Diwali 2022: ఆ హీరోకి మాత్రమే కలిసొచ్చిన దీపావళి...నలుగురిలో విన్నర్ ఎవరంటే?
దీపావళి బరిలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని పాజిటివ్, కొన్ని మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. సర్దార్, ఓరి దేవుడా, ప్రిన్స్, జిన్నా చిత్రాల్లో వసూళ్ల ఆధారంగా విన్నర్ ఎవరో చూద్దాం...

diwali 2022
ఒకే రోజు నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ పై దండెత్తాయి. సర్దార్, జిన్నా, ప్రిన్స్, ఓరి దేవుడా అక్టోబర్ 21న థియేటర్స్ లో దిగాయి. విడుదలైన అన్ని చిత్రాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ప్రిన్స్ చిత్రం మాత్రమే మిక్స్డ్ టాక్ అందుకుంది. మరి దీపావళి బరిలో దిగిన కార్తీ, మంచు విష్ణు, శివ కార్తికేయ, విశ్వక్ సేన్ లలో పై చేయి ఎవరిది అయ్యిందో చూద్దాం.
కార్తీ సర్దార్ అంటూ స్పై థ్రిల్లర్ తో ప్రేక్షకులను పలకరించాడు. కార్తీ డ్యూయల్ రోల్ చేయగా దర్శకుడు మిత్రన్ తెరకెక్కించారు. సర్దార్ పాజిటివ్ టాక్ దక్కించుకుంది. వీకెండ్ ముగిసేనాటికి ఈ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించింది. సర్దార్ మూడు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.5 కోట్ల షేర్ రాబట్టింది.
తమిళ హిట్ మూవీ ఓ మై కడవులే రీమేక్ ఓరి దేవుడా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మెజారిటీ ఆడియన్స్ పర్లేదన్నారు. వెంకటేష్ క్యామియో రోల్ చేయగా కొంత ప్లస్ అయ్యింది. విశ్వక్ సేన్ హీరోగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓరి దేవుడా రూ. 2.3 కోట్ల షేర్ అందుకుంది.
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ సెకండ్ మూవీతోనే శివ కార్తికేయన్ ని డైరెక్ట్ చేసే అవకాశం కొట్టేశాడు. అయితే దాన్ని అనుదీప్ పూర్తి స్థాయిలో ఉపయోగించలేదన్న మాట వినిపించింది. అక్కడక్కడా మెప్పించే కామెడీ మినహాయిస్తే మూవీలో విషయం లేదని తేల్చేశారు. ప్రిన్స్ ఏపీ/తెలంగాణాలలో వీకెండ్ ముగిసేనాటికి రూ. 1.77 కోట్ల షేర్ అందుకుంది.
దీపావళి చిత్రాల్లో మంచు విష్ణు డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి కనీస వసూళ్లు దక్కలేదు. సన్నీ లియోన్, పాయల్ వంటి గ్లామరస్ హీరోయిన్స్ నటించినా ప్రేక్షకులు ఆకర్షితులు కాలేదు. కామెడీ, హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జిన్నా కేవలం రూ.30 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు.
వసూళ్లపరంగా దీపావళి చిత్రాల్లో విన్నర్ గా కార్తీ సర్దార్ నిలిచింది. అయితే ఈ నాలుగు చిత్రాలకు మించిన ఆక్యుపెన్సీ కాంతారకు దక్కడం విశేషం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కాంతార అధిక వసూళ్లు రాబడుతుంది. కొత్త చిత్రాలు విడుదలైనప్పటికీ కాంతార మూవీ ఉన్న థియేటర్స్ కే ప్రేక్షకులు పరుగు తీస్తున్నారు. కాంతార తెలుగు వెర్షన్ ఇప్పటికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.