- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 (Day 22): అమ్మ అంటూనే సంజనా నిజ స్వరూపం బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్.. తనూజ, సుమన్ సేఫ్
Bigg Boss Telugu 9 (Day 22): అమ్మ అంటూనే సంజనా నిజ స్వరూపం బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్.. తనూజ, సుమన్ సేఫ్
బిగ్ బాస్ తెలుగు 9 సోమవారం(22వ) ఎపిసోడ్‌లో సంజనా హైలైట్ అయ్యింది. ఫుడ్ విషయంలో ఆమె తనూజ, పవన్, దివ్యాలపై ఫైర్ అయ్యింది. మరోవైపు తనూజ, సుమన్ శెట్టి ఈ వారం ఇమ్యూనిటీ పొందారు.

బిగ్ బాస్ 22 వ ఎపిసోడ్ సంజనా గోల గోల
నాగార్జున హోస్ట్ గా రన్ అవుతున్న బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటీ షో మూడు వారాలు పూర్తి చేసుకుంది. నాల్గో వారం షురూ అయ్యింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌజ్ నుంచి శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. సంజనా మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయ్యారు. కానీ హౌజ్ మేట్స్ త్యాగాలు చేయడంతో ఆమె మళ్లీ హౌజ్‌లోకి వచ్చింది. కానీ తనదైన స్టయిల్‌లో ఆమె వచ్చినప్పట్నుంచి రచ్చ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా సోమవారం(22వ) ఎపిసోడ్‌లో ఆమె ఫుడ్ కోసం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కుకింగ్‌లో దివ్య ఉన్నారు. ఆమెని కాదని కిచెన్ మేనేజర్‌ని అడిగి తాను పోప్ పెట్టుకుంటానని తెలిపింది. తనూజ ఓకే చెప్పింది.
ఫుడ్ విషయంలో సంజనా ఫైర్
అయితే దివ్యతో కాకుండా శ్రీజతో తాను పోప్ చేయించుకుంటానని సంజనా చెప్పింది. అందుకు దివ్య అభ్యంతరం తెలిపింది. అంతలోనే కిచెన్ సామాను(రేషన్) వచ్చింది. అయితే అవి తీసి చూసుకునేందుకు తనూజ కాస్త టైమ్ అడిగింది. కానీ పాత ఐటెమ్స్ తోనే తాను పోప్ పెట్టుకుంటానని సంజనా చెప్పింది. ఈ విషయంలో తనూజ కన్‌ఫ్యూజ్ అయ్యింది. కానీ సంజనా వాదిస్తూనే ఉంది.
ఫుడ్ తినను అంటూ మారాం చేసిన సంజన
దీంతో తన కిచెన్ విషయంలో ఎవరూ ఇన్‌వాల్వ్ కావద్దు, తానే పోప్ పెట్టిస్తానని తనూజ సీరియస్‌గా చెప్పగా, సంజనా అలిగి వెళ్లిపోయింది. చిన్న పోప్ కోసం ఇంతగా బ్రతిమాలించుకుంటారా అంటూ ఫైర్ అయ్యింది. అటు కెప్టెన్ డీమాన్ పవన్, ఇటు తనూజ, దివ్యాలపై ఆమె మండిపడింది. తాను ఫుడ్ తినను అంటూ మారాం చేసింది. హోనర్ల వద్ద కాకుండా టెనెంట్ల వద్ద ఆమె ఫుడ్ తీసుకుంది. ఈ విషయంలో అంతా బ్రతిమాలారు, కెప్టెన్ పవన్ కూడా సారీ చెప్పారు. అయినా వినలేదు. సోమవారం ఎపిసోడ్ మొత్తం సంజనా తనఫుడ్ విషయంలోనే గొడవ చేస్తూ వచ్చింది.
బిగ్ బాస్ ఇమ్యూనిటీ టాస్క్
ఇంతలో బిగ్ బాస్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యేందుకు ఇమ్యూనిటీ టాస్క్ ఇచ్చారు. నామినేషన్‌కి ముందుగానే హౌజ్‌మేట్స్ కి ఈ అవకాశం కల్పించారు. అందుకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఇందులో హౌజ్ మేట్స్ ఆరు టీములుగా విడిపోయారు. ఒక్కో టీమ్లో ఇద్దరు ఉంటారు. సుమన్ శెట్టి- దివ్య, ఇమ్మాన్యుయెల్-సంజనా, భరణి-తనూజ, శ్రీజ-రాము రాథోడ్, కళ్యాణ్-రీతూ చౌదరీ, హరీష్-ఫ్టోరా. వీరు తమకు కేటాయించిన బోర్డ్ ల్లో ఉండే బ్లాగ్స్ ని పగలగొట్టాల్సి ఉంటుంది. వాటిని పగలకొట్టి పైన ఉన్న స్టార్స్ ని తీసుకోవాలి. ఎవరైతే ముందుగా అన్ని బ్లాగ్స్ ని కొట్టి స్టార్‌ని తీసుకుంటారో వాళ్లు విన్నర్. మొదట సుమన్ శెట్టి-దివ్య, ఇమ్మాన్యుయెల్- సంజనా పోటీలో పాల్గొనగా, సుమన్, దివ్య విన్ అయ్యారు.
