- Home
- Entertainment
- చాలా మంది హీరోయిన్లు ఆ ఇంజక్షన్ వాడతారు.. నన్నూ ఒత్తిడి చేశారు, ఇషా గుప్తా షాకింగ్ కామెంట్స్
చాలా మంది హీరోయిన్లు ఆ ఇంజక్షన్ వాడతారు.. నన్నూ ఒత్తిడి చేశారు, ఇషా గుప్తా షాకింగ్ కామెంట్స్
నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది.

నార్త్ బ్యూటీ ఇషా గుప్తా జోరు సోషల్ మీడియాలో కొనసాగుతోంది. సినిమాల కంటే బోల్డ్ ఫోటోషూట్స్ తోనే ఇంతటి పాపులారిటీ సొంతం చేసుకుంది. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఇషా గుప్తా చెలరేగిపోతోంది. అప్పుడప్పుడూ సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో మెరుస్తోంది ఈ బ్యూటీ.
ఇంస్టాగ్రామ్ లో Esha Gupta ఫోజులు నెటిజన్లకు కిక్కిచ్చేలా ఉంటాయి. భారీ అందాలతో ఇషా గుప్తా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ ఇలా అన్నింటిలో ఇషా గుప్తా తన మార్క్ ప్రదర్శిస్తోంది. ఇషా గుప్తా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా అందులో తనదైన శైలిలో బోల్డ్ మార్క్ ఉంటుంది.
బికినీ ఫోజుల్లో బోల్డ్ గా కనిపించడం ఇషాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అంతలా తన హాట్ నెస్ తో కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది ఈ భామ. గతంలో ఇషా చేసిన టాప్ లెస్, సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ సంచలనం సృష్టించాయి. ఇక ఇషా గుప్తా తరచుగా ఇండస్ట్రీలో తనకు ఎదురైనా చేదు అనుభవాలని కూడా బయట పెడుతోంది.
తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని ఇషా గుప్తా పేర్కొంది. గతంలో అవుట్ డోర్ షూటింగ్ లో కొందరు తనని లైంగికంగా వేధించారని చెప్పిన ఇషా గుప్తా తాజాగా మరో సంచలన విషయాన్ని కూడా రివీల్ చేసింది. చిత్ర పరిశ్రమలో నటీమణులకు చాలా ఒత్తిడి ఉంటుంది.
మరింత అందంగా కనిపించాలని ఒత్తిడి చేస్తుంటారు. చిన్నపాటి లోపం కూడా ఉండకూడదు అని భావిస్తారు. నా కెరీర్ బిగినింగ్ లో నేను కూడా అలాంటి ఒత్తిడికే గురయ్యాను. ఇండస్ట్రీలోని కొందరు తన ముక్కు గుండ్రంగా ఉందని.. షార్ప్ గా చేయించుకోవాలని ప్రెజర్ చేశారు. మరికొందరు ఇంకా మంచి స్కిన్ కలర్ ఉండాలని అన్నారు.
మంచి స్కిన్ కలర్ కోసం ఇంజక్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. ఆ ఇంజక్షన్ గురించి ఆరా తీశాను. ఆ ఒక్క ఇంజక్షన్ రూ.9000 ఉంటుందని తెలిసింది. ఆ ఇంజక్షన్ పేరు నేను చెప్పను. అందం కోసం ఆ ఇంజక్షన్ ని చాలా మంది నటీమణులు ఉపయోగిస్తున్నారు అని ఇషా గుప్తా పేర్కొంది.
ఇక తనకు కుమార్తె పుడితే మాత్రం నటీమణి కావాలని కోరుకొను అని ఇషా తేల్చి చెప్పేసింది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ పై అందంగా కనిపించాలనే మానసిక ఒత్తిడి ఉంటుంది. అది నా కుమార్తెకు వద్దు. నా కూతురు క్రీడాకారిణి అయితే సంతోషిస్తాను అని ఇషా పేర్కొంది. ఇంకా పెళ్లి కానీ ఇషా అప్పుడే కుమార్తె గురించి ఇలా కలలు కంటోంది.