లేడీ సూపర్ స్టార్ నయనతార ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా? షాక్ అవ్వాల్సిందే?
స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara) దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉంది. ఎందరో స్టార్ హీరోల సరసస నటించిన ఈ బ్యూటీ ఆదాయం, ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

సౌత్ ఆడియెన్స్ కు అందాల భామ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సరసన, సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళం మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
కర్నాటకకు చెందిన నయనతార.. 2003లో తమిళం చిత్రం ‘మనస్సినక్కరె’తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి దాదాపుగా 80కిపైగా చిత్రాల్లో నటించింది. తను నటించిన సినిమాలన్నీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ నే తెచ్చిపెట్టాయి. కొన్నింటికి స్పందన రాకపోయినా.. వసూళ్లలో మాత్రం మంచి ఫలితాలను తెచ్చిపెట్టాయి.
దాదాపు 20 ఏండ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూనే ఉంది నయనతార. తన అందం, అభినయం, ఫిట్ నెస్ ఏవీ మారకపోగా.. మరింత కొత్తగా కనిపించేలా నయనతార ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. అందుకే నయనతారకు అన్ని ఇండస్ట్రీలలో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ భామా సినిమాలకు ఛార్జ్ చేస్తూ ఉంటుంది.
నయనతారకు ఇప్పటికీ ఇండస్ట్రీలో క్రేజ్ ఉంది. తను నటించిన సినిమాలకు ఇంకా ఆడియెన్స్ నుంచి మంచి ఆదరణ వస్తుండటంతో ఆమె రెమ్యూనరేషన్ కూడా పెరుగుతూనే వస్తోంది. ఇక తన ఆస్తి వివరాలకొస్తే.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది నయనతార. ఇలా సినిమాలపై ఏడాది రూ.15 కోట్ల వరకు సంపాదిస్తుంటుంది. అంటే నెలకు రూ. కోటీ వరకు ఆదాయం వస్తున్నట్టు లెక్క.
19 ఏండ్లలో దాదాపు రూ. వందల కోట్లు విలువ చేసే ఆస్తి పాస్తులను సంపాదించినట్టు సమాచారం. 2022 నాటికి రూ. 74 కోట్లు విలువగల ఆస్తిని కలిగి ఉంది నయన్. అలాగే తన ఖరీదైన ఇండ్లు, కార్స్, ఇతర బిజినెస్ లకు సంబంధించిన ఆస్తులను కలిపితే రూ.100 కోట్లకు పైమాటే. పెళ్లికి ముందే కోట్ల ఆసక్తిని కూడగట్టిన నయన్ తారా ప్రస్తుతం తన జీవితభాగస్వామితో ఆనందగా గడపనుంది.
ఏడేండ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో డేటింగ్ లో ఉన్న నయనతార ఈరోజు (జూన్ 9) తమిళనాడులోని మహాబలిపురంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. వీరి వివాహారానిక తారాలోకం, ప్రముఖ పొలిటీషన్స్ కూడా హాజరై ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లకు ప్రత్యేక కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.