- Home
- Entertainment
- `శాకుంతలం` సినిమాకి వాడిన నగల విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఏకంగా పెద్ద జ్యూవెల్లరీ షాపే పెట్టుకోవచ్చు?
`శాకుంతలం` సినిమాకి వాడిన నగల విలువ ఎన్ని కోట్లో తెలుసా? ఏకంగా పెద్ద జ్యూవెల్లరీ షాపే పెట్టుకోవచ్చు?
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో జ్యూవెల్లరీని భారీగా వాడారు. ఆ విషయాలను వెల్లడించారు దర్శకుడు గుణశేఖర్. అయితే ఆ బంగారు అభరణాల విలువ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

సమంత నటించిన `శాకుంతలం` సినిమా త్వరలో రాబోతుంది. మైథలాజికల్ నేపథ్యంలో శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో ఆభరణాల పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఫారెస్ట్ లో జరిగే లవ్ స్టోరీనే కాదు, దుష్యంతుడి రాజమహల్‌లో దేవతలు, రాజుల పాత్రలకు భారీగా నగలు వాడాల్సి ఉంటుంది. అయితే ఈ చిత్రం కోసం వాడిన నగల విలువ తెలిస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే.
తాజాగా దర్శకుడు గుణశేఖర్ ఆ విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సినిమాలో కేజీలకు కేజీల బంగారు అభరణాలు వాడినట్టు తెలిపారు. వాటి విలువల సుమారు రూ.14కోట్లు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో జ్యూవెల్లరి ఎలా అనుకున్నప్పుడు నీలిమా( గుణశేఖర్ కూతురు) వసుంధర జ్యూవెల్లరీ వారితో మాట్లాడి సెట్ చేశారట. వాళ్లు ఆరేడు నెలల పాటు దీనిపై కూర్చొని దాదాపు 14 కేజీల బంగారం వాడి శకుంతల ఆభరణాలు డిజైన్ చేశారట.
అయితే ఇందులో అన్నీ నిజమైన బంగారం, వజ్రాలను వాడినట్టు చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన `దానవీర శూర కర్ణ` చిత్రంలో వాళ్లు ధరించిన నిజమైన బంగారు ఆభరణాలు, కిరీటాలను స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా నిజమైన బంగారం వాడినట్టు తెలిపారు. అయితే ఇంతటి బంగారు ఆభరణాలను మేం తయారు చేయించాలంటే ఏకంగా ఓ పెద్ద జ్యూవెల్లరి షాపే పెట్టుకోవచ్చని, దిల్‌రాజుగారికి చెబితే ఇదే మాట అనేవారని, ఆయనకు వసుంధర వాళ్లు ఇలా టైయప్ అయ్యారని చెప్పగానే ఆయన రిలీఫ్ అయినట్టు చెప్పారు.
ఇక `శాకుంతలం` చిత్రంలోని శకుంతల, దుష్యంతుడు ధరించిన బంగారు, వజ్రాల అభరణాలు, దుస్తులను వసుంధర జ్యూవెల్లరి వారే తయారు చేసినట్టు చెప్పారు గుణశేఖర్. వసుంధర, ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా, నేహ వంటి వారు ఈ డిజైన్స్ చేశారని తెలిపారు. శకుంతల పాత్రకి 15కేజీల బంగారంతో 14 రకాల ఆభరణాలు చేశారట, అలాగే దుష్యంతుడి పాత్ర కోసం దాదాపు పది కేజీల బంగారు ఆభరణాలు, మేనక పాత్ర ధారి అయిన మధుబాల కోసం ఆరు కోట్లతో వజ్రాలు పొదిగిన దుస్తులను, బంగారు ఆభరణాలను తయారు చేయించామని వెల్లడించారు. ఇవన్నీ చేతితో చేసిన ఆభరణాలని, వీటిని ధరించడం వల్ల ఆయా పాత్రలకు అందం వచ్చిందని, అంతిమంగా అది సినిమాకి అందాన్ని తీసుకొచ్చిందన్నారు. శాకుంతలం సినిమాని ప్రకటించగా, అదే అన్నింటిని సమకూర్చుకుందని, అంతా కలిసి వచ్చారని మా వర్క్ ఈజీ అయ్యిందని చెప్పారు.
అయితే ఈ జ్యూవెల్లరి వాడకం వెనకాల సినిమాకి జీరో బడ్జెట్ అని తెలుస్తుంది. ఒకరికొకరు వాడుకోవడం, జ్యూవెల్లరీని సినిమా వాడుకుంటే, ఆ సినిమా ద్వారా జ్యూవెల్లరి బ్రాండ్‌ని ప్రమోట్ చేసే బాధ్యతని టీమ్ తీసుకుందని సమాచారం. అందులో భాగంగానే ప్రత్యేకంగా గురువారం రోజు ఈ జ్యూవెల్లరి ఎక్స్ పో చేశారు. సినిమాలో వాడిని ఆభరణాలను మీడియాకి ప్రదర్శించారు.
సమంత.. శకుంతలం పాత్రలో నటించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. మోహన్‌బాబు, అల్లు అర్హ, అనన్య నాగళ్ల, కబీర్ బేడి వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. గుణాటీమ్ వర్క్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నీలిమా గుణ, దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.