తనూజ కత్తిలాగ ఉంటది, రీతూతో ఇమ్మాన్యుయెల్ సరసాలు.. డీమాన్ పవన్ టచ్‌పై రచ్చ
తనూజపై ఇమ్మాన్యుయెల్ క్రేజీ కామెంట్ చేశాడు. ఆమె కత్తిలాగా ఉందని రాజులు దివ్య, రీతూ, కళ్యాణ్‌లకు చెప్పాడు. మరోవైపు రాణి రీతూతో సరసాలు ఆడటం హైలైట్‌గా నిలిచింది.

ఇమ్మాన్యుయెల్, సుమన్ శెట్టిలతో క్రేజీ డాన్సులు
బిగ్ బాస్ తెలుగు 9 షో 66 వ రోజుకి చేరుకుంది. ఇక బుధవారం ఎపిసోడ్‌లో చాలా వరకు ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ హౌజ్‌ని రాజ్యంగా మార్చారు. రీతూ, దివ్య, కళ్యాణ్ రాజులు, రాణులుగా వ్యవహరిస్తుండగా, ఇమ్మాన్యుయెల్, గౌరవ్, సుమన్ శెట్టి, భరణి ప్రజలుగా, తనూజ, నిఖిల్, సంజనా, డీమాన్ పవన్ కమాండర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల చేత సేవలు చేయించుకుంటున్నారు రాజులు. అందులో భాగంగా చిరు నవ్వుతో డాన్స్ లు చేయించారు. ఇమ్మాన్యుయెల్ ముఠామేస్త్రి స్టెప్ వేశారు. అలాగే సుమన్ శెట్టితో వీణ స్టెప్ వేయించారు. భరణి, గౌరవ్‌లను కూడా ఒక రేంజ్‌లో ఆడుకున్నారు.
రీతూతో ఇమ్మాన్యుయెల్ పులిహోర
ఈ క్రమంలో రీతూ చౌదరీ.. ఇమ్మాన్యుయెల్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆయన ముందుకు వచ్చి రొమాంటిక్‌గా పులిహోర కలిపింది. ఇమ్మాన్యుయెల్ కూడా ఆమెకి అలానే రియాక్ట్ అయ్యాడు. దీంతో ఇది చూసిన రాజు కళ్యాణ్.. ఇమ్మాన్యుయెల్ రాణి రీతూతో సరసాలు ఆడుతున్నాడని దివ్యకి చెబుతాడు. దివ్య కూడా నమ్ముతుంది. ఇదే విషయాన్ని నిలదీయగా, ఇమ్మాన్యుయెల్ తన వద్ద అసభ్యంగా ప్రవర్తించినట్టుగా చెబుతుంది రీతూ. దీంతో ఇమ్యాన్యుయెల్‌కి శిక్ష వేశారు. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ కామెడీ హైలైట్‌గా నిలిచింది.
తనూజ కత్తిలా ఉంది
ఈ సందర్భంగానే ఇమ్మాన్యుయెల్‌ని ప్రశ్నించారు రాజు రాణులు. హౌజ్‌లో ఒక్కొక్కరి గురించి చెప్పమనగా, తనూజ గురించి చెబుతూ, ఆమె కత్తిలాగా ఉంటుందని చెప్పడం విశేషం. ఆ తర్వాత దాన్ని కవర్ చేస్తూ కత్తిలాగా వర్క్ చేస్తుందన్నాడు ఇమ్మాన్యుయెల్. భరణి అమాయకుడని తెలిపారు. మరోవైపు సుమన్ శెట్టి చేత వాటర్‌మిలన్ తినిపించుకుంది రీతూ. ఈ క్రమంలో సుమన్ శెట్టిని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఆయన్ని రీతూతోపాటు, దివ్య, కళ్యాణ్ కూడా ఆడుకున్నారు. ఇది కూడా నవ్వులు పూయించింది.
డీమాన్ పవన్‌పై తనూజ ఫైర్
ఇక తనని డీమాన్ పవన్ వెనకాల నుంచి టచ్ చేయడాన్ని తనూజ రచ్చ చేసింది. వెళ్దాం పదా అంటే వచ్చేదాన్ని కదా, ఎందుకు అలా గట్టిగా తోయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించింది. తాను నెమ్మదిగానే అన్నానని డీమాన్ అనగా, అది తనకు గట్టిగా అనిపించిందని, అలా అనడం నచ్చలేదని తెలిపింది తనూజ. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. గట్టిగా అరుసుకునే వరకు వెళ్లింది.
రాజుగా మారిన కమాండర్
ఇక ప్రజలు.. కమాండర్లుగా మారేందుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. అందులో భాగంగా ఇద్దరు కమాండర్లు, మరో ఇద్దరు ప్రజలు పోటీ పడాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో కమాండర్లు నిఖిల్, పవన్.. ప్రజలు గౌరవ్, భరణిలతో పోటీ పడి గెలిచి తమ కమాండర్ స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ప్రజలకు ఉన్న అన్ని అవకాశాలు అయిపోవడంతో వాళ్లు ప్రజలుగానే మిగిలిపోయారు. మరోవైపు కమాండర్లకి రాజులుగా మారే అవకాశం ఇచ్చారు. ఇందులో దివ్య, నిఖిల్ పోటీకి దిగారు. ఈ టాస్క్ లో నిఖిల్ ఈజీగా గెలిచాడు. ఆయన రాజు అయ్యాడు. దివ్య ఓడిపోయి కమాండర్ గా మారిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో టాస్క్ ల కంటే రాజులు, రాణులు, ప్రజల మధ్య చోటు చేసుకున్న సన్నివేశాలే నవ్వులు పూయించారు.