MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: మొదలైన దివ్య విక్రమ్ పెళ్లి సంబరాలు.. నందుకు షాకింగ్ నిజం చెప్పిన ప్రియా?

Intinti Gruhalakshmi: మొదలైన దివ్య విక్రమ్ పెళ్లి సంబరాలు.. నందుకు షాకింగ్ నిజం చెప్పిన ప్రియా?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
| Updated : Apr 15 2023, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో రాజ్యలక్ష్మి ఆ దివ్య ఈరోజే మొగుడుతో సరసాలు ఆడుతూ సంతోషంగా ఉండేది రేపటి నుంచి ఆ సంతోషాన్ని నేను దూరం చేస్తాను అనడంతో ప్రియ ఎమోషనల్ అవుతుంది. మీ కాళ్లు పట్టుకుంటాను అత్తయ్య అనగా ఈ పని నువ్వు ఇప్పుడు కాదు సంజయ్ ని పెళ్లి చేసుకోక ముందు చేయాల్సింది అని అంటుంది. నన్ను పిచ్చిదాన్ని చేసే ఆడించారు ఇప్పుడు నువ్వు అది ఇద్దరు కలిసి అనుభవించండి అని అంటుంది. ఇంతలో పని మనిషిని పిలిచి నేను చెప్పే వరకు దీన్ని ఇక్కడే బంధించండి పొరపాటున తెరిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని వార్నింగ్ ఇస్తుంది. మరొకవైపు తులసి అందరూ కళ్యాణ మండపం వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటారు.
 

26

 రేపు ప్రేమ్ పని సరిగా వచ్చాయో లేదో చూడు నేను సామాన్యంగా చూస్తాను నువ్వు వెళ్లి నీ కూతురు సంగతి చూసుకో ఎక్కడో మూలను కూర్చుని ఉంటుంది చూడు అని సరదాగా ఆటపట్టిస్తూ ఉంటాడు. అప్పుడు దివ్య కార్ల నుంచి చిటికేసి పిలిచి ఏంట్రా అన్నయ్య నన్ను మర్చిపోయి వెళ్తారని ముందే వచ్చి కార్లో కూర్చున్నాను అని అంటుంది. అప్పుడు దివ్య మాటలకు అందరూ సంతోషపడుతూ ఉంటారు. తర్వాత అందరూ రావడంతో ఒక్కొక్కరు వెళ్లి కారులో కూర్చుంటారు. అప్పుడు అందరూ కారు ఎక్కగా మంగళసూత్రం దేవుడి దగ్గర పెట్టాను తీసుకు వస్తాను అని తులసి లోపలికి వెళ్లి తీసుకువస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి బయలుదేరుతారు.
 

36

అందరూ కళ్యాణ మండపానికి చేరుకొని కళ్యాణ మండపంలో ఏం కావాలో అని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అందరూ హడావిడి చేస్తుండగా అది చూసి పరంధామయ్య అనసూయ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత నందు అక్కడికొచ్చి తులసి కనిపించిందా అని అందరిని అడుగుతూ ఉండగా అప్పుడు లాస్య ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో తులసి రావడంతో ఎందుకు పిలిచారు అనగా మర్చిపోయాను అనడంతో చూడాలనిపించి పిలిచి ఉంటావులే నందు అని లాస్య అక్కడికి వస్తుంది. తర్వాత మగపెళ్లి వారు రావడంతో వెళ్లి సంతోషంగా వాళ్ళని పీల్చుకొని వస్తాను.
 

46

అప్పుడు అందర్నీ అక్కడి నుంచి వెళ్ళిపోగా ఏంటి నందు అలాగే చూస్తున్నాం ముద్దొస్తున్నానా అని లాస్య అనగా ఎందుకు నువ్వు రాజ్యలక్ష్మితో రాసుకుపోసుకు తిరుగుతున్నావు అని అంటాడు. లేదు అనగా డబ్బున్నాయి కదా అని ఎక్కువ రాసుకుపోసుకొని తిరిగి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. మరొకవైపు ప్రియ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. లోపల ప్రియ గట్టిగా అరుస్తూ ఎమోషనల్ అవుతూ ఉండగా బయట పని మనుషులు ఏం చేయలేక టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటారు. అక్కడ ఆడపిల్లకు అన్యాయం జరుగుతోంది మీరు బయట ఉన్నారని నాకు తెలుసు ప్లీజ్ తలుపులు తీయండి అని ప్రియా ఎమోషనల్ అవుతూ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది.
 

56

 ప్లీజ్ కాంతం నేను ఒకసారి చెప్పేది విను అంటూ పనిమనిషిని బ్రతిమలాడుతూ ఉంటుంది.  మరోవైపు కళ్యాణ మండపంలో విక్రమ్ పెళ్లి మండపంపై పూజ చేస్తుండగా మరొకవైపు తులసి దివ్య అందరూ కలిసి పూజ చేస్తూ ఉంటారు. అందరూ సంతోషంగా దివ్య వైపు చూస్తూ ఉంటారు. మరోవైపు దివ్య కోసం విక్రమ్ ఆరాటంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత సరస్వతి గౌరీ పూజ ఎందుకు చేస్తారో అందరికీ వివరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విక్రమ్ ని సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు దేవుడు. అప్పుడు బసవయ్య లేనిపోని మాటలు చెప్పి రాజ్యలక్ష్మి రెచ్చగొడుతూ ఉంటాడు. తర్వాత పూజ పూర్తి అవ్వడంతో విక్టరీని బట్టలు మార్చుకొని రమ్మని చెబుతాడు.
 

66

 తర్వాత విక్రమ్ బట్టలు మార్చుకొని కళ్యాణ మండపంకి వచ్చి కూర్చుంటాడు. తర్వాత దివ్యని కళ్యాణ మండపంకి మేనమామలు ఇద్దరూ బుట్టలో తీసుకుని వస్తారు. అప్పుడు విక్రమ్ దివ్యని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆరాటపడుతూ ఉంటాడు. అది చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు. మరోవైపు ప్రియా ఈ పెళ్లి ని నేను ఆపలేను కాబట్టి నా ఊపిరి నేను ఆపేస్తాను నా ప్రాణాలు తీసుకుంటాను అనడంతో బయట ఉన్న పనిమనిషి కాంతం వాళ్ళు భయపడుతూ ఉంటారు. ప్రాణం తీసుకోవడం ఏంటమ్మా అని భయపడుతూ డోర్ తీయగా ప్రియ బయటకు వచ్చి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Recommended image2
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే
Recommended image3
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved