MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూజా హెగ్డేతో ప‌వ‌న్ సినిమాకి సమస్య? అందుకే దసరాకు స్టార్ట్ కావటం లేదా?

పూజా హెగ్డేతో ప‌వ‌న్ సినిమాకి సమస్య? అందుకే దసరాకు స్టార్ట్ కావటం లేదా?

 ప‌వ‌న్ క‌ల్యాణ్ - హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనలైజ్ చేసారు.  

4 Min read
Surya Prakash | Asianet News
Published : Oct 13 2021, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115


 వివరాల్లోకి వెళితే.. హరీష్ డైరక్ట్ చేసిన డీజే, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాల్లో పూజానే హీరోయిన్‌. ఈ రెండు సినిమాలూ హిట్ట‌య్యాయి. ఆ సెంటిమెంట్ తోనే ఈ సినిమాలోనూ పూజాకి పవన్ ప్రక్కన సినిమాలో చోటిచ్చాడు. ప‌వ‌న్ - పూజాల కాంబో సెట్ట‌వ్వ‌డం ఇదే తొలిసారి. కాబ‌ట్టి కాంబినేష‌న్ ప‌రంగానూ ఈ సినిమాకి క్రేజ్‌వ‌స్తుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు

215


అయితే ప్రస్తుతం పూజా డేట్లు ప్ర‌స్తుతం అందుబాటులో లేవని..ఆమె  కాల్షీట్లు ఖ‌రారైతే గానీ, షూటింగ్ షెడ్యూల్స్ విష‌యంలో ఓ క్లారిటీ లేదని చెప్తున్నారు. `ఈ సినిమాలో నేను న‌టిస్తాను కానీ, డేట్లు ఎడ్జెస్ట్ చేసుకోవాలి` అని పూజా ముందుగానే చెప్పింద‌ట‌.

315


 ఇప్పుడు పూజా డేట్లు ఇస్తే గానీ, ప‌వ‌న్ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి అని మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. నిజానికి ద‌స‌రాకి ఈ సినిమాని లాంఛ‌నంగా ప్రారంభించాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్ర‌య‌త్నం వాయిదా ప‌డింది. పూజా డేట్లు ఎప్పుడో తెలిస్తే.. అప్పుడే ఈ సినిమాని మొద‌లెడ‌తారని చెప్పుకుంటున్నారు. అందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

415


 అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే కాంబలో త్వరలో ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ సినిమా రాబోతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఈ కార్యక్రమంలో కొంతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన హరీష్ శంకర్ ఈ సినిమా గురించి మాట్లాడటంతో పాటు తన నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.

515


హరీష్ శంకర్ పూజా హెగ్డే గురించి మాట్లాడుతూ.. పూజా హెగ్డే ఇప్పుడు చాలా బిజీ అయింది అని, ఆమె డేట్ల కోసం కాదు ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్నారు. మన అందరికి లాక్డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు. 

615


ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందేమో అని వ్యాఖ్యానించారు. ఈ ఈవెంట్‌కు కూడా పూజా హెగ్డే వస్తుందా? లేదా? అని అనుమానం వచ్చింది. ఈ రెండు మూడు గంటలు కూడా ఏదైనా సినిమాకు ఇచ్చిందా? అని అనుకున్నాను అంటూ సరదాగా మాట్లాడారు. 

715


అంతే కాక పూజా ఇప్పుడు స్టార్ హీరోలందరితో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో కూడా నటింస్తుంది అని మాటల్లో చెప్పేసాడు. ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డేను ఫిక్స్ చేసినట్టు సమాచారం ఇచ్చేసారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హరీష్ శంకర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ” భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఇలా ఈవెంట్ స్పీచ్ లో పూజా హెగ్డే పవన్ కళ్యాణ్ తో నటిస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పేసాడు హరీష్.

