రోహిణి కోసం అవినాశ్ త్యాగం, విష్ణు ప్రియకు ఎట్టకేలకు న్యాయం చేసిన ఇంటి సభ్యులు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశలో కూడా రసవత్తరంగానే సాగుతోంది. బిగ్ బాస్ ఈసారి చాలా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశారు. ఫినాలే కోసం టాస్క్ లు ఆడిస్తూనే.. రోజుకో గాజా బజాన ఏర్పాటు చేస్తున్నాడు బిగ్ బాస్.
ఇక ఫస్ట్ ప్రేరణ, సెకండ్ నబిల్ ఈ అవకాశం వచ్చింది కాని.ఇక తాజాగా బిగ్ బాస్ పెట్టిన గేమ్ కు హౌస్ మెంట్స్ అల్లాడిపోయారు. అంతే కాదు బిగ్ బాస్ లో కి వచ్చిన తరువాత వాళ్లు ఆడియన్స్ ను రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. కాని వారిని ఎంటర్టైన్ చేసిన వారు లేదు. సో ఈ ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్నవారి కోసం ఎంటర్టైన్మెంట్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో 14 వ వారం నడుస్తోంది. ఈ వీకెండ్ అయిపోతే ఇంకా వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఈ వారంలోపు టాప్ 5 ఎవరు.. ఫినాలే కోసం పోటీపడే కంటెస్టెంట్స్ ఎవరు అనేది తెలిసిపోతుంది. ఇప్పటికే ఫినాలే రేసుకు అవినాశ్ వెళ్ళిపోయాడు. టాస్క్ లు ఆడి మరీ ఫైనలిస్ట్ అయ్యాడు. మిగతా నాలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక ఈ వారం అంతా ఓట్ ఆఫ్ అపీల్ కోసం టాస్క్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా..రోజుకోరకంగా టాస్క్ లు పెడుతూ...ఆడియన్స్ ను ఓటు అడిగే అవకాశం ప్రత్యేకంగా కల్పిస్తున్నాడు బిగ్ బాస్.
ఇక 95 వ రోజు జరిగిన ఓట్ ఆఫ్ అపీల్ టాస్క్ లో మొదటి రౌడ్ ను చాలా టఫ్ గా నిర్వహించారు బిగ్ బాస్. అందులో ఒరికొకరు గాయపరుచుకునేంతగా పోటీ పట్టారు. కానిచివరకు ఈ గేమ్ లో కూడా రోహిణి విన్ అయ్యింది. అయితే ఈ విన్నింగ్ కు అవినాశ్ త్యాగం చేశాడు. లేకుంటే అతనే విన్ అయ్యేవాడు. సో రెండో రౌండ్ లో జరిగిన గేమ్ లో విన్నర్ ఎవరు అన్న విషయంలో కన్ ఫ్యూజన్ ఏర్పడింది. సంచాలక్ గా రోహిని ప్లాప్ అయ్యింది.
దాంతో గేమ్ లో విన్ అయిన వారికంటే కూడా.. రూల్స్ పాటిస్తూ.. ఆడినటువంటి విష్ణు ప్రియను విన్నర్ గా ప్రకటించారు. ఇక మొదటి రౌండ్ లో రోహిణి, రెండో రౌండ్ లో విష్ణు ప్రియ గెలవడంతో.. ఎవరికి అవకాశం ఇవ్వాలి అనే ఆప్షన్ ను హౌస్ లో ఉన్నవారందిరకి ఇచ్చారు బిగ్ బాస్. అయితే ఈ సారి మాత్రం అందరిఓట్లు విష్ణు ప్రియకే పడ్డాయి. ఆమెకే అంతా సపోర్ట్ చేశారు. ఒక్క అవినాశ్ మాత్రం రోహిణికి సపోర్ట్ చేశాడు. ఇక విష్ణు ప్రియ ఆడియన్స్ ను తనకు ఓటు వేయాల్సిందిగా వేడుకుంది.
ఇక ఇన్నాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉంటూ.. అందరిని ఎంటర్టైన్ చేసిన కంటెస్టెట్స్ కోసంబిగ్ బాస్ ఎంటర్టైమ్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటుచేశారు. ఇక సింగర్స్ పాడే అద్భుతమైన మెలొడీస్ కు ఇంట్లో ఉన్నవారు మైమరచిపోయారు. రకరకాల పాటలో బ్యాండ్ ట్రూప్ వారు కంటెస్టెంట్స్ ను అలరించడంతో పాటు... టెన్షన్ తో ఉన్నవారికి రిలాక్సేషన్ ఇచ్చారు. ఇలా ఓట్ అపీల్ కోసం మూడో కంటెస్టెంట్ గా విష్ణు ప్రియ ఛాన్స్ కొట్టేసింది. ఇక ఒక్క రోజు మాత్రమే ఉంది. వీకెండ్ రానే వచ్చింది. మరి ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. డబుల్ ఎలిమినేషన్ ఆ.. లేక టాప్ 6 పెడతారా అనేది చూడాలి.
అయితే ఈ 14 వారాలు తానేదో కష్టపడి గేమ్ ఆడినట్టుగా బిల్డప్ ఇస్తూనే..తన పర్సనల్స్ కొంత మందికి నచ్చలేదు. కాని నేను ఆడిన గేమ్ ను దృష్టిలో పెట్టుకుని నాకు ఓట్ చేయండి అంటూ వేడుకుంది. అంతే కాదు ఇప్పటి వరకూ బిగ్ బాస్ తెలుగు లో మహిళా విజేత లేరు. నన్ను ఈసీజన్ విన్నర్ ను చేయడానికి ఓట్ చేయండి అంటూ వేడుకుంది. ఒక్క వారంమాత్రమే ఉంది ప్లీజ్ సపోర్ట్ మీ అంటూ వేడుకుంది.