- Home
- Entertainment
- జబర్దస్త్ కమెడియన్ పై ప్రేమను బయటపెట్టి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ సుజాత... గుండెలు పగిలేలా ఏడ్చిన యాంకర్ రష్మి..!
జబర్దస్త్ కమెడియన్ పై ప్రేమను బయటపెట్టి ఎమోషనల్ అయిన బిగ్ బాస్ సుజాత... గుండెలు పగిలేలా ఏడ్చిన యాంకర్ రష్మి..!
జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో చాలా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. కామెడీ షోలో కన్నీళ్లు పారాయి. భావోద్వేగాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎమోషన్స్ వెనుకున్న అసలు కారణం ఏమిటో చూద్దాం..

Jabardasth
జబర్దస్త్ (Jabardasth)వేదికపై ప్రేమ కథను, జంటలు సాధారణమే. ఈ కామెడీ షో సాక్షిగా రష్మీ-సుధీర్ అనే బుల్లితెర ప్రేమ జంట అవతరించారు. పదేళ్లుగా క్లారిటీ లేని ప్రేమాయణం వాళ్ళ మధ్య సాగుతున్నా జనాలకు బోర్ కొట్టలేదు. క్రేజీ లవ్ బర్డ్స్ గా వాళ్ళు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Jabardasth
రష్మీ(Rashmi Gautam)-సుధీర్ తర్వాత ఇమ్మానియేల్-వర్ష అదే స్థాయిలో లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వర్ష లవ్స్ ఇమ్మానియేల్ అనే ట్యాగ్ ఆమెకు కెరీర్ ఇచ్చింది. అలాగే ఇమ్మానియల్ కూడా వర్షతో జతకట్టి ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ నుండి కొందరు సీనియర్స్ వెళ్లిపోవడంతో ఇమ్మానియల్ లాంటి కమెడియన్స్ జబర్దస్త్ వేదికను ఆక్రమించారు.
Jabardasth
ఇదిలా ఉంటే ముచ్చటగా మూడో జంట అవతరించింది. జోర్దార్ సుజాత-రాకింగ్ రాకేష్ మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తుంది. అనేక బుల్లితెర షోలలో వీరిద్దరూ ప్రేమికులుగా షోలు చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ జంట మధ్య భావోద్వేగ సన్నివేశం చోటు చేసుకుంది. రాకేష్ ఎంత సంపాదిస్తున్నాడు, అతని వెనుక ఏముంది అనేది నాకు అనవసరం. రాకేష్ నాతో ఉంటే చాలు అని చెప్పింది సుజాత.
Jabardasth
జడ్జి రోజా సుజాతను ఒక ప్రశ్న అడిగారు. మీ ఇద్దరికీ చిన్న గొడవొచ్చి రాకేష్ నిన్ను వదిలి వేరే అమ్మాయితో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి?.. అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా సుజాత.. రాకేష్ వేరే అమ్మాయితో వెళితే నా ప్రాబ్లం లేదు. ఆయనతో వెళ్లిన అమ్మాయి రాంగ్ పర్సన్ కాకూడదు. ఒకవేళ రాకేష్ తన సంతోషం కోసం వేరే అమ్మాయితో వెళ్లినా నాకు ఓకె. తన సంతోషం కోసం రాకేష్ ని వదిలేస్తా అంటూ ఎమోషనల్ అయ్యింది.
Jabardasth
సుజాత మాటలకు రాకేష్ కన్నీరు పెట్టుకున్నారు. జడ్జెస్ తో పాటు సెట్ లో ఉన్న కమెడియన్స్ షాక్ అయ్యారు. రష్మీ మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. కాగా కారణం ఏమిటో తెలియదు కానీ రష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు.
Jabardasth
లేటెస్ట్ ఎక్ట్రా జబర్దస్త్ ప్రోమో చివర్లో రష్మీ నిరవధికంగా ఏడవడం చూపించారు. దీంతో రష్మీ అంతలా ఏడవడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరి ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎక్ట్రా జబర్దస్త్ షో తర్వాత క్లారిటీ రానుంది.