MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కూతురు సినిమాల్లోకి వస్తానంటే డైరక్టర్ శంకర్ పెట్టిన షాకింగ్ కండీషన్

కూతురు సినిమాల్లోకి వస్తానంటే డైరక్టర్ శంకర్ పెట్టిన షాకింగ్ కండీషన్

డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటిగా బిజీ అవుతోంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆమె నటించిన 'ప్రేమిస్తావా' త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

1 Min read
Author : Surya Prakash
Published : Jan 31 2025, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Shankar, Aditii, premisthava

Shankar, Aditii, premisthava


 డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అదితి శంక‌ర్‌కు హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఆఫ‌ర్లు క్యూ క‌డుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం  పంజా ద‌ర్శ‌కుడు విష్ణువ‌ర్ధ‌న్‌తో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ చేసింది అదితి శంక‌ర్‌. ఈ వార‌మే ఈ మూవీ థియేట‌ర్ల‌లో రాబోతోంది.ఆకాష్ ముర‌ళి, అదితి శంక‌ర్ జంట‌గా న‌టించిన త‌మిళ మూవీ నేసిప్పాయ జ‌న‌వ‌రి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు విష్ణువ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  నేసిప్పాయ మూవీ తెలుగులో ప్రేమిస్తావా పేరుతో రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ ద్వారా ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతోంది.  ఈ నేపధ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది. 
  

23
Shankar, Aditii, premisthava

Shankar, Aditii, premisthava

 అదితి  మాట్లాడుతూ  ... మెడిసిన్ పూర్తిచేశాక సినిమాల్లోకి వస్తానంటూ తండ్రి శంకర్ ను అడిగానని అదితి చెప్పింది. దీనికి తండ్రి తనకో షరతు విధించారని, ఆ షరతుకు ఒప్పుకుని సినిమాలు చేస్తున్నానని పేర్కొంది. సినిమాల్లోకి తన ఎంట్రీపై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత ఓ నిర్ణీత గడువులోగా సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తికి అంకితం కావాలని తండ్రి చెప్పారని అదితి వివరించింది. సినిమాల్లో అవకాశాల కోసం తండ్రి పేరు ఉపయోగించుకోవడం తనకు ఇష్టంలేదని చెప్పింది. అందరిలాగే ఆడిషన్లకు వెళుతూ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. 

33
Shankar, Aditii, premisthava

Shankar, Aditii, premisthava


ప్రముఖ దర్శకుడి కూతురు కావడం తనకు సంతోషమేనని అయితే ఆయన పేరుతో అవకాశాలు పొందడం తనకు ఇష్టంలేదని అదితి చెప్పింది. నటనపై ఆసక్తితోనే తప్ప డబ్బు కోసం సినిమాల్లోకి రాలేదని స్పష్టం చేసింది. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. తండ్రి శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందంటూ అదితి తన మనసులో మాట బయటపెట్టింది. ప్ర‌స్తుతం తెలుగులో భైర‌వం మూవీ చేస్తోంది ఆదితి శంక‌ర్‌. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీలో నారా రోహిత్‌, మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved