Dharmendra: తమిళనాడు అల్లుడు ధర్మేంద్ర, ఆయన మొదటి భార్య ఎవరో తెలుసా?
Dharmendra: బాలీవుడ్ సూపర్‌స్టార్ ధర్మేంద్ర తమిళనాడు అల్లుడు. కానీ ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఇక్కడ ఇచ్చాము. ఆయన తమిళనాడుకు ఎలా అల్లుడు అయ్యాడు?

మొదటి భార్య ఎవరు?
బాలీవుడ్ సూపర్‌స్టార్ ధర్మేంద్ర. ఈయన సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ కౌర్ అనే మహిళను పెళ్లాడారు. వీరికి నలుగురు పిల్లలు పుట్టారు. సినిమాల్లోకి వచ్చాక నటి హేమమాలినితో ప్రేమలో పడ్డారు. ఆమె కోసం మతం మారి రెండో పెళ్లి చేసుకున్నారు. హేమమాలినిది తమిళనాడు. అందుకే ధర్మేంద్ర తమిళనాడు అల్లుడిగా మారారు.
కొడుకులు ఎవరు?
ధర్మేంద్ర పెద్ద కొడుకు సన్నీ డియోల్. ఇతను సినిమాల్లో రాణిస్తున్నాడు. ఇక రెండో కొడుకు బాబీ డియోల్. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. ధర్మేంద్ర కూతుళ్లు విజేత, అజిత. వీరిద్దరికీ కూడా పెళ్లిళ్లు అయి బాగా సెటిల్ అయ్యారు. వీరంతా మొదటి భార్యకు పుట్టిన వారు.
రెండో భార్యతో పిల్లలు
ధర్మేంద్ర రెండో భార్య బాలీవుడ్ టాప్ హీరోయిన్ హేమమాలిని. ఈమెతో ఇద్దరు కూతుళ్లను కన్నారు ధర్మేంద్ర. వారు ఈషా డియోల్, అహానా డియోల్. నటి ఈషా డియోల్, భరత్ తఖ్తానీని పెళ్లాడి 2024లో విడిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. అహానా డియోల్, వ్యాపారవేత్త వైభవ్ వోరాను పెళ్లాడారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు.
ధర్మేంద్ర కుటుంబం
ధర్మేంద్ర పెద్ద కుటుంబానికి పెద్దదిక్కు. ఇద్దరు భార్యలతో కలిసి ఆయన వచ్చే నెలలో తన 90వ పుట్టినరోజు జరుపుకోవాల్సి ఉంది. కానీ అంతలోనే ఆయన కన్నుమూశారు. ధర్మేంద్ర మరణంతో ఆయన కుటుంబంతో పాటు బాలీవుడ్ పరిశ్రమ కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.

