- Home
- Entertainment
- `జబర్దస్త్` వర్ష ముందే మరో అమ్మాయికి లవ్ ప్రపోజ్‌చేసిన ఇమ్మాన్యుయెల్.. తన లైఫ్‌లో వర్ష లేదంటూ షాక్..
`జబర్దస్త్` వర్ష ముందే మరో అమ్మాయికి లవ్ ప్రపోజ్‌చేసిన ఇమ్మాన్యుయెల్.. తన లైఫ్‌లో వర్ష లేదంటూ షాక్..
`జబర్దస్త్` షోలో ప్రేమ జంటలకు కొదవ లేదు. కానీ వారి మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా వర్ష విషయంలో ఇమ్మాన్యుయెల్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అవుతుంది.

`జబర్దస్త్`లో ఇమ్మాన్యుయెల్, వర్ష షోలో కెమిస్ట్రీ పండిస్తున్న విషయం తెలిసిందే. సుధీర్, రష్మిల తర్వాత ఆ స్థాయిలో పాపులర్ అయ్యాయి. ఇమ్మాన్యుయెల్ పై తన ప్రేమని స్టేజ్‌పైనే చాలా సార్లు వ్యక్తం చేసింది. ఇద్దరూ ఒకరినొకరు లేకుండా ఉండలేమనేంతగా తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు.
కానీ ఇప్పుడు వర్షకి పెద్ద షాకిచ్చాడు ఇమ్మాన్యుయెల్. ఈ రోజు నుంచి తన జీవితంలో వర్ష లేదంటూ సంచలన కామెంట్ చేశారు. గత కొనేళ్లుగా స్కిట్లు చేస్తూ కామెడీని పండించే వీరిద్దరు ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు తన జీవితంలో వర్ష లేదని ఇమ్మాన్యుయెల్ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అవుతుంది.
ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లేటెస్ట్ గా విడుదలైంది. ఇందులో ఇమ్మాన్యుయెల్ చెబుతూ, `ఈ రోజు నుంచి నా జీవితంలో వర్ష లేదు. కేతిక శర్మనే ఉండిందంటూ ఏకంగా స్టేజ్‌పైనే అందరి ముందు ఆమెకి ఐ లవ్ యూ చెప్పారు.
ఇది చూసిన వర్ష ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇమ్మాన్యుయెల్ నుంచి ఇలాంటి మాట రావడంతో ఆమె ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయింది. తాను కూడా తక్కువ తినలేదు. వైష్ణవ్ తేజ్‌కి కమిట్ అయ్యింది. ఆయనతో కలిసి లవ్ సింబల్స్ వేసుకుంటూ ప్రేమ పాటలు పాడుకుంది.
మరి ఇంతకి ఏం జరిగిందంటే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లోకి `రంగరంగవైభవంగా` జోడీ వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ సందడి చేశారు. వీరిద్దరు కలిసి డాన్సులతో, ప్రేమ గీతాలతో హల్ చల్ చేశారు. వీరిద్దరితో కలిసి ఇమ్మాన్యుయెల్, వర్ష స్పెషల్ స్కిట్ ప్లాన్ చేశారు.
కేతిక శర్మని చూసిన ఇమ్మాన్యుయెల్ ఈ రోజు నుంచి వర్ష తన జీవితంలో లేదని, కేతికనే ఉందని చెప్పారు. ఆమెని కూర్చోబెట్టుకుని ప్రేమ పాఠాలు చెప్పాడు. అయితే ఆమె కూడా చెబుతూ భాస్కర్ అని ఇమ్మాన్యుయెల్‌ని పిలవడంతో షో మొత్తం నవ్వులతో హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ఇమ్మాన్యుయెల్ వేసిన పంచ్‌లు కామెడీని పంచాయి.
అలాగే వర్ష కూడా వైష్ణవ్ తేజ్‌తో కలిసి ప్రేమ గీతాలు పాడుకున్నారు. కాసేపు వీరు నలుగురు లవర్స్ ని మార్చుకుని షోలో రచ్చ రచ్చ చేశారు. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వైష్ణవ్ తేజ్, కేతిక సందడి చేయగా, వారితోపాటు ఇమ్మాన్యుయెల్, వర్ష కూడా కలిసిపోయి నవ్వులు పూయించారు. ఆడియెన్స్ కి వినోదాన్ని పంచారు. ప్రస్తుతం విడుదలైన ఈ ప్రోమో వైరల్ అవుతుంది. అయితే ఇమ్మాన్యుయెల్ వర్షపై చేసిన కామెంట్లు సరదా కోసమనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.