- Home
- Entertainment
- డిజాస్టరస్ గా నిలిచిన జూలై.. ఇక ఆగస్టుపైనే ఆశలు.. ఈ నెల చిత్రాలతో థియేటర్లు దద్దరిల్లుతాయా?
డిజాస్టరస్ గా నిలిచిన జూలై.. ఇక ఆగస్టుపైనే ఆశలు.. ఈ నెల చిత్రాలతో థియేటర్లు దద్దరిల్లుతాయా?
జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగు ఆడియెన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. భారీ హైప్స్ తో వచ్చిన చిత్రాలు డిజాస్టరస్ గా నిలిచాయి. దీంతో ప్రేక్షకుల చూపు ఆగస్టులో రిలీజ్ అయ్యే చిత్రాలపైనే ఉంది.

‘పుష్ఫ, ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతున్నాయి. భారీ హైప్స్ తో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన జూలై నెలలోని సినిమాలు డిజాస్టరస్ గా నిలిచాయి. ‘థ్యాంక్యూ, ది వారియర్, పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, రామరావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకకోలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద కూడా నష్టలనే మిగిల్చాయి. దీంతో ప్రేక్షకులు ఆగస్టులో కిక్కును ఎదుర్కొంటున్నారు.
ఆగస్టులో వరుసగా ఆరు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆడియెన్స్, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలు ‘సీతా రామం, బింబిసార, మాచెర్ల నియోజకవర్గం, కార్తీకేయ 2, లైగర్, ఏజెంట్’వంటి సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలపై సినీ లవర్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నెలలోని మొదటి వారంలో రిలీజ్ కానున్న చిత్రం ‘సీతా రామం’ (Sita Ramam). హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్, మ్రునాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఆగస్టు 5నే రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మరో భారీ చిత్రం ‘బింబిసార’(Bimbisara). నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ ట్రెసా జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటిసారిగా చక్రవర్తి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండటం విశేషం. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహించడం, విడుదలైన అప్డేట్స్ ఆకట్టుకుంటుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. డెబ్యూ దర్శకుడు వశిష్ట్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.
యంగ్ స్టార్ నితిన్, హ్యాట్రిక్ బ్యూటీ కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘మాచెర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఈ చిత్రానికి ప్రముఖ ఎడిటర్ ఎంఎస్ రాజశేఖర్ దర్శకత్వం వహించి.. తెలుగు ఆడియెన్స్ కు డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. పక్కా కమర్షియల్ హిట్ కొట్టాలని ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్.. సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన ‘రా రా రెడ్డి’ సాంగ్ దూసుకుపోతోంది. ఆగస్టు 12న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
యువ నటీనటులు నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కార్తీకేయ 2’ (Karthikeya 2). మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే చిత్ర యూనిట్ కూడా విభిన్నంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముుందుకు వస్తున్న నిఖిల్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. ఇటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మూవీ ఆగస్టు 12న థియేటర్లలోకి రానుంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ (Agent). స్పై - థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. నయా లుక్ తో, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ తో అఖిల్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని నెలకొల్పారు. చిత్రంలో మలయాళ నటుడు మమ్మూట్టీ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆగస్టు 12న చిత్రం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘లైగర్’. (Liger). ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. క్రేజీగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేసింది. రెండేండ్లుగా ఎదురుచూస్తున్న రౌడీ అభిమానులు సినిమా కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న వరల్డ్ వైడ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.