815


పూజా హెగ్డే అమ్మా,నాన్నా కర్ణాటకలోని ఉడుపికి చెందినవారు. ముంబైలోని ఎమ్.ఎమ్.కె. కాలేజ్ లో చదువుతున్న రోజుల్లోనే పలు భాషల్లో పట్టు సాధించడమే కాదు, ఫ్యాషన్ షోస్ లో పాల్గొని అలరించింది. అలా అలా పూజా హెగ్డే పేరు గ్లామర్ మార్కెట్ లో మారు మోగింది. తమిళ దర్శకుడు మిస్కిన్ తన ‘ముగమూడి’ చిత్రంలో హీరోయిన్ గా ఎంచుకున్నారు. జీవా హీరోగా రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి తెరపై తళుక్కుమంది పూజా హెగ్డే.

915

 తరువాత నాగచైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’తో తెలుగునాట అడుగుపెట్టింది. ఆపై ‘ముకుంద’ చిత్రంలోనూ నటించింది. ఈ మూడు చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. హిందీలో ఆమె తొలి చిత్రం హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మొహెంజో దారో’. అదికూడా అలరించలేదు. దాంతో పూజా హెగ్డే పాదంపై చిత్రసీమలో పలు అనుమానాలు రేకెత్తాయి.

1015

టాలీవుడ్ టాప్ హీరోయిన్ హోదా దక్కించుకున్న పూజా హెగ్డే, అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూజా చేతిలో ఉన్నన్ని బడా ఆఫర్స్ మరో హీరోయిన్ ఎవరికీ లేవు. ఒకప్పుడు సరైన హిట్ లేక సతమతమైన పూజాకు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడం నిజంగా ఆమె లక్ అని చెప్పాలి. 
 
 

1115


బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన ‘సాక్ష్యం’లో మెరిసింది. మళ్ళీ మామూలే అన్నట్టుగా సాగింది పూజా చిత్ర ప్రయాణం. జూనియర్ యన్టీఆర్ తో ‘అరవింద సమేత’లో అరవిందగా ఆకట్టుకుంది. ‘మహర్షి’లో మహేశ్ బాబు సరసన మురిపించింది. ‘గద్దలకొండ గణేశ్’లో మరో శ్రీదేవి అనిపించింది. 

 

1215


ఇక అల్లు అర్జున్ తో రెండో సారి నటించిన ‘అల వైకుంఠపురములో…’తో బంపర్ హిట్ ను తన బ్యాగ్ లో వేసుకుంది. అప్పటి దాకా పూజా హెగ్డే చిత్ర ప్రయాణం ఓ తీరున సాగితే, ‘అల…వైకుంఠపురములో’ తరువాత మరో తీరున సాగింది అని చెప్పాలి. ఆచిత్రం తరువాత పూజా నటించిన ఏ సినిమా కూడా జనం ముందుకు రాలేదు.

 

 

1315


 దసరా పండగకు అక్టోబర్ 15న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో జనం ముందుకు రానుంది. ఇక ‘ఆచార్య’లో రామ్ చరణ్ జోడీగా నటించింది. వచ్చే యేడాది ఈ సినిమా వెలుగు చూడనుంది. ప్రభాస్‌ ‘రాధే శ్యామ్’లోనూ పూజా అందం కనువిందు చేయనుంది. ఇది కూడా రాబోయే సంక్రాంతి కానుకగా రానుంది. 
 

1415

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు. చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. 

1515


తమిళ స్టార్ హీరో విజయ్ సరసన ‘బీస్ట్’లో నటిస్తోంది. రణవీర్ సింగ్ తో జోడీ కట్టి ‘సర్కస్’ చూపించనుంది. వీటిలో ఏది బంపర్ హిట్ అయినా, మళ్ళీ పూజా హెగ్డే కాల్ షీట్స్ కాస్ట్లీగా మారిపోతాయి. ఇప్పటి దాకా అందంతోనే శ్రీగంధాలు పూసిన పూజా హెగ్డే భవిష్యత్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ లోనూ మురిపిస్తోందేమో చూడాలి.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి
Recommended image2
Karthika Deepam 2 Latest Episode: జ్యో అరెస్ట్- ఉలుకుపలుకు లేకుండా పడిపోయిన సుమిత్ర-నోరు జారిన పారు
Recommended image3
Mowgli Movie Review: మోగ్లీ మూవీ రివ్యూ, రేటింగ్‌.. సుమ కనకాల కొడుక్కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved