Samantha: సమంత భయపడి ఇలా చేయడం ఏంటి.. నిజంగానే షాకివ్వబోతోందా ?
సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా సామ్ వెనకడుగు వేయలేదు.

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఎన్ని విమర్శలు వచ్చినా సామ్ వెనకడుగు వేయలేదు.
గతంలో కంటే విడాకుల తర్వాతే సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. అలాగే ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తోంది. సమంత నటించిన 'కన్మణి రాంబో ఖతీజా' చిత్రం ఇటీవల విడుదలయింది. ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఇంత బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాకి ఎప్పుడూ దూరం కాలేదు. కానీ సామ్ కొంత కాలంగా సోషల్ మీడియాలో సైలెన్స్ మైంటైన్ చేస్తోంది.
దీనికి అనేక కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా నుంచి సమంత కొంత విరామం తీసుకోవాలని భావిస్తోందట. కనీసం మూడు నెలలు సామజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా సమంత ఇలా సోషల్ మీడియాకి దూరం కావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. చైతో విడాకుల తర్వాత సమంత కొంత ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇప్పటికి కొందరు పనిగట్టుకుని ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ ట్రోలింగ్ నుంచి బయట పడేందుకు నెగిటివిటీ దూరంగా ఉండేందుకు సమంత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ట్రోలింగ్ ఎదురైనా ధీటుగా బదులిచ్చే సమంత.. ఇలా బయపడి సోషల్ మీడియాకి దూరమై ఫ్యాన్స్ కి నిరాశ కలిగించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరి వాదన మరోలా ఉంది. గత జ్ఞాపకాల నుంచి బయట పడేందుకు సమంత 'యు కెన్ హీల్ యువర్ లైఫ్' లాంటి మోటివేషన్ బుక్స్ చదువుతోంది అని.. ఆ పుస్తకాలకి సమయం కేటాయించేందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉంటోందని అంటున్నారు.
ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాలో దూరం అయితే ఆమె ఫ్యాన్స్ కి అది తీవ్ర నిరాశే. మూడు నెలల పాటు ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందనే న్యూస్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ గా మారింది. అయితే ఇందులో ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటికిప్పుడు సమంత యాక్టివ్ అయిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. సమంత నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం యశోద ఈ నెలలోనే రిలీజ్ కావలసింది. కానీ అనుకోకుండా వాయిదా పడింది.