మహేష్ బాబు సిగరేట్ ఎలా మానేశాడో తెలుసా?.. ఖాళీ టైమ్‌లో మహేష్ చేసే పని అదేనా?..
మహేష్ బాబు పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ పెద్ద సీక్రెట్ బయటపడింది. ఆయనకు ఉన్న సిగరేట్ అలవాటు గురించి, దాని వెనుక ఉన్న స్టోరీని బయటపెట్టాడు మహేష్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సూపర్ స్టార్‌గానే రాణిస్తున్నారు మహేష్. ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ లేదు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలు కూడా చేయలేదు. మొదటిసారి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఏకంగా గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్ చేశాడు.
Mahesh Babu
ఇదిలా ఉంటే మహేష్ చాలా వరకు ఇంట్రోవర్ట్ అంటుంటారు. ఆయన పెద్దగా మాట్లాడరు అంటుంటారు. నమ్రతకి మొదట్లో మహేష్ బాబు విషయంలో ఇదే ఫిర్యాదు ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా ఆయన్ని మార్చేసిందట నమ్రత. ఇప్పుడు ఆయనే బాగా మాట్లాడుతుంటాడట. అలా మహేష్‌ని పూర్తిగా మార్చేసిందట నమ్రత.
అయితే మహేష్‌కి మరో అలవాటు ఉండేదట. అదే సిగరేట్ తాగే అలవాటు. కెరీర్ బిగినింగ్‌లో సిగరేట్ తాగేవాడట. సినిమాల్లో కూడా ఆయన సిగరేట్ తాగే సన్నివేశాలుండేవి. సిగరేట్ అలవాటు తనని బాగా వెంటాడిందట. కానీ ఆ తర్వాత మనేయాలని చాలా ప్రయత్నించాడట. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఆయనకు చిన్న ట్రిక్ తెలిసింది. దానితో సింపుల్‌గా మానేశాడట.
Mahesh Babu
ఆ ట్రిక్కు ఏంటంటే.. పుస్తకాలు చదవడం. మహేష్ ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకాలు చదువుతాడట. ఆ అలవాటు చిన్నప్పట్నుంచి ఉందట. అయితే సిగరేట్ మానేయాలనుకున్నప్పుడు ఎలా అని శోధించినప్పుడు ఓ పుస్తకం గురించి తెలిసింది. ఎలెన్ కార్ రాసిన `ది ఈజీ వేటు స్టాప్ స్మోకింగ్` అనే పుస్తకం చదివాడట మహేష్. ఆ పుస్తకం చదివిన తర్వాత అసలు సిగరేట్ జోలికి వెళ్లలేదట. అలా పుస్తకం తనలో చాలా మార్పు తెస్తుందని చెప్పారు. ఇతర మనుషులతో మాట్లాడినప్పుడు కలగని సంతృప్తి పుస్తకాలు చదివినప్పుడు దొరుకుతుందన్నారు మహేష్. అవి ఎంతో ఇన్‌స్పైర్ చేస్తాయని చెప్పారు.
mahesh babu
మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి `గుంటూరు కారం` చిత్రంతో వచ్చారు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నా, రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఇప్పుడు ఆయన రాజమౌళితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మూవీ కోసం మేకోవర్ కూడా మార్చేశాడు. సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమా చేయని మహేష్.. డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేస్తుండటం విశేషం. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుందని సమాచారం.