తనూజ, సుమన్ శెట్టి నామినేషన్ నుంచి సేవ్
ఆ తర్వాత భరణి-తనూజ, హరీష్-ఫ్లోరా పోటీలో పాల్గొనగా, ఇద్దరూ పౌల్ అయ్యారు. అనంతరం కళ్యాణ్-రీతూ చౌదరీ, శ్రీజ-రాము రాథోడ్ పోటీపడ్డారు. వీరు కూడా పౌల్ అయ్యారు. కేవలం సుమన్ శెట్టి, దివ్య టీమ్ విన్నర్ అయ్యింది. ఇక రెండో రౌండ్‌లో బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ ఇద్దరు మరో ఇద్దరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. వాళ్లు తనూజ, ఫ్లోరాని ఎంపిక చేశారు. ఈ నలుగురు తమకు ఇచ్చిన బ్రిడ్జ్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు హౌజ్‌మేట్స్ ని అప్పీల్ చేసుకోవాలి. మొదట ఇమ్మాన్యుయెల్‌ని సంచాలక్‌గా ఉన్న డీమాన్ పవన్ ఎంపిక చేయగా, ఆయన తనూజ, సుమన్ శెట్టిలకు బ్రిడ్జ్ నిర్మాణానికి చెక్కలను అందించారు. ఆ తర్వాత శ్రీజ కూడా తనూజ, సుమన్ శెట్టిలకు ఇచ్చింది. ఫైనల్‌గా భరణికి ఛాన్స్ రాగా, ఆయన కూడా తనూజ, సుమన్ శెట్టిలకే ఆ చెక్కలను అందించారు. దీంతో వీరిద్దరి బ్రిజ్డ్ లు పూర్తయ్యాయి. ఈ ఇద్దరు ఇమ్మూనిటీ బ్యాడ్జ్ లను పొందారు. నాల్గో వారం నామినేషన్స్ నుంచి తనూజ, సుమన్ శెట్టి సేవ్ అయ్యారు. వారిని ఈ వారం ఎవరూ నామినేట్ చేయడానికి లేదు.
సంజనా రియాలిటీ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్
ఈ క్రమంలో హౌజ్‌మేట్స్ మధ్య సరదాగా సంఘటనలు చోటు చేసుకున్నాయి. సంజనా వెళ్లి ఓ చోట కూర్చొని మాట్లాడుతుండగా, ఇమ్మాన్యుయెల్ సెటైర్లు వేశారు. మా అమ్మ ఎక్కడ. ఎలాగూ గేమ్‌లో ఓడిపోయింది. అక్కడ అయిపోయిందని ఎక్కడ రచ్చ చేస్తోందో, ఎవరి మీద గొడవకి రెడీ అవుతుందో అని ఆమె గురించి అసలు విషయం బయటపెట్టాడు. గేమ్ ఆడకుండా ఇలా గొడవలతో కెమెరాల్లో చిక్కాలని ప్రయత్నిస్తుందనే కోణంలో ఇమ్మాన్యుయెల్ కామెంట్ చేయడం విశేషం. ఇక కెప్టెన్ డీమాన్ పవన్.. గతవారం దొంగతనం చేసిన వారికి శిక్ష ఇవ్వాలనే చర్చ తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంలోనూ సంజనాతో వాగ్వాదం జరిగింది. తాను తలుచుకుంటే ఇట్టే జైల్లో పెట్టగలను అన్నాడు పవన్. దాన్ని సీరియస్‌గా తీసుకుని పెద్ద గొడవ చేసింది సంజనా. పవన్ ఓవర్ చేస్తున్నాడని, చాలా తీసేసినట్టు మాట్లాడుతున్నాడని, అలా అంటే ఎవరూ పడరు అని, అలా చేయకూడదని ఆమె ఫైర్ అయ్యింది. మరోసారి హౌజ్‌లో సంజనా రచ్చ చేయడం విశేషం.