MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాకటానికి గోవా వరకు వెళ్లాలా... జబర్దస్త్ లో మళ్ళీ నిద్రలేచిన డబుల్ మీనింగ్ కామెడీ, రెచ్చిపోయిన తాగుబోతు రమేష్

నాకటానికి గోవా వరకు వెళ్లాలా... జబర్దస్త్ లో మళ్ళీ నిద్రలేచిన డబుల్ మీనింగ్ కామెడీ, రెచ్చిపోయిన తాగుబోతు రమేష్

జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డోసు పెరుగుతుంది. మెల్లగా కంటెస్టెంట్స్ బూతు కామెడీ వైపు మళ్లుతున్నారు.  ఇటీవల ఎపిసోడ్స్ లో ఈ తరహా కామెడీ మరలా కనిపిస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 08 2022, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Jabardasth

Jabardasth

బుల్లితెరపై జబర్దస్త్(Jabardasth) కామెడీ షోకి ఘనమైన చరిత్ర ఉంది. 2013లో మొదలైన ఈ షో తిరుగులేని షోగా గుర్తింపు తెచ్చుకుంది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ప్రేక్షకుల ఫేవెరెట్ కామెడీ షోగా పేరు తెచ్చుకుంది. ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడున్నా ఈ షో చేరువైంది. 
 

28

ఇంతటి ఘన చరిత్ర ఉన్న షోలో కొన్ని అపశృతులు కూడా ఉన్నాయి. మొదట్లో సాంప్రదాయ వాదులు పూర్తిగా వ్యతిరేకించారు. దానికి కారణం స్కిట్స్ లో బూతు కామెడీ ఎక్కువ కావడమే. ఓ దశలో జబర్దస్త్ బూతు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది. దీనితో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూస్తే బుల్లితెర కార్యక్రమంలో బూతు కామెడీ ఏంటనే వాదన తెరపైకి వచ్చింది.

38
Jabardasth

Jabardasth

విమర్శల నేపథ్యంలో టీం లీడర్స్ తమ పంథా మార్చుకున్నారు. దాదాపు బూతు అర్థం వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తమ స్కిట్స్ లో లేకుండా జాగ్రత్త పడ్డారు. జబర్దస్త్ లో క్లీన్ కామెడీ ఉంటుందనే ఇమేజ్ డెవలప్ అయ్యాక మరింత ఆదరణ పెరిగింది. కొత్త ఆడియన్స్ షోకి చేరువయ్యారు. చాలా కాలం పాటు జబర్దస్త్ లో శృతి మించిన బూతు కామెడీ కనిపించలేదు. 
 

48

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ సంక్షోభంలో పడింది. జబర్దస్త్ కి ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రోజా,అనసూయ దూరమయ్యారు. అలాగే అనేక మంది జబర్దస్త్ కమెడియన్స్ ఇతర ఛానల్స్ కి వెళ్లిపోయారు. స్టార్స్ దూరమైన కారణంగా జబర్దస్త్ రేటింగ్ తగ్గింది. ప్రస్తుతం షోలో ఉన్న కమెడియన్స్ ఒక్కప్పటి స్థాయి కామెడీ చేయలేకపోతున్నారు.

58
Jabardasth

Jabardasth

షోకి ఎలాగైనా ఆదరణ తెచ్చే క్రమంలో టీం లీడర్స్ మరలా డబుల్ మీనింగ్ కామెడీని నమ్ముకున్నారేమో అనిపిస్తుంది. ఆగస్టు 11న ప్రసారం కావాల్సిన జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా... తాగుబోతు రమేష్ కామెడీ కొంచెం హద్దులు దాటింది. స్కిట్ లో భాగంగా రమేష్... తన భార్యతో హనీమూన్ కి వెళుతున్నామని చెబుతాడు. అందుకేనా హ్యాపీ మూడ్ అని స్టేటస్ పెట్టారు.. అయితే నా కలలు నెరవేరినట్లే అని భార్య రోల్ చేసిన కమెడియన్ అన్నారు.

68
Jabardasth

Jabardasth


హ్యాపీ మూడ్ చూశావు కానీ.. పక్కనే మంగళవారం అనే హ్యాష్ ట్యాగ్ పెట్టాను చూడలేదా.. అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ కి స్పందించిన జడ్జి ఇంద్రజ ఇకపై నీపేరు తాగుబోతు రమేష్ కాదు మంగళవారం రమేష్ అని కౌంటర్ వేసింది. దానికి సెట్లోని వాళ్ళందరూ నవ్వారు. 

78
Jabardasth

Jabardasth

అనంతరం హనీమూన్ కి గోవా వెళదామని రమేష్ భార్యతో చెబుతాడు. హనీమూన్ అంటే ఏం చేద్దామని లేడీ కమెడియన్ అడుగగా... గోవా బీచ్ లో పైన మూన్ క్రింద హనీ... పైన ఉన్న మూన్ చూడడం చేతిలో ఉన్న హనీ నాకడం అని చెప్పాడు. ఆ డైలాగ్ కి లేడీ కమెడియన్.. చేతిలో తేనే నాకడానికి గోవా వెళ్లాలా? అని డబుల్ మీనింగ్ వదిలింది. తాగుబోతు రమేష్ స్కిట్ లో డబుల్ మీనింగ్ కామెడీ స్పష్టంగా కనిపించింది.

88
Jabardasth

Jabardasth

ఇక వేరే టీం లీడర్స్ కూడా ఈ ఫార్ములా ఫాలో అయితే.. మరలా జబర్దస్త్ పూర్తిగా బూతు షోగా మారిపోవడం ఖాయం. అనేక మంది అభిమానులను సంపాదించుకున్న ఈ షో ఆ తరహా కామెడీ జోలికి వెళ్లపోతే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna: కృష్ణ భార్య దర్శకత్వంలో సినిమా, హిట్టు పడగానే స్టార్ హీరో నమ్మక ద్రోహం.. సరైన జవాబు ఇచ్చారుగా
Recommended image2
Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు
Recommended image3
Raaka : అల్లు అర్జున్ రాకా మూవీకి, పుష్ప కి లింకేంటో తెలుసా? అసలు కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved