హీరోయిన్ ను అడ్డుపెట్టుకుని అల్లు అర్జున్ పై సెటైర్లు వేసిన డైరెక్టర్, సంచలనంగా మారిన వ్యాఖ్యలు
ఇక అయిపోయింది అనుకున్న అల్లు అరజున్ మ్యాటర్ ను పుల్ల పెట్టి మరీ కదిలించాడు టాలీవుడ్ డైరెక్టర్. అంతా మార్చిపోతున్నారు అనుకున్న టైమ్ లో బన్నీపై సెటైర్లు వేస్తూ.. ఎగతాళి చేశాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు.
అల్లు అర్జున్ సంధయ థియేటర్ వివాధం ఎంత దూరం వెళ్ళిందో అందరికి తెలిసిందే. ఇక ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం కూడా భయంకరమైన ట్రోలింగ్ కు కారణం అయ్యింది. ఆతరువాత జరిగిన పరిణామాలు కూడా అందరికి తెలిసినవే. ఈవివాదం ఓ పదిరోజుల పాటు టాలీవుడ్ ను కుదిపేసింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఆతరువాత అల్లు అర్జున్ కుబెయిల్ రావడం, సినిమా వాళ్లు సీఎం ను కలవడం.. ఇలా చిన్నగా సర్ధుమణుగుతున్న టైమ్ లో ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ విషయంలో అల్లు అర్జున్ పై సెటైర్లువేసేవిధంగా సినిమా ఫంక్షన్ లో మాట్లాడారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి పేరును బన్నీ ఎలా మర్చిపోయాడో.. తనసినిమా ఫంక్షన్ లో కూడా హీరోయిన్ రీతువర్మ పేరు మర్చిపోయినట్టుగా నటిస్తూ.. ఐకాన్ స్టార్ ను అవమానించేలా ప్రవర్నించాడు.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు త్రినాథ్ రావు నక్కిన. అవును సినిమా చూపిస్త మావా, నేను లోకల్, ధమాకా లాంటి మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన ఈ దర్శఖుడు తాజాగా సందీప్ కిషన్ హీరోగా మజాకా సినిమాను తెరకెక్కించాడు. ఈసినిమాలో మన్మధుడు హీరోయిన్ అన్షుతో పాటు రీతు వర్మ ఇద్దరు నటించారు. అయితే ఈసినిమాకు సబంధించి తాజాగా ఓ ఈవెంట్ జరిగింది.
Trinadha Rao Nakkina
ఈ ఈవెంట్ లో దర్శకుడు మాట్లాడిన మాటలు అందరికి ఆశ్చర్యన్ని కలిగించాయి. హీరోయిన్ అన్షు పై కూడా త్రినాథ్ రావు నక్కిన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ఇష్యు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్ని సినిమాలు చేసిన స్టార్ డైరెక్టర్ అయ్యి ఉండి.. ఇలా చిల్లరగా మాట్లాడటం ఏంటీ అని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు, బన్నీని ఇమిటేట్ చేయడం లాంటివి చేయడంతో మరోసారి టాలీవుడ్ లో మరోవివాదం చెలరేగే అవకాశం కూడా కనిపిస్తోంది.
అల్లు అర్జున్ ఇష్యు చాలా సెన్సిబుల్. ఈ వివాదాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అల్లు అరవింద్. అటువంటిదాన్ని మళ్శీ కదిలించి విమర్శలు ఫేస్ చేస్తున్నాడు త్రినాథ్ రావు. ఇక ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందా అని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. బన్నీఫ్యాన్స్ నుంచి ఈదర్శకుడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరి చూడాలి ఈ విషయం ఎంత వరకూ వెళ్తుందో.