MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఘనంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె రెండో పెళ్లి, అబ్బాయి ఎవరో తెలుసా.. హాజరైన హేమాహేమీలు

ఘనంగా డైరెక్టర్ శంకర్ కుమార్తె రెండో పెళ్లి, అబ్బాయి ఎవరో తెలుసా.. హాజరైన హేమాహేమీలు

శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వివాహ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి కోలీవుడ్, టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఐశ్వర్య శంకర్ కి ఇది రెండవ వివాహం.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 15 2024, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఇండియాలో దిగ్గజ దర్శకులలో శంకర్ ఒకరు. అద్భుతమైన సందేశానికి భారీతనం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాలు తీయడంలో శంకర్ తర్వాతే ఎవరైనా. డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో గేమ్ ఛేంజర్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా శంకర్ ఇంట్లో శుభకార్యం జరిగింది. శంకర్ కి ఇద్దరు కుమార్తెలు.. ఓ కుమారుడు సంతానం అనే సంగతి తెలిసిందే. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ వివాహ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. 

 

38

ఈ వివాహ వేడుకకి కోలీవుడ్, టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఐశ్వర్య శంకర్ కి ఇది రెండవ వివాహం. గతంలో ఆమె దామోదరన్ రోహిత్ అనే క్రికెటర్ ని వివాహం చేసుకుంది. 

48

అయితే దామోదరన్ 16 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఐశ్వర్య జీర్ణించుకోలేకపోయింది. దీనితో తన భర్తతో విభేదాలు తెలెత్తి 2021లో విడాకులు తీసుకుంది. 

58

తాజాగా ఐశ్వర్య శంకర్ రెండో వివాహం చేసుకున్న అబ్బాయి పేరు తరుణ్ కార్తికేయన్. శంకర్ దగ్గరే తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. కుర్రాడు బుద్దిమంతుడు అని తన కుమార్తెకి ఇచ్చి శంకర్ వివాహం చేశారా లేక.. ఐశ్వర్య, తరుణ్ మధ్య ప్రేమ ఏమైనా చిగురించిందా అనేది క్లారిటీ లేదు. 

68

ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకి కోలీవుడ్ నుంచి బడా సెలెబ్రిటీలు హాజరయ్యారు. స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ శంకర్ కుమర్తె వివాహానికి హాజరయ్యారు. 

78

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కూడా హాజరు కావడం విశేషం. అదే విధంగా డైరెక్టర్ మణిరత్నం, సుహాసిని దంపతులు కూడా హాజరై వధూవరులని ఆశీర్వదించారు. 

88

వీరితో పాటు సూర్య, కార్తీ, విక్రమ్, నయనతార విగ్నేష్ దంపతులు కూడా హాజరయ్యారు. అదే విధంగా మరికొందరు సెలెబ్రిటీలు కూడా హాజరై శంకర్ కుమార్తె పెళ్ళిలో సందడి చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
OTT: ఒకే ఓటీటీలో బాలయ్య, వెంకటేష్‌, నాగచైతన్య సినిమాలు.. జీ5లో ఇక వరసగా జాతరే
Recommended image3
Toxic day 4 Collections: 300 కోట్లకు చేరువలో టాక్సిక్.. నాలుగో రోజు యశ్ సినిమాకు గట్టి దెబ్బ.. ఎంత వసూలు చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved