డైరెక్టర్ వివి వినాయక్ ఇలా అయిపోయారేంటి? ఆయన దుస్థితికి కారణం?
వివి వినాయక్ లేటెస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆయన కనీసం మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ పరిస్థితి దయనీయంగా ఉంది.

VV Vinayak
వివి వినాయక్ అనారోగ్యానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో బైట్ షేర్ చేశారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నేపథ్యంలో ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కృష్ణ గారితో అసిస్టెంట్ డైరెక్టర్ గా, కో డైరెక్టర్ గా నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయనతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంటే ఆనందం వేస్తుంది. కృష్ణ గారు ఫర్ ఎవర్. హ్యాపీ బర్త్ డే సర్.. అని సదరు వీడియోలు వివి వినాయక్ కామెంట్ చేశారు.
VV Vinayak
అయితే ఆ వీడియో గమనిస్తే వివి వినాయక్ చాలా వీక్ గా ఉన్నారు. ఆయన గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. వివి వినాయక్ ఆరోగ్యం కుదుటపడలేదని అర్థం అవుతుంది. కాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఇలా అయిపోవడం ఊహించని పరిణామం. వివి వినాయక్ వరుస హిట్స్ తో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగారు.వివి వినాయక్, రాజమౌళి నువ్వా నేనా అని పోటీ పడేవారు.
వివి వినాయక్ మొదటి సినిమా ఆది. ఎన్టీఆర్ హీరోగా విడుదలైన ఆది బ్లాక్ బస్టర్. డెబ్యూ మూవీతోనే భారీ హిట్ కొట్టాడు. రెండో చిత్రం చెన్నకేశవరెడ్డి. బాలయ్య హీరోగా తెరకెక్కిన ఫ్యాక్షన్ డ్రామా చెన్నకేశవరెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. మూడో చిత్రం దిల్ తో సూపర్ హిట్ కొట్టాడు. దిల్ చిత్ర నిర్మాతగా ఉన్న రాజు కాస్త... దిల్ రాజు అయ్యారు. నాలుగో చిత్రం ఠాగూర్ ఇండస్ట్రీ హిట్. దాంతో వివి వినాయక్ అగ్ర స్థానం లోకి వెళ్ళాడు.
తర్వాత చేసి సాంబ యావరేజ్, బన్నీ సూపర్ హిట్, లక్ష్మి హిట్, యోగి యావరేజ్, కృష్ణ సూపర్ హిట్, అదుర్స్ సూపర్ హిట్, బద్రీనాథ్ ప్లాప్, నాయక్ యావరేజ్, అల్లుడు శ్రీను హిట్, అఖిల్ డిజాస్టర్. ఈ చిత్రం తర్వాతే వివి వినాయక్ ఫేమ్ మసకబారుతూ వచ్చింది. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150తో మరలా భారీ హిట్ కొట్టాడు. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ డిజాస్టర్ అయ్యింది .
VV Vinayak
ఈ క్రమంలో హీరోగా ప్రయత్నం చేశాడు. దిల్ రాజు నిర్మాతగా సీనయ్య టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి, ఆపేశారు. ఇక ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి అబాసుపాలయ్యాడు వివి వినాయక్. చేతిలో ఆఫర్స్ లేని వివి వినాయక్ డిప్రెషన్ కి గురయ్యాడేమో అనిపిస్తుంది. ఇప్పటి స్టార్స్ ఎవరూ ఆయనతో సినిమా చేసే మూడ్ లో లేరు. కారణం ఏదైనా వివి వినాయక్ చాలా వీక్ గా కనిపించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.