MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాయమాటలు చెప్పి హీరోయిన్స్ జీవితాలు నాశనం చేసిన త్రివిక్రమ్... తెలుగు అమ్మాయితో పాటు ఎందరు ఉన్నారంటే?

మాయమాటలు చెప్పి హీరోయిన్స్ జీవితాలు నాశనం చేసిన త్రివిక్రమ్... తెలుగు అమ్మాయితో పాటు ఎందరు ఉన్నారంటే?

దర్శకుడు త్రివిక్రమ్ ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైగా హీరోయిన్స్ జీవితాలతో ఆడుకున్నాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. వాళ్లలో ఓ తెలుగు హీరోయిన్ కూడా ఉంది ఆయన చేసిన మోసాలు ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : May 19 2024, 07:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Trivikram Srinivas

Trivikram Srinivas

త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. ప్రత్యేకమైన శైలి కలిగిన దర్శకుడు. ఫ్యామిలీ ఎమోషన్స్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి బ్లాక్ బస్టర్స్ ఇస్తారు. కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసే త్రివిక్రమ్ కి మాటల మాంత్రికుడు అనే పేరుంది. అద్భుతమైన కామెడీ పంచ్లతో పాటు మనసుకు హత్తుకునే, నిజమే కదా అనిపించే డైలాగ్స్ రాస్తారు. 
 

27

ఇంత మంచి డైరెక్టర్ కి మాత్రం ఓ చెడ్డ అలవాటు ఉంది. ఆయన ప్రతి సినిమాలో దాదాపు సెకండ్ హీరోయిన్ ఉంటుంది. కానీ ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కొన్ని సినిమాల్లో అయితే అసలు సెకండ్ హీరోయిన్ ని పెట్టాల్సిన అవసరం ఏముందనే భావన కలుగుతుంది. 
 

37

జల్సా  మూవీలో ఇలియానా మెయిన్ హీరోయిన్ కాగా, పార్వతి మెల్టన్ మరొక హీరోయిన్. జల్సా చిత్రంలో పార్వతి మెల్టన్ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. అత్తారింటికి దారేది చిత్రంలో కూడా సేమ్ సీన్ రిపీట్. సమంత మెయిన్ హీరోయిన్ కాగా, ప్రణీత సుభాష్ సెకండ్ హీరొయిన్ గా చేసింది. ఆమెను ఒక పాటకు కొన్ని సన్నివేశాలకు పరిమితం చేశారు. 

47

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆదా శర్మ పాత్ర అయితే చాలా దారుణం. పేరుకే సెకండ్ హీరోయిన్. కనీసం ఒక పాట కూడా ఉండదు. చిన్న వ్యాంప్ రోల్ వలె ఉంటుంది. అందులోనూ నెగిటివ్ షేడ్స్. నితిన్ హీరోగా తెరకెక్కిన అ ఆ మూవీలో అనుపమ పరమేశ్వరన్ పాత్రకు కూడా పెద్దగా స్క్రీన్ స్పేస్ ఉండదు. 

57
Eesha Rebba

Eesha Rebba


అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో ఈషా రెబ్బాను ఎందుకు తీసుకున్నాడో త్రివిక్రమ్ కే తెలియాలి. అసలు ఈషా రెబ్బా పాత్ర లేకపోయినా ఫరక్ ఏమీ పడదు. కనీసం నాలుగు డైలాగ్స్ కూడా ఆ పాత్రకు ఉండవు. 
 

67

అల వైకుంఠపురంలో చిత్రంలో నివేద  రోల్ సైతం ఎలాంటి ప్రాధాన్యత లేకుండా సాగుతుంది. లేటెస్ట్ మూవీ గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి ఏదో ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రమే. కథలో మీనాక్షి పాత్రకు వెయిట్ లేదు. 
 

77

ఈ సెకండ్ హీరోయిన్స్ అందరినీ త్రివిక్రమ్ మోసం చేసినట్లే లెక్క. కారణం... స్క్రిప్ట్ చెప్పేటప్పుడు త్రివిక్రమ్ వారి పాత్రలకు స్క్రీన్ స్పేస్, ప్రాధాన్యత ఉంటుందని చెబుతాడు. తీరా సినిమా విడుదలయ్యాక ఏమీ ఉండదు. ఇటీవల ఇదే విషయం ఈషా రెబ్బా ప్రస్తావించారు. అరవింద సమేత కోసం నేను బైక్ కూడా నేర్చుకున్నాను. కానీ సినిమాలో నా సన్నివేశాలు ఎడిట్ చేసి లేపేశారని ఆమె వేదన చెందారు. ఇకపై త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అంటే యంగ్ బ్యూటీస్ ఆలోచించాల్సి ఉంది.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 27: నట్టింట్లో కుంపటి పెట్టిన భాగ్యం.. రామరాజుకు మొత్తం చెప్పేసింది
Recommended image2
Thaai Kizhavi Review: రాధిక అరాచకం... `తాయ్ కిళవి` రివ్యూ, సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved