కృష్ణంరాజు చివరి కోరిక తీర్చలేకపోయిన ప్రభాస్.. ఎప్పటికీ బాధపడే విషయం ఏంటంటే?
రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా రాణిస్తున్న ప్రభాస్. తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నాడు. కానీ కృష్ణంరాజు చివరి కోరికని మాత్రం డార్లింగ్ తీర్చలేకపోయారు.

కృష్ణంరాజు చివరి కోరిక తీర్చని ప్రభాస్
రెబల్ స్టార్ కృష్ణంరాజుది రాజుల కుటుంబం అయినప్పటికీ నటన, కళపై మక్కువతో సినిమాల్లోకి వచ్చారు. తనని తాను నిరూపించుకున్నారు. విలన్‌గా సినిమాలు చేశారు. హీరోగా చేసి మెప్పించారు. తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారు. రెబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మూడేళ్ల క్రితం ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు నట వారసుడిగా డార్లింగ్ ప్రభాస్ రాణిస్తున్నారు. కృష్ణంరాజు తమ్ముడు, నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు తనయుడే ప్రభాస్. చిన్నప్పట్నుంచి తమకు అన్నీ పెదనాన్ననే అనేలా పెరిగారు. ఆ తర్వాత కూడా అదే రిలేషన్ కొనసాగించారు. అయితే ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకి ఒక చివరి కోరిక ఉంది. దాన్ని డార్లింగ్ తీర్చలేకపోయారు.
ప్రభాస్ పిల్లలతో ఆడుకోవాలనుకున్న కృష్ణంరాజు
ప్రభాస్ పెళ్లికి సంబంధించి చాలా ఏళ్లుగా చర్చ నడుస్తోంది. గత పదేళ్ల క్రితం నుంచే పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు భావించారు. సంబంధాలు చూస్తున్నామని కూడా ఆయన మీడియాతో తెలిపారు. కానీ అది అలానే పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కృష్ణంరాజు లేడు. కానీ ఆయన కోరిక మాత్రం అలానే ఉండిపోయింది. ప్రభాస్ విషయంలో కృష్ణంరాజుకు ఉన్న కోరిక ఆయనకు పెళ్లి చేయాలని, తాను బాగా కోరుకునేది అదొక్కటే అని తెలిపారు. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని, వాళ్ల పిల్లలతో ఆడుకోవాలని ఉందని తెలిపారు కృష్ణంరాజు. `రాధేశ్యామ్` మూవీ ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
పెద్దమ్మ కోరిక అయిన తీరుస్తాడా?
ఆ తర్వాత కృష్ణంరాజు చనిపోయారు. ఆయన కోరిక ఇప్పటికీ తీరలేదు. పిల్లలతో ఆడుకోవడం ఎలాగూ జరగదు, కానీ పెళ్లి అయినా చేసుకుంటాడనుకుంటే ఇప్పట్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. అవి పూర్తి కావడానికే నాలుగైదేళ్లు పడుతుంది. అంటే ఇప్పట్లో డార్లింగ్ పెళ్లి కష్టమనే చెప్పాలి. అయితే పెద్దమ్మ శ్యామలాదేవి చాలా సార్లు ప్రభాస్ పెళ్లి కోరికని వెళ్లడించింది. అందుకోసం గుళ్లు గోపురాలు తిరుగుతుంది. బాబు పెళ్లి చేసుకోవాలని తాను దేవుడిని మొక్కుకున్నట్టు తెలిపారు. మరి పెద్దమ్మ కోరికనైనా డార్లింగ్ తీరుస్తాడా అనేది చూడాలి.
వరుసగా భారీ సినిమాలతో ప్రభాస్ బిజీ
ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. గ్లోబల్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఇండియన్ సినిమాని ప్రపంచ గుర్తించే విషయంలో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారు. `బాహుబలి`తో డార్లింగ్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `ది రాజాసాబ్`, అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఫౌజీ` చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో `స్పిరిట్` చేయనున్నారు. వీటితోపాటు నాగ్ అశ్విన్‌తో `కల్కి 2`, ప్రశాంత్ నీల్‌తో `సలార్ 2` చేయాల్సి ఉన్నాయి. ప్రశాంత్ వర్మతో ఓ సినిమా ఉంది. ఇవన్నీ పాన్ ఇండియా స్థాయిని మించి తెరకెక్కుతున్న చిత్రాలు కావడం విశేషం.
ప్రభాస్ బర్త్ డే ట్రీట్స్
హీరోగా ప్రభాస్‌కి ఎవరికీ లేని లైనప్ ఉంది. ఆయన పేరుతోనే ఇప్పుడు ఐదారువేల కోట్ల బిజినెస్ జరుగుతుంది. సినిమా కెరీర్ పరంగా ఆయనకు ఢోకా లేదు. కానీ పెళ్లి గురించే అంతా ఆలోచిస్తున్నారు. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. మరి డార్లింగ్ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతాడో చూడాలి. ఈ గురువారం డార్లింగ్ తన 45వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాల నుంచి కొత్త అప్ డేట్లు రాబోతున్నాయి. `ది రాజాసాబ్`, `ఫౌజీ`తోపాటు `స్పిరిట్` అప్ డేట్ కూడా రాబోతుందని సమాచారం. ఈ బర్త్ డేకి డార్లింగ్ ఫ్యాన్స్ కి పండగే పండగ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.