ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ పై డైరెక్టర్ ఓం రౌత్ రియాక్షన్.. షాకింగ్ కామెంట్స్.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). రీసెంట్ గా ఈ భారీ మూవీ నుంచి టీజర్ విడుదలై ట్రోల్స్ కు గురైంది. దీనిపై తాజాగా డైరెక్టర్ ఓం రౌత్ స్పందించారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న చిత్రం ‘ఆదిపురుష్’(Adipurush). చాలా రోజుల నిరీక్షణ తర్వాత చిత్రం నుంచి వచ్చిన ‘ఆదిపురుష్ టీజర్’ అభిమానులను కాస్తా అప్సెట్ చేసింది. భారీ విజువల్ ట్రీట్ అందిస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలిందని కనిపిస్తోంది.
టీజర్ విడుదలైన తర్వాత విపరీతమై ట్రోల్స్ కు గురైంది. టీజర్ పూర్తిగా కిడ్స్ కర్టూన్ లాగే ఉందంటూ, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ ఎక్కడా రియాలిటీ దగ్గరగా లేదంటూ, రజినీకాంత్ ‘కొచ్చాడియన్’లాగా ఉదంటూ విపరీతంగా ట్రోల్ వచ్చాయి. ఈ సినిమా కూడా పూర్తిగా నిరాశ పరిచేలా ఉందని భావిస్తున్నారు.
మరోవైపు చిత్రంలోని రావణుడు, హనుమంతుడి పాత్రల తీరుతెన్నులోనూ చాలా భిన్నంగా ఉన్నాయని, వాస్తవ రామయణానికి దగ్గరగా లేదంటూ విమర్శులు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ట్రోల్స్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై దర్శకుడు ఓం రౌత్ స్పందించారు. ట్రోల్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘ఆదిపురుష్ టీజర్ పై జరుగుతున్న ట్రోలింగ్ తో కాస్తా ధైర్యం కోల్పోయాను. కానీ ట్రోలింగ్ విషయంలో పెద్దగా ఆశ్చర్యానికి గురి కావాల్సిందేమీ లేదు. ‘ఆదిపురుష్’ సినిమాను వెండితెర కోసం నిర్మించాం. బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ గా ఉంటుంది. వీఎఫ్ఎక్స్, సీన్స్ అద్భుతంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో ఉండేవాళ్లను కూడా థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతోనే తెరకెక్కించాం’ అంటూ వ్యాఖ్యానించారు.
అలాగే... ఆదిపురుష్ రామాయణానికి సంబంధించిన కథ ఆధారంగా తెరకెక్కించామన్నారు. నెక్ట్స్ జనరేషన్ ను కూడా ఆదరించేలా మూవీని తీస్తున్నామని చెప్పుకొచ్చారు. త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. సినిమాను కచ్చితంగా ప్రకటించే తేదీకే విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.
రాముడి పాత్రలో ప్రభాస్, జానకీ పాత్రలో క్రితి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలరించనున్నారు. సన్నీ సింగ్, దేవదత్త నాగే, వట్సాల్ శేత్, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ బ్యానర్లపై నిర్మాతలు భూషణ్ కుమార్, క్రుషన్ కుమార్, ఓ రౌత్ రూ.500 కోట్ల వరకు వెచ్చించి తెరకెక్కించారు. 2023 జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.