MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మెగాస్టార్ 'విశ్వంభ‌ర' కు వివి.వినాయ‌క్ సాయం, ఆ పార్ట్ మొత్తానికి ఆయనే డైరెక్టర్‌?

మెగాస్టార్ 'విశ్వంభ‌ర' కు వివి.వినాయ‌క్ సాయం, ఆ పార్ట్ మొత్తానికి ఆయనే డైరెక్టర్‌?

 వివి వినాయిక్ మీద ఉన్న నమ్మకంతో విశ్వంభర ప్రాజెక్టుకు సాయిం చేయమని అడిగినట్లు తెలుస్తోంది. 

3 Min read
Author : Surya Prakash
Published : Oct 16 2024, 08:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

 యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర.. భారీ ఎక్సపెక్టేషన్స్ తో  అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. రీసెంట్ గా వదిలిన విశ్వంభర టీజర్ వైరల్  అయ్యింది.

మెల్లిమెల్లిగా ఈ సినిమా పై  హైఫ్ ను క్రియేట్ అవుతోంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి రావాల్సింది కానీ గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం త్యాగం చేసి  రేస్ నుంచి తప్పుకుంది.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

అందుతున్న సమాచారం మేరకు..  తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు.  మే తొమ్మిదిన సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మే 9కి ఓ ప్రత్యేకత ఉంది. చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ విడుదలైంది

ఆరోజే. భారీ వర్షాలు, వరదల్లో కూడా చిరు సినిమా సూపర్ హిట్ కొట్టింది.. ఇక ఈ మూవీకి జగదేక వీరుడు అతిలోక సుందరి కథకూ ఎక్కడో కనెక్షన్ ఉందని, అందుకే వైజయంతీ మూవీస్ ఇలాంటి ప్రకటన విడుదల చేసిందని టాక్  వినిపిస్తోంది. అది ప్రక్కన పెడితే ఈ చిత్రం టీజర్  విఎఫ్ ఎక్స్ పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో దర్శకుడు వివి వినాయిక్ ని సీన్ లోకి తెచ్చినట్లు వినిపిస్తోంది.

36
VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

VV Vinayak, Vassishta, Vishwambhara, chiranjeevi

 దాదాపు 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్‌ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్‌’ (2003) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పట్నుంచీ చిరంజీవి–వినాయక్‌ మధ్య మంచి అనుబంధం ఉంది.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఖైదీ నెంబర్ 150 చిత్రాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సినీ అవకాశాలు లేని, స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందిన వీవీ వినాయక్‌కు చిరు తన సినిమాతో కమ్ బ్యాక్ హిట్ ఇస్తారని చాలా కాలంగా వినిపిస్తోంది. ఈ మేరకు కథ వినిపించారని కూడా తెలిసింది. అయితే చిరంజీవి భోళా శంకర్ దెబ్బతో చాలా జాగ్రత్తగా కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. 

46
Vishwambhara Teaser

Vishwambhara Teaser


అయితే వివి వినాయక్ మీద ఉన్న నమ్మకంతో విశ్వంభర ప్రాజెక్టుకు సాయం చేయమని అడిగినట్లు తెలుస్తోంది. దర్శకుడు వశిష్టకు కూడా వివి వినాయిక్ తో సమస్య లేదు. ఎందుకంటే వివి వినాయక్ ని ఆయన మెంటర్ గా, గురువుగా భావిస్తారు.

వివి  వినాయక్ దగ్గర అఫీషియల్ గా వశిష్ట  పని చేయకపోయినా తన తండ్రి మల్లిడి సత్యనారాయణ రెడ్డి నిర్మాణంలో వినాయక్ దర్శకత్వంలో వచ్చిన బన్ని సినిమా అప్పటి నుంచి బాగా చనువు ఉంది. ఈ క్రమంలో పోస్ట్  ప్రొడక్షన్ లో ముఖ్యంగా VFX ఇష్యూలు సెట్ చేయటానికి వశిష్టకు సాయం చేయమని వినాయక్ ని చిరంజీవి అడిగినట్లు వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టు సెట్ అవ్వటానికి కూడా వివి వినాయిక్ సలహా తీసుకున్నారని తెలుస్తోంది. 

56
Vishwambhara Teaser

Vishwambhara Teaser

ఇలా వివి వినాయక్...చిరంజీవి  ప్రాజెక్టుకు  సాయం చేయటం మొదటి సారి కాదు. గతంలో స్టాలిన్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు దర్శకుడు మురగదాస్ అందుబాటులో లేనప్పుడు కొన్ని  సీన్స్ వినాయక్ షూట్ చేసారు. ముఖ్యంగా స్టాలిన్ క్లైమాక్స్ సీన్ వినాయక్ తీసారు. అలాగే అల్లు అర్జున్ చిత్రం బద్రీనాథ్ కు గ్రాఫిక్స్ విషయంలో అనుభవం ఉంది. వినాయక్ టెక్నికల్ గా ఛాలెంజ్ లు తీసుకునే వ్యక్తి అని కాబట్టి విశ్వంభరకు ఖచ్చితంగా ఉపయోగపడతారని భావిస్తున్నారట.
 

66


ఈ విశ్వంభర సినిమాతో భారీ హిట్ కొట్టాలని  మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు.   ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి అయ్యిందని కేవలం ఒక పాట మాత్రమే ఉంది అని డైరెక్టర్ ఇటీవల చెప్పారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇక టీజర్ లో చిరంజీవి లుక్ బాగా నచ్చింది.. చిరు లుక్ ఓకే గానీ కొన్ని యాక్షన్స్ సీన్స్ లలో విఎఫ్ ఎక్స్ బాగా లేదని, చీప్ గా ఉందని టీజర్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే.. ఫ్యాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు.

`ఓజీ` గూస్‌బంమ్స్ అప్‌ డేట్‌, పవన్‌ స్పీడ్‌ మామూలుగా లేదుగా.. ఫస్ట్ వచ్చేది ఏ సినిమా అంటే?

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved