హీరోయిన్ కాకముందే సమంత అంత టెక్కు చూపించిందా..? ఆడిషన్ లో డైరెక్టర్ కి ఝలక్!
టాలీవుడ్ సీనియర్ దర్శకుల్లో ఒకరైన శివ నాగేశ్వరరావు సమంత కెరీర్ బిగినింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆమెను తనే లాంచ్ చేయాల్సిందని కొన్ని కారణాలతో కుదరలేదన్నారు.

Samantha
2010లో సమంత సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. అంతకు ముందే ఓ తమిళ చిత్రానికి ఆమె ఎంపికయ్యారు. ఆ చిత్ర విడుదల ఆలస్యం కాగా నాగ చైతన్యకు జంటగా నటించిన ఏమాయ చేశావే డెబ్యూ మూవీ అయ్యింది. దర్శకుడు గౌతమ్ మీనన్ వాసుదేవ్ తెరకెక్కించిన ఏమాయ చేశావే సూపర్ హిట్ కాగా... సమంత ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. వరుస హిట్స్ తో ఆమె స్టార్ గా స్థిరపడిపోయారు. పదేళ్ల కెరీర్లో సమంత వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం లేదు.
అయితే హీరోయిన్ కాకముందే సమంత టెక్కు చూపించినట్లు తెలుస్తుంది. దర్శకుడు శివనాగేశ్వరరావు ఆమె గురించి చెప్పిన కామెంట్స్ వింటే పరోక్షంగా మనకు అర్థం అవుతుంది. సమంతను శివనాగేశ్వరావు హీరోయిన్ గా పరిచయం చేయాల్సింది అట. ఏమాయ చేశావే మూవీ కంటే ఏడాది ముందే ఆమె ఓ చిత్రానికి ఆడిషన్ చేశారట.
దర్శకుడు శివ నాగేశ్వరరావు 'నిన్ను కలిశాక' చిత్ర హీరోయిన్ గా సమంతను ఆడిషన్ చేశారట. సమంత ఆడిషన్ ఇవ్వడానికి చెన్నై నుండి హైదరాబాద్ వచ్చారట. సమంత ఆడిషన్ బాగా ఇచ్చారట. దాంతో సమంతను తీసుకుందామని రెమ్యూనరేషన్ చర్చలు జరిపారట. సమంత పెద్ద మొత్తం అడిగారట. ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ మా బడ్జెట్ పరిధిలో లేదు. అందుకే సమంతను తీసుకోలేదని ఆయన అన్నారు.
ఆడిషన్ పూర్తి అయ్యాక సమంత వెంటనే చెన్నై వెళ్లిపోవాలని అన్నారట. ఇవాళ ఫ్లైట్ టికెట్స్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకరోజు ఉండి రేపు వెళ్ళండి టికెట్స్ రేట్లు తక్కువగా ఉన్నాయంటే ఆమె వినలేదట. చేసేది లేక అధిక ధర చెల్లించి ఆమెను విమానంలో చెన్నైకి పంపే ఏర్పాట్లు చేశారట.
Samantha
సమంత మంచి నటి బాగా ఆడిషన్ ఇచ్చింది. అయితే ఆమె అడిగిన రెమ్యూనరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. సమంత తన టాలెంట్ తో ఈ స్థాయికి ఎదిగిందని శివనాగేశ్వరరావు తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే కనీసం హీరోయిన్ కాకముందే సమంత కచ్చితంగా ఉండేదని, రెమ్యూనరేషన్ గట్టిగానే అడిగేవారని తెలుస్తుంది.
ఈ ఆడిషన్ సమంత చదువుకునే రోజుల్లో ఇచ్చింది. అప్పటికే ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అయితే సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం భారీ డిజాస్టర్. సమంతకు ఊహించని షాక్ ఇచ్చింది. శాకుంతలం సమంత ఇమేజ్ ని బాగా డామేజ్ చేసింది. మేకర్స్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలంటే భయపడేలా చేసింది.