- Home
- Entertainment
- `బాహుబలి` సూపర్ అని ఒక్కడు అనలేదు.. నాకు ఈగో అందుకే సినిమా చూడలేదు.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్
`బాహుబలి` సూపర్ అని ఒక్కడు అనలేదు.. నాకు ఈగో అందుకే సినిమా చూడలేదు.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్
దర్శకుడు తేజ ఇటీవల వరుస ఫెయిల్యూర్‌లో ఉన్నారు. ఆయన `బాహుబలి` సినిమాని చూడలేదట. అంతేకాదు ఆ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు తేజ బోల్డ్ అండ్ డేరింగ్. ఏ విషయం అయినా బోల్డ్ గా మాట్లాడతాడు. నో ఫిల్టర్. మనుషుల గురించైనా, సినిమాల గురించైనా, ఇండస్ట్రీ గురించైనా ఆయన మనసులో ఏముందో అదే చెబుతాడు. అందుకే ఆయన ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది.
గతంలోనే చాలా వివాదాస్పద కామెంట్లు చేశారు. కానీ ఆయన్ని ఎవరూ టచ్ చేయరు. ఆయన గురించి తెలుసు కాబట్టి లైట్ తీసుకుంటారు. `చిత్రం` సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. `నువ్వు నేను`, `జయం`, `నిజం`, `జై`, `ధైర్యం`, `ఔనన్నా కాదన్న`, `లక్ష్మీ కళ్యాణం`, `నేనే రాజు నేనే మంత్రి` చిత్రాలతో ఆకట్టుకున్నాడు.
కానీ ఇటీవల ఆయన వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు `నేనే రాజు నేనే మంత్రి`కి సీక్వెల్ చేస్తున్నారు. రానాతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈ బోల్డ్, డేరింగ్ డైరెక్టర్ ఓ సంచలన వ్యాఖ్యలు చేశారు. `బాహుబలి` గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దుమారం రేపుతున్నాయి.
`శ్రీమంత్రుడు` పెద్ద హిట్ మూవీ. జనం దాన్ని ఆదరించారు, పెద్ద హిట్ చేశారు, కానీ క్రిటిక్స్ ఎప్పుడూ గొప్పగా చెప్పలేదన్నారు. అనంతరం `బాహుబలి` గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. `బాహుబలి` సూపర్ అని చెప్పినవాడు ఇండస్ట్రీలో ఒక్కడు కూడా కలవలేదన్నారు తేజ. ఏదో ఆడేసిందని, అదృష్టం అండీ, ఎందుకు చూస్తున్నారో తెలియడం లేదండి అంటున్నారు తప్ప, అందులో ఏదో స్పెషాలిటీ ఉందని, అందుకే ఆడిందని ఎవరూ గుర్తించడం లేదు.
ఈ సందర్భంగా తాను `బాహుబలి` సినిమా చూడలేదని చెప్పాడు తేజ. ఆ మూవీ ఎందుకు చూడాలని యాంకర్‌ని తిరిగి ప్రశ్నించాడు. ఒకటి ఆ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అవ్వడానికి చూడాలి, కాపీ కొట్టడానికి చూడాలి. నేను కాపీ కొట్టను, ఇన్‌స్పైర్ కాను, ఎందుకంటే నాకు ఈగో ఎక్కువ అందుకే చూడలేదు అని చెప్పాడు తేజ. అయితే ఎవరు ఏమన్నా, ఆ మూవీ చిన్నగా ఉన్న మన తెలుగు సినిమా స్థాయిని పెంచేసిందని, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందని, బోలెడు డబ్బులు తెచ్చిపెట్టిందని, అంతకంటే ఇంకేం కావాలి, కాబట్టి గొప్ప సినిమానే అన్నారు తేజ. చాలా రోజుల క్రితం ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు తేజ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు `కల్కి 2898ఏడీ` రిలీజ్ అయిన కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వేళ తేజ వ్యాఖ్యలు వైరల్ కావడం గమనార్హం.
రాజమౌళి దర్శకత్వం వహించిన `బాహుబలి2` చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా 1800కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది.