సురేష్ బాబు సెట్ కి వస్తే అభిరామ్ నటించను అన్నాడు... డైరెక్టర్ తేజ కామెంట్స్
డైరెక్టర్ తేజ మాటలు రామబాణాల్లా ఉంటాయి. ఆయనకు ముక్కుసూటి మనిషి అనే పేరుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన అహింస మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Teja
దగ్గుబాటి వారసుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యత దర్శకుడు తేజ తీసుకున్నారు. రానా తమ్ముడు అభిరామ్ మొదటి చిత్రం అహింస జూన్ 2న విడుదల అవుతుంది. చిత్ర దర్శకుడైన తేజ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
దగ్గుబాటి రామానాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం అభిరామ్ ని హీరోగా పరిచయం చేశాను. సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చే నటులకు పోలికలు ఎదురవుతాయి. ఇప్పటికే స్టార్స్ అయిన రానా, వెంకటేష్ లతో అభిరామ్ ని పోల్చకూడదు.
అభిరామ్ కి సినీ నేపథ్యం ఉంది. నా కంటే తనపైనే ఎక్కువ ఒత్తిడి ఉంది. ఒకరోజు సురేష్ బాబు సెట్స్ కి వచ్చారు. నాన్నా నువ్వు సెట్స్ లో ఉంటే నేను చేయను అని అభిరామ్ అన్నాడు. సురేష్ బాబు మానిటర్ వెనుక కూర్చున్నారు. సురేష్ బాబు సెట్స్ కి వస్తే వెంకటేష్, రానా కూడా టెన్షన్ ఫీల్ అవుతారు. ఆయన దృష్టి కోణం భిన్నంగా ఉంటుంది.
అహింస ఒక ఫిలాసఫీ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. అహింసను ఎలా వాడాలో చెప్పాము. ఈ చిత్రంలో ఏకంగా 14 ఫైట్ సీక్వెన్సులు ఉన్నాయి. వాటిలో 4 యాక్షన్ సన్నివేశాలకు నేనే ఫైట్ మాస్టర్ గా చేశాను. అహింస విజయం సాధించి డబ్బులు వస్తే మళ్ళీ చిత్రాలు చేస్తాను. రానా తో 'రాక్షస రాజు' అనే చిత్రం చేస్తాను. అలాగే మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తాను.
నేను ఫుట్ పాత్ నుండి ఇక్కడికి వచ్చాను. అందుకే ప్రతిభ ఉన్న వాళ్ళను ప్రోత్సహిస్తాను. పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లకు నేను మద్దతు ఇస్తాను. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాను.... అని తేజ చెప్పుకొచ్చారు.
ఇంకా మాట్లాడుతూ.... ప్రేక్షకులు చాలా తెలివైనవారు ట్రైలర్ చూసి సినిమాను జడ్జి చేస్తున్నారు. స్టార్ హీరో ఉంటే ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చేస్తారనేది నిజం కాదు. అలా అయితే స్టార్స్ నటించిన చిత్రాలన్నీ విజయం సాధించాలి. సినిమాలో ఎమోషన్ ఉంటే అది ట్రైలర్ లో కనిపిస్తుంది. ట్రైలర్ నచ్చితే హీరో ఎవరనేది పట్టించుకోకుండా సినిమా చూస్తున్నారని తేజా అన్నారు.