- Home
- Entertainment
- శ్రీహరి మరణం తర్వాత మూడు నెలలు డిప్రెషన్ లో ఉన్నా.. మద్యానికి బానిసయ్యా, డిస్కో శాంతి కామెంట్స్
శ్రీహరి మరణం తర్వాత మూడు నెలలు డిప్రెషన్ లో ఉన్నా.. మద్యానికి బానిసయ్యా, డిస్కో శాంతి కామెంట్స్
తెలుగు నటి, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది.

తెలుగు నటి, ఐటెం సాంగ్స్ తో పాపులర్ అయిన డిస్కో శాంతి గురించి పరిచయం అవసరం లేదు. 90వ దశకంలో డిస్కో శాంతి పలు చిత్రాల్లో స్పెషల్ నంబర్స్ లో మెరిసింది. అనంతరం హీరో శ్రీహరిని వివాహం చేసుకుంది. 2013లో శ్రీహరి అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డిస్కో శాంతి ఫ్యామిలీ, పిల్లల బాధ్యత చూసుకుంటున్నారు.
శ్రీహరి మరణం తర్వాత తమ కుటుంబ పరిస్థితి బాగా దిగజారిపోయింది అని డిస్కో శాంతి ఆవేదన వ్యక్తం చేసింది. తాజా ఇంటర్వ్యూలో శ్రీహరి మరణం గురించి, తమ ఆర్థిక పరిస్థితి గురించి డిస్కో శాంతి ఊహించని కామెంట్స్ చేసింది.
బావ శ్రీహరి మరణం తర్వాత మద్యానికి బానిసయ్యా. మూడు నెలల వరకు కోలుకోలేకపోయా. ఆ సమయంలో నా సోదరులు కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. పిల్లలు చదువులకోసం వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యుల ధైర్యంతోనే కోలుకున్నా. ఆ తర్వాత పిల్లలు నాకు సపోర్ట్ ఇచ్చారు.
టాలీవుడ్ లో విలన్ పాత్రలు చేస్తున్న సమయంలో శ్రీహరి.. డిస్కో శాంతి డ్యాన్స్ చూసి ఆమెని ప్రేమించారు. ఆ తర్వాత ఇద్దరూ వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. 2013లో శ్రీహరి కాలేయ సంబంధింత వ్యాధితో మరణించిన సంగతి తెలిసిందే. శ్రీహరి మృతిపై డిస్కోశాంతి ఇటీవల అనేక ఆరోపణలు చేసారు.
డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి మరణించే కొన్ని గంటల ముందు వైద్యులు వచ్చి చెకప్ చేశారు. శ్రీహరిని చూడడానికి కూడా నన్ను అనుమతించలేదు. అయితే వైద్యులు కొన్ని మెడిసిన్స్, ఇంజక్షన్స్ సూచించారు. ఓ నర్సు వచ్చి ఇంజక్షన్ ఇచ్చింది. కొంతసేపటికే శ్రీహరి కళ్ళు, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చింది.
ఆ తర్వాత శ్రీహరి మరణించినప్పటికీ కొన్ని గంటల వరకు నాకు చెప్పలేదు. అంతా ఠాగూర్ చిత్రంలో జరిగినట్లు అనిపించింది. డబ్బు మొత్తం కట్టాక మరణించిన విషయం చెప్పారు. ఖచ్చితంగా శ్రీహరి డాక్టర్ల రాంగ్ ట్రీట్మెంట్ వల్లే మరణించారు అని సంచలన ఆరోపణలు చేసింది.