గోపీచంద్ తొలి పారితోషికం ఎంతో తెలుసా? మరీ అంతేనా?
టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) తన కేరీర్ బిగినింగ్ లో హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తొలి పారితోషికంగా ఎంత తీసుకున్నాడో తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రివీల్ చేశారు.

హీరోకు కావాల్సిన అన్ని అర్హతలు గోపీచంద్ (Gopichand)కు ఉన్నాయి. హైట్, ఫిట్ నెస్, గ్లామర్ అన్నీ ఉన్నాయి. వరుస చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు గోపీచంద్. కొన్ని హిట్ చిత్రాలతో సత్తా ఉన్న హీరోగా పేరు సంపాదించుకున్నాడు.
గోపీచంద్ హీరోగా ‘తొలి వలపు’ చిత్రంతో 2001లో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక గోపీచంద్ అందరినీ ఆకట్టుకోగలిగాడు. హీరోగా టాలీవుడ్ లో ఉన్నత స్థాయికి వెళతాడని పలువురు సినీ ప్రముఖులు కూడా అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత ‘జయం, నిజం, వర్షం’ వంటి చిత్రాల్లో గోపీచంద్ వరుసగా విలన్ గా నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలు గోపీచంద్ కు మంచి గుర్తింపు ను పెట్టాయి. మరోవైపు స్టార్ డమ్ ను కూడా తెచ్చి పెట్టాయి. అయితే ఈ పాటికే స్టార్ హీరోల సరసన ఉండాల్సిన గోపీ చంద్ కాస్తా వెనకబడ్డాడు.
ఆయన కేరీర్ అనుకున్నట్టుగా ఉంటే ఈ పాటికి పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు వచ్చేదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుతం గోపీచంద్ ఒక్కో సినిమాకు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
తాజాగా దర్శకుడు మారుతీ దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’(Pakka Commercial) చిత్రంలో నటించాడు. ఈ చిత్రం జూలై 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు చిత్రంలో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.
ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ లో గోపీచంద్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తొలి పారితోషికంగా రూ.11 వేలు మాత్రమే అందుకున్నట్టు తెలిపారు. అది కూడా ‘జయం’ సినిమాలో విలన్ పాత్ర పోషించినందుకని చెప్పారు. అప్పటికే రెండు చిత్రాల్లో హీరోగా నటించిన గోపీచంద్ మరీ అంత తక్కువకే నటించడం అందరినీ ఆశ్చర్యానీకి గురిచేస్తోంది. తన కేరీర్ లోనే ‘పక్కా కమర్షియల్’కే ఎక్కువ పారితోషికం తీసుకున్నారని కూడా చెప్పారు.