‘క్యా లఫ్డా..’...నైజాంలో ‘డబుల్ ఇస్మార్ట్’ బోయ్ కాట్? సీన్ లోకి వరంగల్ శీను
ఫిల్మ్ ఛాంబర్ నుంచి క్లీన్ చిట్ వచ్చినా ఎగ్జిబిటర్లు మాత్రం ఈ సినిమాని బోయ్ కాట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. వీరి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ (2019) కి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ రూపొందింది. కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటించారు. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ విడుదల చేస్తోంది.
పూరి జగన్నాథ్ కు లైగర్ తలనొప్పి ఇంకా పోయినట్లు లేదు. ఎన్ని సెటిల్మెంట్ చేసినా, ఫిల్మ్ ఛాంబర్ తల దూర్చినా విషయం సర్దుమరగటం లేదు. ఆ వివాదం వచ్చి ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ పై పడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో రెండు వారాల టైమ్ మాత్రమే ఉంది. మొదటి నుంచి డౌట్ ఉన్నా... లాస్ట్ మినిట్ లో ఎలాగోలా సర్దుబాటు అవుతుంది... ఎలాంటి సమస్యలు లేకుండానే డబుల్ ఇస్మార్ట్ రిలీజవుతుందని రామ్ (Ram) అభిమానులు భావించారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి క్లీన్ చిట్ వచ్చినా ఎగ్జిబిటర్లు మాత్రం ఈ సినిమాని బోయ్ కాట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
Double iSmart
ముఖ్యంగా నైజాం థియేటర్ల ఓనర్లలలో కొంతమంది తమ థియేటర్లను డబుల్ ఇస్మార్ట్ కు ఇవ్వడానికి ఆసక్తి చూపట్లేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు నైజాంలో ఎగ్జిబిటర్లకు ఎనిమిది కోట్ల వరకు క్లియర్ చేయాల్సి ఉంది. ఇది లైగర్ తీసుకున్న బయ్యర్ వరంగల్ శ్రీను పై ఉంది. అయితే ఇక్కడో చిన్న లాక్ ఉంది. ఈ ఎగ్జిబిటర్లు ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు చార్మికి చెప్పే మూడు కోట్ల వరకు వరంగల్ శీనుకు కట్టారు. కాబట్టి ఈ సమస్యను క్లియర్ చేసాయల్సిన భాధ్యత ఛార్మి, పూరిపైనా కూడా ఉంది. కాదు కూడదు అనటానికి లేదు. ఎందుకంటే థియేటర్స్ సమస్య వచ్చేస్తుంది.
ఈ నేపధ్యంలో నైజాం థియేటర్ల ఓనర్స్ ఈ ఇష్యూ తేలి తమకు సెటిల్మెంట్స్ చేసేదాకా ఇస్మార్ట్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఇదేమీ అఫీషియల్ గా ప్రకటన చేసిన విషయం కాదు. తమలో తాము డిస్కస్ చేసుకున్న విషయం అని తెలుస్తోంది.
Ram Pothineni Double ISMART
మరో ప్రక్క హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో భాగస్వామ్యం ఉన్నఏసియన్ సినిమాస్ సంస్థకు మూడు కోట్లు ఇవ్వాలంటున్నారు. అది క్లియర్ కాకపోతే వాళ్ల థియేటర్లలో ఇస్మార్ట్ పడదని చెప్తున్నారు. ఏసియన్ సినిమాస్ చేతిలో ఎఎంబి, ఎఎఎ తో సహా మల్టీ ఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ లు వందకు పైగా వున్నాయి. అలాగే దిల్ రాజుకు కు వైజాగ్ ఏరియా నుంచి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందిట. అది తేలకపోతే ఉత్తరాంధ్రలో థియేటర్లు ఇస్మార్ట్ కు దూరం అవుతాయి.
ఇదొక్కటే సోలో సినిమా అనుకుంటే అసలు ఇంత డిస్కషన్ ఉండదు. రవితేజ- మిస్టర్ బచ్చన్, విక్రమ్- తగలాన్ సినిమాలు అదే రోజు రిలీజ్ అవుతోంది. అలాగే గీతా సంస్థ నుంచి ఆయ్ అనే చిన్న సినిమా కూడా వస్తోంది. అంటే థియేటర్స్ కు బ్రహ్మాండమైన ఫీడింగ్ దొరుకుతుంది.
ఏదైమైనా డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ కు ముందే నైజాంలో థియేటర్ ఓనర్స్ తమ డబ్బులు వెనక్కు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు. నిన్నా, మొన్నా చాలా మంది ఎగ్జిబిటర్లు మీటింగ్ పెట్టుకుని ఏం చేయాలి అన్న దాని మీద డిస్కషన్లు సాగించారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న వరంగల్ శ్రీను మళ్లీ బయటకు వచ్చారు. లైగర్ ఎగ్జిబిటర్లను కలిసి అందరూ సహకరిస్తే తను కూడా ఇబ్బందుల నుంచి బయటకు పడతా అన్నారు. మరి ఎవరు ఎవరికి సహకరిస్తారో చూడాల్సి ఉంది.
ఇక సినిమా విషయానికి వస్తే.. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘క్యా లఫ్డా..’ అంటూ సాగే మూడోపాటని సోమవారం రిలీజ్ చేశారు. ‘నరం నరం గరం గరం... పదింటికే చలీ జ్వరం, నీ ఊహలే నిరంతరం... పోతోందిరా నాలో శరం...’ అంటూ ఈపాట సాగుతుంది. శ్రీ హర్ష ఈమాని సాహిత్యం అందించిన ఈపాటని ధనుంజయ్ సీ΄ాన, సింధూజ శ్రీనివాసన్‌పాడారు. రామ్, కావ్యాల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, జియాని జియాన్నెలి.