- Home
- Entertainment
- చీరలో క్యూట్‌గా కవ్విస్తున్న ఈషా రెబ్బా.. కుర్రాళ్ల హృదయాలను గుచ్చుతున్న కిల్లింగ్ లుక్స్
చీరలో క్యూట్‌గా కవ్విస్తున్న ఈషా రెబ్బా.. కుర్రాళ్ల హృదయాలను గుచ్చుతున్న కిల్లింగ్ లుక్స్
తెలుగు అందం ఈషా రెబ్బా సామాజిక మాధ్యమాల్లో విశేషమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ లేటెస్ట్ గా నిండైన అందాలతో కనువిందు చేస్తుంది. చిలిపిగా కవ్విస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

ఈషా రెబ్బా(Eesha Rebba) ఎక్కువగా ట్రెండీ వేర్‌లో కనిపిస్తుంటుంది. మోడ్రన్ దుస్తులు ధరించి అందాలు ఆరబోస్తుంటుంది. పొట్టి దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లని ఆకట్టుకుంటుంది. అందాల విందుతో వారిని నిత్యం ఎంగేజ్ చేస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా.
చీరలో కనిపించడం చాలా అరుదు. తాజాగా శారీలో (Eesha Rebba Saree Pics) మెరిసిపోతుంది. ఓ ఫంక్షన్‌లో భాగంగా ఈషా రెబ్బా శారీ కట్టినట్టు తెలుస్తుంది. డార్క్ కలర్ శారీలో కనువిందు చేస్తుందీ అందాల సోయగం. క్యూట్ గా కవ్విస్తుంది. కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ శారీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ నిత్యం సామాజిక మాధ్యమాల్లో రచ్చ చేస్తుంటుంది ఈషా రెబ్బా. తన డస్కీ అందాలతో ఘాటు రేపుతూ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. సెక్సీగా ముస్తాబై ఆమె దిగే ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పొచ్చు.
తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకుంది ఈషారెబ్బా. ఈ అమ్మడి కెరీర్ మాత్రం ఒడిదుడుకులతో సాగుతుంది. తెలుగు అమ్మాయి కావడం వల్లే తనకు సరైన అవకాశాలు రావడం లేదంటూ కంప్లైంట్ చేస్తుందీ సెక్సీ భామ. పలు మార్లు ఈ విషయాన్ని వెల్లడించి ఆవేదన వ్యక్తం చేసింది. తను ముంబయి హీరోయిన్ అయి ఉంటే ఇప్పటికే మంచి అవకాశాలను అందుకునేదాన్ని అని తెలిపింది.
అయినా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అందాల ఆరబోతకి, బోల్డ్ రోల్స్ కి కూడా సిద్ధంగానే ఉంది. ఆ మధ్య `ఆహా` కోసం `3రోజెస్` అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్ రోల్ చేసింది. పూర్ణ, పాయల్‌లతో కలిసి నటించింది. మంచి ప్రశంసలందుకుంది. కానీ ఒకటి అర ఛాన్స్ లే తప్ప డిజిటల్‌లోనూ ఆమెకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు.
ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళం, మలయాళంలో `ఒట్టు` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాతో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` సినిమా చేస్తుంది. ఇది చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది. సరైనా ఆఫర్స్ లేకపోయినా గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో కొంత సంపాదిస్తుంది ఈషా.