- Home
- Entertainment
- Divi Latest Photos : నేలపై ఉండనంటూ ట్రాక్టర్ పైకి ‘దివి’.. గ్లామర్ తో వెదర్ టెంపరేచర్ పెంచేస్తోంది..
Divi Latest Photos : నేలపై ఉండనంటూ ట్రాక్టర్ పైకి ‘దివి’.. గ్లామర్ తో వెదర్ టెంపరేచర్ పెంచేస్తోంది..
బిగ్ బాస్ 4 ఫేమ్, మోడల్, నటి, దివి (Divi) చీరకట్టు అందాలతో నెటిజన్లను ఆకర్షిస్తోంది. నేలపై ఉండలేనన్నట్టుగా ట్రాక్టర్ పైకెక్కింది. అప్పుడే పూసిన రెడ్ రోస్ లా అందరి చూపును తనవైపే తిప్పుకుంటోంది. ఈ సుందరి తాజా ఫొటోలకు నెటిజన్ల గుండెలు జారిపోతున్నాయి.

బిగ్ బాస్ 4(Bigboss 4) ఫేమ్ ‘దివి’ ఇటీవల సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తన స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యే చీరను ధరించి చూపరులను ఆకట్టుుంటోంది. ఆమె గ్లామర్ కి తోడు కవ్వించే చూపులు కుర్రాళ్ల నిద్రను దూరం చేస్తోంది.
అందాల దివి(Divi) ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ సెన్సేషన్. బిగ్ బాస్ 4 తో వెలుగులోకి వచ్చిన ఈ భామ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. గతంతో పోల్చితే బిగ్ బాస్ తర్వాత దివి కెరీర్ ఒకింత మెరుగైంది. ఆమెకు పలు రకాల పాత్రలు, అవకాశాలు దక్కుతున్నాయి.
హీరోయిన్ గా వెలిగిపోవాలన్న దివి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. ఒక్క క్లీన్ హిట్ ఖాతాలో పడితే దివి ఫేట్ మారిపోయినట్లే. ఆ మధ్య దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ పర్వాలేదు అనిపించుకుంది.దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి.
అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ బోల్డ్ నెస్ చూపిస్తున్న దివి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ట్రాక్టర్ పైకెక్కి ఫొటోలకు ఫోజులిచ్చింది.
మందార పువ్వు రంగు చీర, బ్లాక్ బ్లౌజ్ ధరించిన ‘దివి’ చాలా అందంగా కనిపిస్తోంది. తనలోని తెలుగమ్మాయిని అభిమానులకు చూపించింది. చిరునవ్వుతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతోంది. తన అందాన్ని ఆయుధంగా వాడుతూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. తను పోస్ట్ చేసిన ఫొటోలకు క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘చెప్పమ్మ.. చెప్పమ్మ అంటోందీ ఓ మోమాటం’ అని అంటోంది దివి.
అంతేకాకుండా తన డ్రీమ్ బీచ్ బాడీని బిల్డ్ చేసేందుకు దివి ప్రత్యేకమైన ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. నాన్ ఇన్వాసివ్ విధానంతో తన శరీంలోని కొవ్వు కణాలను కరిగదీస్తోంది. ఈ మేరకు తన తీసుకుంటున్న చికిత్సకు సంబంధించిన వివరాలను ఇన్ స్టాలో ఫాలోవర్స్ తో పంచుకుంది. ఈ ట్రీట్ మెంట్ తో ఇకపై దివి మరింత హెల్తీగా, గ్లామర్ గా, ఫిట్ గా కనిపించే అవకాశం ఉంది.