MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రామ్ చరణ్ లో బెస్ట్ క్వాలిటీ పై.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. చరణ్ అస్సలు పట్టించుకోనివి ఇవే..

రామ్ చరణ్ లో బెస్ట్ క్వాలిటీ పై.. స్టార్ డైరెక్టర్ సంచలన కామెంట్స్.. చరణ్ అస్సలు పట్టించుకోనివి ఇవే..

మెగా పవన్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఏదో ఒక సందర్భంలో.. ఎవరో ఒకరు కొత్త విషయాలు చెపుతూనే ఉన్నారు. రామ్ చరణ్ గురించి స్టార్ డైరెక్టర్ చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 29 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాన్ ఇండియా హీరోగా మెగా పవన్ స్టార్..
Image Credit : instagram

పాన్ ఇండియా హీరోగా మెగా పవన్ స్టార్..

చిరంజీవి వారసత్వం తీసుకున్నా.. సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ కు వెళ్లిన చరణ్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడు. డైరెక్టర్ల హీరోగా చరణ్ కు పేరుంది. నటన, యాటిట్యూడ్, గ్లామర్, అన్ని విషయాల్లో అభిమానులను ఇంప్రెస్ చేస్తూ.. ఆడియన్స్ ను ఆశ్చర్చపరుస్తున్నాడు రామ్ చరణ్. సక్సెస్, ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకోవడం చరణ్ కు అలవాటు. ఏ విషయంలో కూడా టెన్షన్ పడడు మెగా పవన్ స్టార్. ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ గురించి ఓ స్టార్ డైరెక్టర్ షాకింగ్ విషయాలు వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రామ్ చరణ్ పై వినాయక్ కామెంట్స్..
Image Credit : Asianet News

రామ్ చరణ్ పై వినాయక్ కామెంట్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ పై సీనియర్ డైరెక్టర్ వినాయక్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వినాయక్ మాట్లాడుతూ..'' రామ్ చరణ్ చాలా క్లాస్.. రాయల్ గా ఉంటాడు. డైరెక్టర్ల హీరో.. ఒక్క సారి కథ ఒప్పుకుంటే.. అందులో మార్పు ఉండదు.. ఆ ద్శకుడితో సినిమా చేయాల్సిందే. ఒక్కోసారి కథ ఒకే చేసిన తరువాత లెక్కలు మారిపోతుంటాయి. దర్శకుడికి ఫెయిల్యూర్ కూడా రావచ్చు.. అప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ చేసే హీరోలు చాలామంది ఉంటారు. కానీ చరణ్ అలా కాదు'' అని వినాయక్ అన్నారు.

35
సక్సెస్ గురించి పెద్దగా ఆలోచించడు..
Image Credit : Asianet News

సక్సెస్ గురించి పెద్దగా ఆలోచించడు..

చరణ్ గురించి వినాయక్ మాట్లాడుతూ.. ''ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలని ఒప్పకుంటే.. ఆయన ముందు సినిమా ప్లాప్ అయ్యింది.. అది ఇది అని ఆలోచించడు. హిట్లు ప్లాప్ అస్సలు పట్టించుకోడు. గ్రేట్ క్వాలిటీ అతనిది.. ఎవరో హిట్ కొట్టారు కదా.. వారితో సినిమా చేద్దాం.. అనే ఆలోచనే చరణ్ కు ఉండదు. అసలు తన సినిమా హిట్ అయినా పెద్దగా పట్టించుకోడు.. ఎందుకో. సినిమా హిట్ అయ్యింది కదా.. అని కంగ్రాట్స్ చెపితే.. అవును కదా.. అని చిరునవ్వు నవ్వుతాడు.. ఓ హడావిడి చేయడం చరణ్ కు ఇష్టం ఉండదు. సింపుల్ గా ఉండటం రామ్ చరణ్ కు ఇష్టం. హిట్లు ప్లాప్ లను అస్సలు పట్టించుకోడు'' అని వినాయక్ అన్నారు.

45
రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పు..
Image Credit : Instagram/peddimovie

రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పు..

మొదటి నుంచి రామ్ చరణ్ గురించి చాలామందికి తెలియదు. హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. హిట్ అవుతున్నాయి.. చిరంజీవి వారసుడు అని తెలుసు, కానీ.. రామ్ చరణ్ తనంతట తానుగా తన టాలెంట్ చూపించుకున్న సినిమా రంగస్థలం.. ఈసినిమా నుంచి చరణ్ లో పరిణితి చెందిన నటుడిని చూశారు జనాలు. 

చరణ్ ఆటీట్యూడ్ లో మార్పు గమనించారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడటం, సామాన్యులను, సెలబ్రిటీలను.. ఎవరైనా సరే అదే గౌవరం చూపించడం.. ఎంత ఫ్యాషన్ ఫాలో అయినా.. ఆధ్యాత్మికంగా కూడా చరణ్ పాటిస్తున్న నియమాలు.. మెగా పవర్ స్టార్ పై ఇష్టాన్ని గౌరవాన్ని మరింతగా పెంచాయి.

55
రామ్ చరణ్ సినిమాలు..
Image Credit : Asianet News

రామ్ చరణ్ సినిమాలు..

ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా రెండు సినిమాలతో ప్లాప్ ను ఫేస్ చేశాడు రామ్ చరణ్ ఆచార్యతో పాటు.. గేమ్ ఛేంజర్ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈసారి సాలిడ్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు మెగా పవర్ స్టార్. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈసినిమాలో రామ్ చరణ్ మునుపెన్నడు చూడని అవతారంలో కనిపించబోతున్నాడు.

 రీసెంట్ గా చరణ్ బర్త్ డే సందర్భంగారిలీజ్ అయిన చిన్న టీజర్.. అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కుస్తీ వీరుడిగా చరణ్ ను చూసిన అభిమానులు షాక్ అయ్యారు. చరణ్ టోన్డ్ బాడీకి అంతా ఫిదా అయ్యారు. ఈసినిమా తరువాత సుకుమార్ తో మరోసారి సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈసారి రంగస్థలాన్ని మించిన సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image2
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Recommended image3
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Related Stories
Recommended image1
Doctor Chakravarthy Review : ఏఎన్నార్ చెల్లెలుగా సావిత్రి నటించిన ఏకైక చిత్రం, ఫస్ట్ నంది అవార్డ్ మూవీ..
Recommended image2
రామ్ చరణ్ హీరోగా 1000 కోట్లతో.. ధురంధర్ డైరెక్టర్ సినిమా? కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు, నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved