- Home
- Entertainment
- దివ్వెల మాధురి పెద్ద ఫేక్, నన్ను మోసం చేసింది.. ఫైర్ బ్రాండ్ గాలి తీసేసిన అలేఖ్య పికిల్స్ బ్యూటీ
దివ్వెల మాధురి పెద్ద ఫేక్, నన్ను మోసం చేసింది.. ఫైర్ బ్రాండ్ గాలి తీసేసిన అలేఖ్య పికిల్స్ బ్యూటీ
దివ్యెల మాధురిపై అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్ రమ్య మోక్ష హాట్ కామెంట్ చేసింది. ఆమె పెద్ద ఫేక్ అని తేల్చి చెప్పింది. ప్రారంభంలో ఒకలా ఉందని, ఆ తర్వాత మరోలా మారిపోయిందని, మోసం చేసిందని తెలిపింది.

మాధురిపై రమ్య హాట్ కామెంట్
దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి రావడంతో ఒక్కసారి అలజడి చోటు చేసుకుంది. ఆమె వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మాధురి రావడం రావడంతో హౌజ్‌మేట్లకి కౌంటర్లిస్తూ కంటెంట్ ఇచ్చింది. మంచా, చెడా అనేది పట్టించుకోకుండా అందరిపై నోరేసుకుని పడిపోతుంది. ఆమె రమ్య మోక్షతో చాలా క్లోజ్‌గా ఉంది. ఏదైనా వీరిద్దరే కలిసి మాట్లాడుకున్నారు. గట్టిగా గాసిప్స్ క్రియేట్ చేశారు. అక్కా చెల్లెళ్ల మాదిరిగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మాధురీపై మోక్ష షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె తనని మోసం చేసిందంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
దివ్వెల మాధురి ఫేక్ పర్సన్
రమ్య మోక్ష ఈ ఆదివారం(ఏడో వారం) బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ ఆమె హాట్ కామెంట్ చేసింది. ముఖ్యంగా తనూజ, కళ్యాణ్, రీతూ, దివ్యాలను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. అనంతరం బిగ్ బాస్ బజ్‌లో పాల్గొంది. శివాజీ హోస్ట్ గా ఈ షో రన్ అవుతుంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన వెంటనే ఆమె ఈషోలో పాల్గొంది. ఇందులో బిగ్ బాస్ షోకి వచ్చి ఏం నేర్చుకున్నావని శివాజీ అడగ్గా, ఎవరినీ నమ్మొద్దని నేర్చుకున్నట్టు తెలిపింది. అందులో భాగంగానే మాధురి ప్రస్తావన తీసుకొచ్చింది. ఆమె ప్రారంభంలో తనతో ఎంతో క్లోజ్‌గా ఉందని, అన్నీ పంచుకునేదని, కానీ ఓ టాస్క్ లో భాగంగా వేరే టీమ్‌గా మారిపోవడంతో తనని దూరం పెట్టిందని, మాటల్లో మార్పు కనిపించిందని, తనని పట్టించుకోలేదని చెప్పింది. మాధురి ఫేక్ పర్సన్ అని స్పష్టం చేసింది. మాధురీపై రమ్య ఇలాంటి కామెంట్ చేయడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
గుంటనక్క, గాడిద ఎవరో చెప్పిన రమ్య
ఇతర కంటెస్టెంట్ల గురించి రమ్య చెబుతూ, పవన్ సెల్ఫీష్ అని, దివ్య కూడా ఫేక్ పర్సన్ అని చెప్పింది. తనూజ గుంటనక్క అని, ఆమె చాలా కన్నింగ్‌గా ఉంటుందని, తన అవసరం కోసం బాండింగ్ చేసుకుంటుందని, జెలసీగా ఫీలవుతుందని తెలిపింది. రాము తాబేలు లాంటి వాడు అని, సైలెంట్‌గా, ఒంటరిగా ఉంటాడని చెప్పింది. ఇమ్మాన్యుయెల్ గాడిద అని, అందరి భారాలు మోస్తుంటాడని వెల్లడించింది. సింహం సుమన్ శెట్టి అని, ఎవరినీ పట్టించుకోకుండా తన ఆట తాను ఆడతాడు, అవసరమైతే రెచ్చిపోతాడని వెల్లడించింది. చిరుత గౌరవ్ అని, కళ్యాణ్ పాము అని, సంజనా పిల్లి అని, పాండా మాధురి అని, కోతి రీతూ చౌదరీ అని, జిరాఫీ పవన్ ని అందని వాటి కోసం తాపత్రయపడుతుంటాడని చెప్పింది.
అలేఖ్య చిట్టి పికిల్స్ తో పాపులర్ అయిన రమ్య
అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయి రమ్య మోక్ష వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదో వారం నిర్వహించిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆమెతోపాటు దివ్వెల మాధురి, అయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాసా సాయి వైల్డ్ కార్ద్ ద్వారా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రారంభంలో రమ్య మోక్ష హడావుడి చేసింది. బయట ఏం జరుగుతుందో, బిగ్ బాస్ షోపై ఎలాంటి అభిప్రాయం ఉందో, అలాగే కంటెస్టెంట్లపై ఆడియెన్స్ ఏం ఫీలవుతున్నారో వారికి చెప్పింది. మొత్తంగా గాసిప్ రాణిగా మారిపోయింది. ప్రారంభంలో రెండు మూడు రోజులు అదే పనిచేసింది. వాటికే పరిమితమై నెగటివిటీని మూటగట్టుకుంది. చివరికి ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.