- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్ ను నిందించిన తులసి.. తప్పు తెలుసుకొని తులసి కాళ్ళ మీద పడ్డ దివ్య!
Intinti Gruhalakshmi: ప్రేమ్ ను నిందించిన తులసి.. తప్పు తెలుసుకొని తులసి కాళ్ళ మీద పడ్డ దివ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ ఒక కుటుంబ మీద ఉన్న బాధ్యత అనే కాన్సెప్టుతో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

తులసి (Tulasi) ప్రేమ్ (Prem) జీవితాన్ని దారిలో పెట్టాలని అనుకోని దారి తప్పించేలా చేస్తున్నానా అని వాళ్ళ మామయ్య ను అడుగుతుంది. అంతేకాకుండా నేను వాడి బలహీనతగా మారాను అనే కదా వాడిని ఇంట్లో నుంచి తరిమేసింది అని అంటుంది.
అందుకే కదా ఎవరెన్ని మాటలు అనుకుంటున్నా.. నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నా గుండె రాయి చేసుకుని బ్రతికేది అని తులసి (Tulasi) అంటుంది. ఇక ఆ మాటలు దివ్య (Divya) ఒక చోట ఉండి వింటుంది. మా అమ్మని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను అని గ్రహించుకుంటుంది.
అదే క్రమంలో తులసి (Tulasi) నా కొడుకుని ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ నా కొడుకుని నేను గెలిపించుకుంటాను అని అంటుంది. ఇక ఆ మాటలు విన్న దివ్య (Divya) మా అమ్మ మా కుటుంబం కోసం ఎన్ని పనులు చేస్తుందో అని కుమిలి పోతూ ఏడుస్తూ ఉంటుంది.
ఇక ఆ బాధను తట్టుకోలేక దివ్య (Divya) తులసి (Tulasi) కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు మామ్ అని అడుగుతుంది. ఇన్ని రోజులు నీ మంచితనం నాకు తెలియక దెయ్యం పట్టిన దానిలా చేశాను అంటూ ఏడుస్తుంది. దానితో తులసి దివ్య ను దగ్గరికి తీసుకొని ఈ నిజాన్ని ఎవరికీ చెప్పవద్దు అని అంటుంది.
ఆ తర్వాత తులసి (Tulasi) మాధవి (Madhavi) కి కాల్ చేసి ప్రేమ్ అలా చేయడం నాకు నచ్చలేదు అని అంటుంది. అంతేకాకుండా తులసి తనకు ఇష్టమైన సంగీతం విద్యను ఎలాగైనా నేర్చుకోమని చెబుతుంది. ఇక దానికి కావలసిన డబ్బు ఎంతైనా నేను ఇస్తాను అని అంటుంది.
మరోవైపు లాస్య (Lasya) దంపతులను ఆ ఫ్యామిలీ లోకువ చేసి మాట్లాడుతున్నందుకు లాస్య ఇంటి నుంచి వెళ్లి పోవడానికి బట్టలు సర్దుకుంటుంది. ఈ క్రమంలో నందు పై కూడా గొడవ పడుతుంది. మరోవైపు ప్రేమ్ (Prem) ఫ్యామిలీతో హోలీ వేడుకలు ఆనందంగా జరుపుకుంటూ ఉండగా తులసి అక్కడికి వెళుతుంది.
ఇక ప్రేమ్ (Prem) హ్యాపీ హోలీ అని చెప్పగా తులసి (Tulasi) ఆ రంగులు కోపంతో విసిరేస్తుంది. అంతేకాకుండా అమ్మ కి ఇచ్చిన మాటను గాలికి వదిలేసి అడ్డదారిలో బ్రతుకుతూ నువ్వు నా మనసును చించేసావు అని అంటుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.