మన హీరోల్లో రిచ్ ఎవరో తెలుసా? అయినా సాదాసీదాగానే కనిపిస్తారు.. ఎన్ని వేల కోట్లు అంటే?
సౌత్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిలో అత్యధిక సంపన్నుడైన హీరోల గురించి తెలుసుకుందాం. అందులోనూ రిచ్ హీరో ఎవరనేది తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు.
విక్టరీ వెంకటేశ్ (Venkatesh) ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఫ్యామిలీ, సెంటిమెంట్ తో అలరించిన వెంకీ ఇప్పుడు యాక్షన్ బాట పట్టారు. విభిన్న జోనర్లలో సినిమాలకు ఆసక్తి చూపిస్తున్నారు. రెమ్యూనరేషన్ కాస్తా తక్కువనే అందుకుంటున్నా వెంకీ ఆస్తి విలువ మాత్రం షాకింగ్ గా ఉంటుంది. వెంకీమామ నికర ఆస్తి విలువ రూ. 2,200 ఉంటుంది. అయినంత మాత్రం టాప్ లో లేరు.
టాలీవుడ్ లో అగ్రహీరో అనగానే ముందుగా చిరంజీవి (Chiranjeevi) పేరే వినిపిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. చిరు నెట్ వర్త్ మొత్తం రూ.16500 కోట్ల వరకు ఉంటుంది. లగ్జరీ కార్లు, బంగ్లాలు, ఇతర చోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి.
మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా అత్యధిక సంపన్నులలో ఒకరిగా పేరు సంపాదించాడు. ప్రయివెట్ జెట్, బిజినెస్ లో, లగ్జరీ కార్లు, బంగ్లాలు, హార్స్ క్లబ్ వంటి వాటిని చెర్రీ సొంతం చేసుకున్నారు. చరణ్ మొత్తం ఆస్తి రూ.1370 కోట్లకు పైనే ఉంటుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. ఒక్కో ప్రాజెక్ట్స్ కు భారీగానే చార్జ్ చేస్తున్నారు. తారక్ ఆస్తి విలువ మొత్తం రూ.494 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా యాక్టరే ఆయన ఆస్తి విలువ మొత్తం రూ.460 కోట్ల వరకు ఉంటుందని ఆయా నివేదికల ద్వారా అర్థమవుతోంది.
ఇక తమిళ స్టార్స్ విజయ్ దళపతి (Vijay Thalapathy) రూ.480 కోట్లు వరకు కూడబెట్టారని కొన్ని నివేదికలు తెలుపుతున్నారు. కమల్ హాసన్ రూ. 450 కోట్ల వరకు ఆస్తిని కలిగి ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో రజినీకాంత్ (Rajinikanth) రూ. 430 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నారు.
దక్షిణాదిలోనే అత్యధిక సంపన్నుడైన నటుడిగా కింగ్, అక్కినేని నాగార్జున (Nagarjuna) రికార్డు క్రియేట్ చేశారు. రెమ్యూనరేషన్ తక్కువే తీసుకున్నా.. ఆయన నికర ఆస్తి మాత్రం షాకింగ్ గా ఉంటుంది. ఆయన ఇంటి ఖరీదే రూ.45 కోట్లు ఉండటం విశేషం. ఓప్రైవెట్ జెట్, ఖరీదైన ఎన్-కన్వెన్షన్, ఇండియన్ సూపర్ లీగ్, అన్నపూర్ణ స్టూడియోతో పాటు కొన్ని బ్రాండ్లకూ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక నాగార్జున్ మొత్తం ఆస్తి విలువ రూ.3,300 కోట్లు ఉంటుందని ఆయా నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో సౌత్ రిచ్ యాక్టర్ గా నాగార్జున రికార్డు క్రియేట్ చేశారు.