`ఎన్టీఆర్` బయోపిక్‌కి ముందు విద్యా బాలన్ నటించాల్సిన తెలుగు సినిమా ఏంటో తెలుసా? స్టార్ హీరోతో ఛాన్స్ మిస్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ తెలుగులో `ఎన్టీఆర్` బయోపిక్‌లో నటించింది. కానీ అంతకంటే ముందే తెలుగులో ఓ స్టార్ హీరో సరసన అనుకున్నారట. మరి ఏం జరిగింది?
Vidya Balan
విద్యాబాలన్.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్న హీరోయిన్. కమర్షియల్ హీరోయిన్ అనే బౌండరీలు బ్రేక్ చేసి సరికొత్త సంచలనంగా మారింది. జీరో సైజ్ అనే ట్యాగ్‌ని పటాపంచల్ చేసి సంచలనాలు సృష్టించింది. `డర్టీ పిక్చర్`తో యావత్ ఇండియాని షేక్ చేసింది విద్యాబాలన్. నటిగా తానేంటో నిరూపించుకుని ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది.
ntr biopic
లేడీ ఓరియెంటెడ్ మూవీస్, హీరోయిన్ పాత్రలకి కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది. బొద్దుగా ఉన్నా, గ్లామర్ విషయంలో తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది.
విద్యా బాలన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఎన్టీఆర్ కథానాయకుడు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీ నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు క్రిష్.
read more: జానీ మాస్టర్ ని పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ దూరం పెట్టారా? కొరియోగ్రాఫర్ చెప్పిన నిజం ఏంటంటే?
ntr biopic
ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా బసవతారకం పాత్రలో నటించింది విద్యాబాలన్. ఆమెకిది తొలి తెలుగు సినిమా. ఇది 2019లో విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు విద్యాబాలన్.
అయితే ఈ మూవీ కంటే ముందే విద్యా బాలన్ తెలుగులో సినిమా చేయాల్సి ఉందట. ఆ విషయాన్ని హీరో వెంకటేష్ చెప్పడం విశేషం. మరి ఆ కథేంటో చూస్తే,
వెంకటేష్, మహేష్ బాబు కలిసి `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంలో నటించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. 2013లో విడుదలై పెద్ద విజయం సాధించింది.
మల్టీస్టారర్ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత ఇప్పటి జనరేషన్ హీరోలు ఇలా మల్టీస్టారర్ చిత్రాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ జోరు మరింతగా రన్ అవుతుంది. అయితే ఇందులో హీరోయిన్‌గా విద్యాబాలన్‌ని అనుకున్నారట.
also read: `గ్యాంగ్ లీడర్`, `ఘరానా మొగుడు` రేంజ్‌లో.. చిరంజీవితో మూవీపై అనిల్ రావిపూడి అదిరిపోయే లీక్
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో సీత పాత్ర కీలకంగా ఉంటుంది. ఇందులో అంజలి నటించింది. ఈ పాత్ర కోసం చాలా మంది హీరోయిన్లని అనుకున్నారట. బాలీవుడ్ హీరోయన్ల పేర్లని పరిశీలించారట. వారిలో విద్యా బాలన్‌ని ప్రధానంగా అనుకున్నారట. కానీ తెలుగుదనం ఉండాలని చెప్పి మళ్లీ మనసు మార్చుకున్నారట.
నిర్మాత దిల్ రాజు సలహా మేరకు అంజలిని ఫైనల్ చేశారట. ఈ విషయాన్ని వెంకటేష్ చెప్పారు. తను బ్రిలియంట్ యాక్ట్రెస్ అని అంజలిపై ప్రశంసలు కురిపించారు వెంకీ. కానీ ముందు అనుకున్న నిర్ణయమే తీసుకుంటే విద్యాబాలన్ ఇందులో సీతగా కనిపించేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఈ మూవీలో సీతగా అంజలి పర్‌ఫెక్ట్ గా చేసింది. ఆమె తప్ప ఇంకెవ్వరూ ఆ పాత్రని చేయలేరనేంతగా నటించి మెప్పించింది.
సాధారణంగా పెద్ద స్టార్ హీరోలున్న సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రయారిటీ ఉండదు, కానీ ఇందులో వెంకీ, మహేష్‌లను డామినేట్ చేసే స్థాయిలో అంజలి పాత్ర ఉండటం విశేషం. ఆమె పాత్ర చుట్టూతే కథ నడుస్తుండటం మరో విశేషం. ఇందులో చాలా పాత్రలుంటాయి. కానీ ప్రతి పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. అది దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గొప్పతనంగా చెప్పొచ్చు.
మొత్తంగా విద్యా బాలన్ వెంకటేష్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని కోల్పోయింది. `సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు` మూవీలో వెంకీకి జోడీగా అంజలి నటించగా, మహేష్ సరసన సమంత హీరోయిన్‌గా చేసింది.