MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Jayasudha: జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే?

Jayasudha: జయసుధను ఆంటీ అనిపిలిచే ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? మహేష్ ఏమని పలకరిస్తాడంటే?

టాలీవుడ్ లో సహజనటి అన్న పేరు తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ జయసుధ. హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్పెషల్ మార్క్ చూపించిన జయసుధతో ఈ తరం హీరోలకు కూడా మంచి అనుబంధం ఉంది. జయసుధను ప్రేమగా ఆంటీ అని పిలిచే పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో తెలుసా.? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 15 2026, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సహజనటిగా టాలీవుడ్ లో గుర్తింపు..
Image Credit : Jayasudha

సహజనటిగా టాలీవుడ్ లో గుర్తింపు..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజ నటిగా గుర్తింపు పొందిన జయసుధ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఈ నటి... ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడంలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా స్టార్ డమ్ చూసిన జయసుధ.. వయసు పెరగడంతో సినిమాలు కాస్త తగ్గించింది. అయినా సరే తెలుగు ఆడియ్స్ లో ఆమె ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 

దాదాపు మూడు తరాల హీరోలతో కలిసి నటించింది. చాలా ఇంటర్వ్యూలలో జయసుధ తన నట జీవితం, తన తోటి నటీనటుల గురించి ఎన్నోవిషయాలను షేర్ చేసుకున్నారు. అంతే కాదు తనకు వ్యక్తిగతంగా ఇండస్ట్రీలో ఎవరు దగ్గరగా ఉంటారో కూడా ఆమె వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల గురించి గురించి ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మెగా ఫ్యామిలీతో జయసుధ అనుబంధం..
Image Credit : Asianet News

మెగా ఫ్యామిలీతో జయసుధ అనుబంధం..

జయసుధ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. చిరంజీవితో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. మెగా ఫ్యామిలీ తనతో ఎంతో ప్రేగా ఉంటారని ఆమె అన్నారు. ముఖ్యంగా చిరంజీవి గురించి జయసుధ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన సినీ ప్రయాణం ఎంతో కఠినమైనదని ఆమె అన్నారు. అప్పటికే ఇండస్ట్రీలో నలుగురు పెద్ద హీరోలు ఉన్నారు.. చిరంజీవి వచ్చిన తరువాత కూడా .. పెద్ద పెద్ద సినిమా కుటుంబాల నుంచి వారసత్వంగా ముగ్గురు హీరోలు వచ్చారు. ఆ టైమ్ లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు. కానీ చిరంజీవి క్రమశిక్షణ, ఏదైనా సాధించాలనే సంకల్పం, కృషి ఆయన విజయానికి ప్రధాన కారణాలని జయసుధ వివరించారు.

34
జయసుధను ఆంటీ అని పిలిచే ఏకైక హీరో
Image Credit : Asianet News

జయసుధను ఆంటీ అని పిలిచే ఏకైక హీరో

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, '' రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవిలాగే ఎంతో వినయంగా, క్రమశిక్షణతో ఉంటారు . షూటింగ్ సెట్‌కు వచ్చినప్పుడు పెద్దలను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మాట్లాడాలనే సంస్కారం ఆయనలో కనిపిస్తుంది. మెగాస్టార్ కుటుంబం మొత్తం ఎంతో వినయంగా ఉంటుంది, వారు ఎప్పుడూ తమను తాము మెగాస్టార్ కుటుంబ సభ్యులమని గొప్పగా చెప్పుకోరు. అయితే ఇండస్ట్రీలో తనను “ఆంటీ” అని పిలిచే వ్యక్తి ఒక్క రామ్ చరణ్ మాత్రమేనని జయసుధ వెల్లడించారు. మిగిలిన వారందరూ తనను “జయసుధ గారు” అనే పిలుస్తారని అన్నారు. అంతే కాదు పవన్ కళ్యాణ్‌ గురించి మాట్లాడుతూ.. '' నేను పవన్ తో బాలు సినిమాలో కలిసి నటించాను. పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడరు. పలకరిస్తేనే మాట్లాడతారు'' అని ఆమె తెలిపారు. .

44
మహేష్ బాబు జయసుధను ఏమని పిలుస్తారంటే?
Image Credit : Asianet News

మహేష్ బాబు జయసుధను ఏమని పిలుస్తారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కూడా జయసుధ చాలా విషయాలు చెప్పారు. '' మహేష్ బాబును నేను చిన్పప్పటి నుంచి చూస్తున్నాను.. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించే టైమ్ లో షూటింగ్‌లకు రావడం, సినిమాల్లో నటించడం వంటి విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. మహేష్ బాబు ఆయన తండ్రి కృష్ణలాగే ప్రశాంతంగా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు, నేను మహేష్ బాబు తల్లి పాత్రలో ‘మహర్షి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి చిత్రాల్లో నటించాను. మహేష్ నన్ను ఎప్పుడూ “జయసుధ గారు” అని పిలుస్తారు.. నేను మాత్రం “మహేష్” అని పిలుస్తాను''. అని ఆమె చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
మహేష్ బాబు ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Naa Anveshana: సినిమా రివ్యూలు వద్దు.. యూట్యూబర్లకు నా అన్వేషణ అన్వేష్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏమన్నాడంటే?
Recommended image2
2 కోట్ల సినిమాకు 100 కోట్ల ఆఫరా? 200 కోట్లకు పైగా వసూలు చేసిన హనుమాన్ అంశ్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?
Recommended image3
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Related Stories
Recommended image1
Anna Lezhneva: చిరంజీవి, నాగబాబును పవన్ కళ్యాణ్ భార్య ఏమని పిలుస్తుందో తెలుసా? షాక్ అవుతారు
Recommended image2
Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ - రష్మిక.. చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపిన కొత్త జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved