- Home
- Entertainment
- దివ్వెల మాధురితో పెట్టుకుంటే ఎలిమినేషనేనా? నోరు జారిన ఇమ్మాన్యుయెల్.. మొత్తం రచ్చ రచ్చ
దివ్వెల మాధురితో పెట్టుకుంటే ఎలిమినేషనేనా? నోరు జారిన ఇమ్మాన్యుయెల్.. మొత్తం రచ్చ రచ్చ
దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో సందడి చేస్తోంది. అయితే ఆమెపై ఇమ్మాన్యుయెల్ షాకింగ్ కామెంట్ చూశాడు. మాధురితో పెట్టుకుంటే ఎలిమినేషనే అని కామెంట్ చేయడం విశేషం.

ఇమ్మాన్యుయెల్, తనూజ మధ్య గొడవ
బిగ్ బాస్ తెలుగు 9 ఏడోవారం మంగళవారం ఎపిసోడ్‌లో నామినేషన్లకి సంబంధించిన చర్చ జరిగింది. కళ్యాణ్ తనూజని కాకుండా సంజనాని నామినేట్ చేసిన నేపథ్యంలో కళ్యాణ్‌పై ఫైర్ అయ్యాడు ఇమ్మాన్యుయెల్. ఇది తనూజ వరకు వెళ్లింది. ఆమె తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫైర్ అయ్యింది. వీళ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఈ విషయంలోనే నువ్వు స్వీట్ పాయిజన్ అంటూ కామెంట్ చేసుకునే స్థాయికి వెళ్లింది. అటు తనూజ, ఇటు ఇమ్మాన్యుయెల్ రెచ్చిపోయారు.
సంజనాపై తనూజ, కళ్యాణ్ ఫైర్
మరోవైపు కళ్యాణ్ కూడా దీనిపై స్పందిస్తూ ఇమ్మాన్యుయెల్ చెప్పినంత మాత్రాన ఆయనదే ఎందుకు ఫాలో అవుతాను, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది కదా అని తెలిపారు. అయితే కళ్యాణ్ విషయంలో సంజనా నోరు జారింది. తనూజ నిఖిల్‌కి క్లోజ్ అవుతుందని, అతనితో వెళ్లిపోతుందని, నువ్వు ఒంటరైపోయావని కళ్యాణ్‌ని అన్నదట. ఈ విషయంలో కళ్యాణ్, తనూజ ఫైర్ అయ్యారు. సంజనాపై విరుచుకుపడ్డారు. తనకు ఇలాంటివి అంటగట్టడమేంటంటూ తనూజ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు, సంజనాని ఒక రేంజ్‌లో ఆడుకున్నాడు. కంటెంట్ కోసం సంజనా ఇలా చేస్తుందని తనూజ ఆరోపించింది. తాను ఒకరి విషయంలో అలా ఉండనని, అందరిని ఈక్వల్‌గానే డీల్ చేస్తానని వివరణ ఇచ్చేప్రయత్నం చేసింది సంజనా.
ఇమ్మాన్యుయెల్‌ని సొంత కొడుకులా భావించిన సంజనా
అంతేకాదు తనూజ ఒక అడుగుముందుకేసి ఆమెని ఎలిమినేట్ అయ్యాక కూడా మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చామని, ఆ విషయంలో తాము బుద్ది తెచ్చుకోవాల్సింది అని చెప్పింది. దీంతో తనకోసం కాఫీ త్యాగం చేశావని, కానీ ఆ తర్వాత తాగావని కౌంటర్ ఇచ్చింది సంజనా. కాసేపు హాట్ హాట్‌గా మాట్లాడుకున్నారు. తర్వాత కూల్ అయ్యారు. ఇంకోవైపు ఇమ్మాన్యుయెల్ విషయంలో సంజనా ఎమోషనల్ అయ్యింది. తనకు అతను కొడుకులాగా అని తెలిపింది. తన బిడ్డని వదిలేసి షోకి వచ్చానని, బాబుని చూసుకోలేకపోతున్నానని, కానీ ఇమ్మాన్యుయెల్ ఓ కొడుకులా నవ్విస్తాడని, ఎంటర్టైన్ చేస్తున్నాడని, దీంతో కొడుకుని అతనిలో చూసుకుంటున్నానని తెలిపింది సంజనా. కాసేపు ఎమోషనల్ అయ్యింది.
మాధురి, సంజనా గ్యాంగ్‌లుగా బిగ్ బాస్ హౌజ్
అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్లకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఇచ్చారు. దీని ప్రకారం హౌజ్‌ని రెండు గ్యాంగ్స్ గా చేశారు. ఒక గ్యాంగ్ కి సంజనా సైరెన్ లీడర్ అయితే, మరో గ్యాంగ్‌కి మాస్ మాధురీ లీడర్. వీరిద్దరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. వీరు తమ టీమ్ సభ్యులను పెంచుకునే అవకాశం ఉంది. ఎవరి టీమ్‌లో ఎక్కువ సభ్యులు ఉంటారో వాళ్లు కెప్టెన్సీకి నేరుగా కంటెండర్‌గా మారతారని తెలిపారు. అదే సమయంలో ఏ కంటెస్టెంట్ వద్ద అయితే ఎక్కువ డబ్బులు ఉంటాయో, వాళ్లు కంటెండర్‌కి అర్హత సాధిస్తారు. ఈ నియమం ప్రకారం హౌజ్‌ని రెండు గ్యాంగ్‌లుగా విడగొట్టాడు బిగ్ బాస్. తమ గ్యాంగ్లో ఉన్నదంతా దొంగలే. వాళ్లు విభిన్న వేషాధారణలో ఉన్నారు. చూడ్డానికి క్రేజ్‌గా, ఫన్నీగా ఉన్నారు. నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇందులో ఇమ్మాన్యుయెల్ తనదైన స్టయిల్‌లో కామెడీ చేస్తూ నవ్వించడం విశేషం.
దివ్వెల మాధురీపై ఇమ్మాన్యుయెల్ హాట్ కామెంట్
ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్.. మధురీపై షాకింగ్ కామెంట్లు చేశారు. సంజనా వైపు ఉండాల్సిన ఇమ్మాన్యుయెల్ కాసేపు మాధురీ వైపు తిరిగాడు. ఈ క్రమంలో ఆమె గొప్ప అంటూ నినాదాలు చేశారు. నోరు జారి మాధురీ అమరహే అంటూ కామెంట్ చేశాడు. వెంటనే దాన్ని సరి చేసుకున్నాడు. మరోవైపు `సోమవారం ఉంటుంది నామినేషన్, మా అక్కతో పెట్టుకుంటే అయిపోతారు ఎలిమినేషన్` అంటూ నినాదం చేయడం హైలైట్‌గా నిలిచింది. మాధురి టార్గెట్ చేసే వాళ్లు ఎలిమినేట్ అవుతారని ఇమ్మాన్యుయెల్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇదే అందరిని ఆశ్చర్యపరిచింది. మొత్తంగా మంగళవారం ఎపిసోడ్ ఆద్యంతం ఫైరింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ముగిసిందని చెప్పొచ్చు.