- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అత్తకి ఓటమి రుచి చూపిస్తానంటున్న దివ్య.. పూజారి మాటలకి అవాక్కైన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: అత్తకి ఓటమి రుచి చూపిస్తానంటున్న దివ్య.. పూజారి మాటలకి అవాక్కైన రాజ్యలక్ష్మి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. భర్త మీద తప్పుడు కేసు పెట్టి పగ సాధించాలని చూస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తల్లికి ఫోన్ చేసి కోర్టుకి వస్తున్నావు కదా అని అడుగుతుంది దివ్య. నేనెందుకు అంటుంది తులసి. అదేంటమ్మా అలా అంటావు నువ్వు వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా.. నేను విక్రమ్ కూడా కోర్టుకు వస్తున్నాము అంటుంది దివ్య. ఎందుకమ్మా రిస్క్ అవుతుందేమో అంటుంది తులసి. ఏం పర్వాలేదమ్మ నేను చూసుకుంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది దివ్య.
కోర్టు వాదనలో లేనిపోని నిజాలు బయటకు వస్తాయి. దివ్యకి విక్రమ్ కి మధ్యలో గొడవలు రావచ్చు నేను వెళ్తే మంచిది అనుకొని నందుతో నేను కూడా వస్తాను అంటుంది తులసి. ఆమె అలా అనటంతో పరంధామయ్య దంపతులు కూడా కోర్టుకి వస్తారు. మరోవైపు నీ కొడుకు నీ మాట కాదని కోర్టుకు వెళ్తే ఏం చేస్తావు అని రాజ్యలక్ష్మిని రెచ్చగొడతాడు బసవయ్య.
నా మాట కాదంటే నా నగలన్నీ నీ భార్యకి ఇచ్చేస్తాను అంటూ పందెం కడుతుంది రాజ్యలక్ష్మి. ఇంతలో దివ్య, విక్రమ్ కిందికి దిగి బయటికి వెళ్తున్నాము అని రాజ్యలక్ష్మి కి చెప్తారు. అదేంటి పూజ ఉంచుకొని ఎక్కడికి వెళ్తావు అంటుంది రాజ్యలక్ష్మి. అంతలోనే అక్కడికి వచ్చిన పూజారి గారు ఈరోజు పూజ మానేస్తే మీ అమ్మగారి ఆరోగ్యం కోసం ఇన్నాళ్లు చేసిన పూజ ఫలితం అంతా పోతుంది అంటారు.
ఇదంతా అత్తగారి పన్నాగం అని అర్థం చేసుకుంటుంది దివ్య. ఈరోజు శుక్రవారం అని మర్చిపోయాను అంటూ దివ్యని ఏం చేద్దాం అని అడుగుతాడు. అత్తయ్య గారి ఆరోగ్యం కోసం పూజ చేద్దాం అంటుంది దివ్య. మనసులో మాత్రం ఇప్పుడే ఆట ప్రారంభమైంది తొందర్లోనే మీకు ఓటమి రుచి చూపిస్తాను. అనుకుంటుంది దివ్య. మరోవైపు కోర్టులో నందు మీద లేనిపోనివి చెప్తాడు లాయర్.
అదంతా అబద్ధం అంటూ కేకలు వేస్తాడు నందు. చూసారా ముద్దాయి కోర్టులోనే ఇలా ప్రవర్తించాడు అంటే ఇంటిలో ఇంకెంత రూడ్ గా ప్రవర్తిస్తాడో మీరే ఆలోచించండి అంటాడు లాయర్. నందు ప్రవర్తనని తప్పు పడతాడు జడ్జ్. ఇతని ప్రవర్తన చాలా ఘోరంగా ఉంటుంది అందుకే ఇతని మొదటి భార్య ఇతనికి విడాకులు ఇచ్చింది అని చెప్తాడు లాస్య తరపు లాయర్.
అప్పుడు తులసి లేచి నా గురించి మాట్లాడారు కాబట్టి నా తరఫున వాదన కూడా వినాలని జడ్జి గారిని పర్మిషన్ అడుగుతుంది. జడ్జి పర్మిషన్ యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు బోనులోకి వచ్చిన తులసి మేము విడాకులు తీసుకున్న మాట నిజమే కానీ ఆయన వల్ల నేను ఏనాడూ ఇబ్బంది పడలేదు. మా అభిప్రాయాలు కలవలేదు అందుకే విడిపోయాము అంటుంది తులసి.
మీరెందుకు వాళ్ళు ఇంటిలో ఉంటున్నారు అని అడుగుతాడు లాయర్. అది మీరు మీ క్లైంట్ ని అడగండి.. నేను ఉంటున్న ఇల్లు నాది. నేను నా అత్తమామలతో కలిసి ఉంటున్నాను. అదే ఇంటిలో మీ క్లైంటు, ఆమె భర్త ఎందుకుంటున్నారో మీరే తనని అడిగి తెలుసుకోండి అంటుంది తులసి. మీ భర్తతో మీరు విడిపోయినప్పటికీ మీ ఇద్దరి మధ్యన అనుబంధం ఉన్నట్టు మా క్లైంట్ చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజం అంటాడు లాయర్.
ఇదంతా అబద్ధం అంటుంది తులసి. తులసిని బోన్ లోంచి పంపించేసి లాస్య ని విచారించడానికి పిలుస్తాడు లాయర్. మీ ఇద్దరికీ గొడవ ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. నన్ను పక్కనపెట్టి వాళ్ళిద్దరూ కూతురికి కన్యాదానం చేశారు అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య సాహిత్యం పెరిగింది మా అత్తమామలు కూడా నాకు సపోర్ట్ ఇవ్వరు నేను ఒంటరిదాన్ని అంటూ అమాయకంగా మాట్లాడుతుంది లాస్య.
ఇదంతా చూస్తున్న భాగ్యం నటనలో ఏం జీవించేస్తున్నావు అనుకుంటుంది. అప్పుడు మాధవి భర్త లేచి నిజానికి టార్చర్ అనుభవించింది నా క్లైంట్. సహనం కోల్పోయి భార్యని బయటికి పంపించాడు తప్పితే చేయి చేసుకోలేదు అంటూ తులసిని విచారించడానికి జడ్జిని పర్మిషన్ అడుగుతాడు మాధవి భర్త. జడ్జి గారు పర్మిషన్ ఇవ్వడంతో బోన్ లోకి వస్తుంది తులసి.
తరువాయి భాగంలో కింద కూర్చుని భోజనం చేస్తున్న విక్రమ్ తో ఈరోజు తో మీ అమ్మగారి కి ఉన్న దోషం మొత్తం పోయింది ఇక మీరు కిందన కూర్చొని భోజనం చేయక్కర్లేదు అని చెప్తారు పంతులుగారు. రాజ్యలక్ష్మి వాళ్ళు షాక్ అవుతారు. విక్రమ్ దంపతులు ఇద్దరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒకరికి ఒకరు తినిపించుకుంటారు.