MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దీన్ని కెలికితే మనకే నష్టం అనుకునేలా చేస్తా, నా జీవితంలో అలాంటి డర్టీ థింగ్స్ ఉండవు.. దివి కామెంట్స్

దీన్ని కెలికితే మనకే నష్టం అనుకునేలా చేస్తా, నా జీవితంలో అలాంటి డర్టీ థింగ్స్ ఉండవు.. దివి కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివి ప్రస్తుతం నటిగా నటిస్తోంది. దివి సోషల్ మీడియాలో బ్యూటీ క్వీన్ గా మారిపోయింది. ఆమె షేర్ చేసే పిక్స్ వైరల్ అవుతుంటాయి. వెబ్ సిరీస్ లు, ఓటీటీ చిత్రాలు ఇలా దివి అన్ని ట్రై చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 25 2024, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న దివి ప్రస్తుతం నటిగా నటిస్తోంది. దివి సోషల్ మీడియాలో బ్యూటీ క్వీన్ గా మారిపోయింది. ఆమె షేర్ చేసే పిక్స్ వైరల్ అవుతుంటాయి. వెబ్ సిరీస్ లు, ఓటీటీ చిత్రాలు ఇలా దివి అన్ని ట్రై చేసింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

హీరోయిన్ కావాలనేది దివి కల. అయితే దివికి పూర్తి స్థాయిలో అవకాశాలు రావడం లేదు. దివి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. రీసెంట్ గా దివి లంబసింగి అనే చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో దివి తన కెరీర్ గురించి ఓపెన్ అయింది. 

36

తాను అన్ని పాత్రలకు అంగీకరించని తేల్చి చెప్పేసింది. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవి గారు నాకు మంచి పాత్రలో నటించే ఛాన్స్ ఇచ్చారు. నా పాత్ర వల్లే ఆ చిత్రంలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. అలా నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తాను. లేదంటే సున్నితంగా డైరెక్టర్లని రిక్వెస్ట్ చేసి చేయనని చెప్పేస్తా. 

46

టాలీవుడ్ లో దివి కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయింది. తనకెప్పుడూ అలాంటి అనుభవం ఎదురుకాలేదని దివి తెలిపింది. నాకు ఎదురైనా దర్శకులు నటులు అందరూ మంచి వారే. బహుశా నా నడవడిక కూడా కారణం కావచ్చు. నాకు ఎదురైన దర్శకులు వేరే హీరోయిన్లని కమిట్మెంట్ అడుగుతారేమో నాకు తెలియదు. 

56

నన్ను ఎవరూ అడగరు.. ఒకేవేళ అలా అడిగినా నేను ఒప్పుకోను. బహుశా దీన్ని కెలికితే మనకే నష్టం అని అనుకునేలా నా ప్రవర్తన ఉంటుందేమో. నా కెరీర్ లో అలాంటి డర్టీ థింగ్స్ కి ఆస్కారం లేదు అని దివి తేల్చి చెప్పేసింది. మనం బిహేవ్ చేసే విధానం బట్టి కూడా అవతల వారి ప్రవర్తన ఉంటుంది. మోడ్రన్ గా, కాస్త స్పీడ్ యాటిట్యూడ్ తో ఉంటే బహుశా అలాంటి అనుభవాలు ఎదురుకావచ్చు అని దివి తెలిపింది. 

66

పదేళ్ల తర్వాత నేను మంచి పొజిషన్ లో ఉన్నప్పటికీ.. వెనక్కి చూసుకుంటే.. నా కెరీర్ లో ఎలాంటి డర్టీ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు అని దివి తెలిపింది. నేను సోషల్ మీడియాలో గ్లామర్ గా కనిపించినా ఎక్కువగా ట్రెడిషనల్ శారీలు లాంటివే వేసుకుంటానని దివి తెలిపింది. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా అందంగా కనిపించొచ్చు అనేది తన ఉద్దేశం అని దివి పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Recommended image2
Madhuri Dixit: గర్భవతి, పైగా జ్వరం.. అయినా 13 గంటలు డ్యాన్స్ చేసిన హీరోయిన్
Recommended image3
Janhvi Kapoor: 8 ఏళ్లలో 15 సినిమాలు చేసిన పెద్ది హీరోయిన్.. చివరి 5 సినిమాల్లో ఒక్కటి మాత్రమే హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved