హీరోయిన్ అవ్వకుండా ఉంటే నయనతార ఏం చేసేదో తెలుసా..?
స్టార్ హీరోయిన్ నయనతార సినిమాల్లోకి రాకుండా ఉంటే ఏం చేసేదో తెలుసా..? హీరోయిన్ అవ్వకముందు ఆమె లక్ష్యం వేరేదిగా ఉందా..? ఇంతకీ అదేంటో తెలుసా..?
actress nayanthara
40 ఏళ్ళు వస్తున్నా. హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది నయనతార. దాదాపు 20 ఏళ్ళకు పైగా ఇండస్ట్రీని ఏలుతోంది. ఇప్పటికీ 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్న ఈబ్యూటీ.. కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది. రెండు లవ్ స్టోరీస్ తరువాత ఆమె తనకంటే చిన్నవాడైన దర్శకుడు విఘ్నేష్ ను పెళ్ళాడింది నయనతార. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కూడా పొందింది.
ఇక కోట్ల ఆస్తి లగ్జరీ కార్లు కూడా కలిగి ఉన్న నయనతార సొంతంగా ఛార్టెడ్ ప్లైట్ కూడా ఉంది. ఇక ఇప్పుడు విషయం ఏంటంటే.. నయనతార హీరోయిన్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేది. ఆమె టార్గెట్ ఏంటి..? ఏం చదువుకుంది. ఈ విషయం గురించి తాజాగా వెల్లడించింది సీనియర్ బ్యూటీ. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేరళ కుట్టి మాట్లాడుతూ .. ఏమన్నదంటే..?
మా సొంతూరు కేరళలోని తిరువల్లా. అమ్మ ఓమనా.. నాన్న కుడియాట్టు. నాన్న ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసేవారు.నా చిన్నతనం అంతా గుజరాత్ లోని జామ్ నగర్‌లో గడిచింది. నాన్న రిటైర్ అయ్యాక మా సొంతూరు వెళ్ళిపోయాము. అక్కడే నేను ఇంగ్లీష్ లిటరేచర్ లో బి.ఏ చదువుకున్నాను. ఇక నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కలలు కన్నాను. సినిమాల్లోకి రాకుంటే ఖచ్చితంగా ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని అన్నారు.
ఇక తాను సినిమాల్లోకి అనుకోకుండా అడుగుపెట్టాను అన్నారు నయనతార. మా పెద్ద నాన్నకు ఒక యాడ్ ఏజెన్సీ ఉండేది. దాంతో తాను నాఫోటోలను ఇతర ఏజెన్సీలకు పంపిస్తూ ఉండేవారు. అలానే అలా నా ఫోటో చూసిన మలయాళి దర్శకులు `సత్యన్ అంతిక్కండ్ సినిమాలో చేయమని ఆఫర్ ఇచ్చారు. మా ఇంట్లో ఈ విషయం గురించి చెబితే నీ ఇష్టం అన్నారు.
దాంతో చాలా రోజులు ఆలోచించి సినిమాలు చేయాలి అనుకున్నాను. అప్పుడు కనుక వద్దు అనుకుంటే నేను ఇలా ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు అన్నారు నయనతార. ఈ విధంగా మనసినక్కరే(2003)తో నా సినిమా కెరీర్ ప్రారంభమైంది అన్నారు నయనతార. డిగ్రీ చదువుతున్న నేను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో రెండు సినిమాలు చేశాను..శరత్ కుమార్ పక్కన కూడా నటించాను అన్నారునయన్.
nayanthara
ఇక చంద్రముఖి నా లైఫ్ మర్చిపోలేను. నా కెరీర్ కు ఈసినిమా టర్నింగ్ పాయింట్. తరువాత తెలుగులో వెంకటేష్ హీరోగా `లక్ష్మి సినిమాతో అడుగుపెట్టాను. ఆ విధంగా అన్ని దక్షిణాది భాషల్లో నటించాను. అన్నారు నయనతార.