- Home
- Entertainment
- `సలార్2`లో ఇద్దరు ప్రభాస్‌లు.. `శౌర్యంగ పర్వం` అసలు కథ ఇదే..? `బాహుబలి`ని మించిపోయిందిగా!
`సలార్2`లో ఇద్దరు ప్రభాస్‌లు.. `శౌర్యంగ పర్వం` అసలు కథ ఇదే..? `బాహుబలి`ని మించిపోయిందిగా!
`సలార్2` కథ ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ నీల్ ఏం చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మొదటి పార్ట్ లో చాలా ప్రశ్నలు వదిలేశాడు దర్శకుడు.

`సలార్` భారీ విజయం దిశగా వెళ్తుంది. ప్రభాస్ నటించిన ఈ మూవీ ఐదు వందల కోట్లకు చేరువలో ఉంది. మొదటి వీక్‌లోనే ఈ మార్క్ ని దాటేయబోతుంది. నార్త్ లో `డంకీ` ప్రభావం లేకపోతే ఇంకా భారీగానే ఈ సినిమా వసూళు చేసేది. మరోవైపు సౌత్‌లోనూ పెద్దగా సత్తా చాటలేకపోతుంది. తమిళంలో యావరేజ్‌గానే ఉంది. ఆల్‌రెడీ `ఉగ్రం` సినిమా చూడటంతో కన్నడలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కడం లేదు. కేరళాలో ఓకే అనిపిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో దుమ్మురేపుతుంది.
ఓవరాల్‌గా `సలార్` హిట్ బొమ్మ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ దిశగా వెళ్తుంది. 650కోట్లు దాటితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లోకి వెళ్తుంది. కొన్న బయ్యర్లు అంతా సేఫ్‌లోకి వెళ్తారు. సంక్రాంతి వరకు దీనికి అడ్డు లేకపోవడంతో వెయ్యి కోట్ల మార్క్ ని చేరువ కావచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ పై ఆసక్తి, అంచనాలు మాత్రం గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు `సలార్‌ః సీజ్ ఫైర్`లో చూపించింది జస్ట్ శాంపుల్ మాత్రమే, అసలు కథ `సలార్ 2`లో ఉండబోతుంది. ఆ విషయాన్ని క్లైమాక్స్ లోనే హింట్ ఇచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
`సలార్2` కథ ఎలా ఉండబోతుంది? ప్రశాంత్ నీల్ ఏం చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో మొదటి పార్ట్ లో చాలా ప్రశ్నలు వదిలేశాడు దర్శకుడు. ప్రాణ స్నేహితులు వరధ, దేవా ఎలా శతృవులు అయ్యారనేది వదిలేశాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్ లో ఉండబోతుంది. మరోవైపు `నిబంధన` ప్రకారం.. రాజమన్నార్ తండ్రి శివ మన్నార్ 40ఏళ్ల పాలన తర్వాత అధికారం శౌర్యంగ తెగలకు ఇవ్వాలి. కానీ రాజమన్నార్ లాక్కున్నాడు. ఆ సమయంలో ఏం జరిగింది? శౌర్యంగ తెగలో ఉన్న నాయకుడు ఎవరు? అనేది ప్రశ్న. దీనికితోడు ప్లాస్టిక్ కత్తి పట్టినా ప్రభాస్ తల్లి ఎందుకు భయపడుతుంది? అనేది ప్రశ్న.
శృతి హాసన్‌ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు. ఆయన తండ్రి కథేంటి? మొదటి భాగంలో అధికారం కోసం తహతహలాడిన రాధా రమ ఎందుకు దేవాకి సపోర్ట్ చేస్తుంది. అలాగే వరధ వర్గానికి చెందిన కొందరు దేవా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఖాన్సార్ కథ చెబుతూ, శౌర్యంగ తెగకి చెందిన నాయుకుడు ధార కి రావాల్సిన అధికారం రాజమన్నార్ లాక్కున్నాడు అని తెలిపారు. మరి ఆ ధార ఎవరు? అయనే దేవా తండ్రినా? ఆయన ఎలా చనిపోయాడు? శౌర్యంగ తెగ కథేంటి? దేవా ఖాన్సార్‌కి దూరంగా ఎందుకు ఉంటున్నాడు. ప్రతి సారి ఎందుకు తప్పించుకుని దాక్కుంటున్నాడు. వరధ కోసం వచ్చిన దేవా తరచూ రాతి గుట్టపై నుంచి ఖాన్సార్‌ని చూస్తున్నాడు? లాంటి అనేక ప్రశ్నలను వదిలేశాడు దర్శకుడు ప్రశాంత్. వీటన్నింటికి `సలార్‌ః శౌర్యంగ పర్వం`లో సమాధానం చెప్పబోతున్నారు.
