారు. దీంతో స్వామి మాలలో ఉన్నప్పుడు ఆడవాళ్లని తాక కూడదు స్వామి. కనీసం ఇది కూడా తెలియదా అంటూ విమర్శిస్తున్నారు. 

89

మరికొందరు నెటిజన్లు వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న కుర్రాడు, టీనేజ్‌ బాయ్‌.. సరదాగా ఏదో చేయాలనుకుంటాడు. కానీ దాన్ని విమర్శడం సరికాదని, టీనేజ్‌లో ఇలాంటివి కామనే అంటున్నారు. ఏం చేసినా ట్రోల్‌ చేయడం ఆపండని మద్దతు పలుకుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ప్రభాకర్‌, ఆయన కుమారుడు సోషల్‌ మీడియాకి మంచి కంటెంట్‌ ఇస్తున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

99

ఇక చంద్రహాస్‌ హీరోగా పరిచయం అయిన చిత్రానికి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు ఏవీఆర్‌ మూవీ వండర్స్ సంపత్‌ వి రుద్ర దర్శకత్వంలో ఓ సినిమా, ప్రభాకర్‌ సొంత నిర్మాణ సంస్థ శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్ లో మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎంట్రీతోనే మూడు సినిమాలు లైనప్‌లో ఉండటం విశేషమనే చెప్పాలి. మొత్తానికి ప్రభాకర్‌ తన కుమారుడిని హీరోగా నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాంచన, దీప సూపర్ హ్యాపీ- జ్యోపై పారు ఫైర్- సూరజ్ పై జ్యో రివేంజ్
Recommended image3
Savitri: తాగి షూటింగ్ కు వచ్చి.. వాంతి చేసుకున్న సావిత్రి, విజయ నిర్మల ఏం చేసిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved