జస్ట్ మిస్... పవన్ కళ్యాణ్ - శేఖర్ కమ్ముల కాంబోలో రావాల్సిన సినిమా ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కాంబోలో ఓ సినిమా రావాల్సింది. కానీ చివరిగా ఆ సినిమాలో ఓ యంగ్ హీరో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ ప్రొగ్రామ్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సమయం ఉన్నప్పుడల్లా తన సైన్ చేసిన సినిమాలకు డేట్స్ ఇస్తూనే ఉన్నారు. భారీ చిత్రాల్లో నటిస్తూనే వస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ నుంచి ‘ఓజీ’ (They Call Him OG) చిత్రం రానుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే... పవన్ కళ్యాణ్ ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించారు. చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.
అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో కొన్ని బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను కూడా మిస్ చేసుకున్నారు. పోకిరి.. తదితర సినిమాలను మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ప్రముఖ దర్శకుడు చేసిన పొరపాటు వల్ల ఓ మంచి సినిమాను కోల్పోయారు.
sekhar kammula
ఆ దర్శకుడు మరెవరో కాదు.. లవ్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ములనే కావడం ఆసక్తికరంగా మారింది. ఆయన 20 ఏళ్ల కింద పవన్ కళ్యాణ్ కోసం ఫీల్ గుడ్ మూవీ ‘ఆనంద్‘ (Anand) స్టోరీని రాశాడంట. పవర్ స్టార్ ను ఊహించుకునే రాశాడని ఆయనే చెప్పారు.
కానీ పవన్ కళ్యాణ్ ను కలవడంలో ఆయన విఫలం అయ్యారంట. పైగా అప్పటికే అలాంటి కథల్లోనే రాజా ఎబెల్ మూడు సినిమాలు చేయడంతో అతన్నే పెట్టిన సినిమా తీశారంట. ఇలా పవన్ కళ్యాణ్ - శేఖర్ కమ్ముల కాంబోలోని సినిమా మిస్ అయ్యింది.