ఇదిలా ఉంటే సెకండాఫ్ కథ ఇలా ఉండబోతుందనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. దీన్ని `బాహుబలి` కథతో లింక్ పెట్టి చూస్తున్నారు. అంతేకాదు చూడబోతుంటే దాన్ని మించిన స్టోరీ అంటున్నారు ఎనలిస్ట్ లు. `సలార్` ప్రకటించినప్పుడు ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ పెద్ద మీసాలతో ఉన్నాడు. గన్ను పట్టుకుని కనిపించాడు. ఆ తర్వాత కొంత మందిని చంపినట్టుగా చేతిలో రెండు కత్తులు, బాడీకి తుపాకులు, గన్స్ తో ఉన్నాడు. అందులోనూ పెద్ద మీసాలతో ఉన్నాడు ప్రభాస్. వయసు పరంగానూ పెద్దగా కనిపించాడు. కానీ సినిమాలో మాత్రం ఆ లుక్ కనిపించలేదు. పైగా వయసు పరంగా చిన్నగా కనిపించాడు ప్రభాస్. హెయిర్ స్టయిల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. దీంతో ఆ ప్రభాస్ ఎవరు? అనేది ఇప్పుడు అందరిని తొలుస్తున్న ప్రశ్న. మరోవైపు వరధ.. తాన కోటలో `సలార్` ఫస్ట్ లుక్ సమయంలో విడుదల చేసిన ఫోటోని సగం చూపించి ఆపేశారు. ఎందుకు అలా చేశారనేది ఆసక్తికరంగా మారింది.
అయితే అతనే దేవా తండ్రి ధార అని తెలుస్తుంది. అసలు సలార్ అతనే అని అనిపిస్తుంది. సెకండాఫ్‌లో దీనికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ సమయంలో పెద్ద సలార్ కనిపిస్తాడని, శౌర్యంగ తెగలు ఎలా అధికారం కోల్పోయారు, తమపై ఎలాంటి కుట్రలు జరిగాయనేది అందులో చూపించబోతున్నారట. దీనితోపాటు చివర్లో `ఖాన్సార్` కథ చెప్పే సమయంలోనూ ఓ పెద్దాయన లుక్‌ని చూపించారు. టైటిల్స్ లోనూ పెద్ద మీసాలతో ఉన్న ఆర్ట్ వర్క్ లో ఉన్న ప్రభాస్‌ని చూపించారు. అతనే ధార అని, దేవా తండ్రి అని అర్థమవుతుంది. ఆయన స్టోరీని సెకండ్ పార్ట్ లో రివీల్ చేయనున్నారని సమాచారం. తండ్రిపై జరిగిన కుట్రని, తమకు దక్కాల్సిన అధికారాన్ని లాక్కోవడం వంటి వాటిని తనలోనే దాచుకుని సమయంలో కోసం ప్రభాస్ వేచి చూస్తున్నాడని తెలుస్తుంది.
ఇదే నిజమైతే.. `సలార్ 2`లో ఇద్దరు ప్రభాస్‌లను మనం చూడొచ్చు. ధార, దేవాల విధ్వంసాన్ని మనం చూడొచ్చు. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్, ఇంకా చెప్పాలంటే కనువిందు చేసే అంశం. `బాహుబలి`లోనూ ఇలాంటి కథే ఉంటుంది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరు ఉంటారు. భళాలదేవ, అతని తండ్రి చేసే కుట్రల కారణంగా పెద్ద బాహుబలి చనిపోతాడు. అలానే `సలార్`లో కూడా రాజమన్నార్ చేసే కుట్రల కారణంగా ధార చనిపోయి ఉంటాడని అంటున్నారు. దానికి కొడుకు దేవా ప్రతీకారం తీర్చుకుంటాడని, `నిబంధన`ప్రకారం తమకు రావాల్సిన అధికారాన్ని దేవా చివర్లో సాధిస్తాడని, అందుకు చేసే పోరాటమే క్లైమాక్స్ అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి. ఇదే నిజమైతే `సలార్ 2` విధ్వంసాన్ని, అది బాక్సాఫీసు వద్ద సృష్టించే సంచలనాలను ఆపాడం ఎవరి తరం కాదని చెప్పొచ్చు.