MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • యానిమల్ తో వంగ బ్రదర్స్ కి లైఫ్ టైం సెటిల్మెంట్... అమెరికా ఉద్యోగం వదిలేసి రిస్క్ చేసినందుకు!

యానిమల్ తో వంగ బ్రదర్స్ కి లైఫ్ టైం సెటిల్మెంట్... అమెరికా ఉద్యోగం వదిలేసి రిస్క్ చేసినందుకు!

యానిమల్ తో సందీప్ రెడ్డి వంగకు లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యిందని సోషల్ మీడియా టాక్. ఆయన హీరో రెమ్యూనరేషన్ కి మూడింతలు ఆర్జించాడని సమాచారం.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 27 2023, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga


2023 అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది యానిమల్. భారీ హైప్ మధ్య డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మిక్స్డ్ రివ్యూస్ పడ్డాయి. ప్రేక్షకులు, క్రిటిక్స్ రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకరు పరమ చెత్త సినిమా అంటే మరొకరు అద్భుతం అన్నారు. A  సర్టిఫికెట్ పొందిన యానిమల్ లో వైలెన్స్, సెక్స్, ఫౌల్ లాంగ్వేజ్ మోతాదుకు మించి ఉంది. అలాగే యానిమల్ పురుషాధిక్యతను ప్రోత్సహించేదిగా ఉందన్న ఆరోపణలు వినిపించాయి. 
 

26

పార్లమెంట్ వేదికగా యానిమల్ మూవీ కంటెంట్ పై చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ యానిమల్ మూవీ సమాజానికి చేటు చేసేదిగా ఉందని వ్యతిరేకత వ్యక్తం చేశారు. నెగిటివ్ పబ్లిసిటీ కూడా యానిమల్ చిత్రానికి ప్లస్ అయ్యింది. దాదాపు రూ. 900 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రాబట్టింది. యానిమల్ మూవీ దర్శకుడిగా విమర్శలు ఎదుర్కొన్న సందీప్ రెడ్డి వంగ భారీగా లాభపడినట్లు ట్రేడ్ వర్గాల వాదన. 
 

36
Pranay Reddy Vanga

Pranay Reddy Vanga


సందీప్ రెడ్డి దర్శకుడితో పాటు నిర్మాణ భాగస్వామి కూడాను. టీ సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసి యానిమల్ నిర్మించారు. సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఆ బాధ్యతలు చూసుకున్నారు. యానిమల్ మూవీ కలెక్షన్స్ లో సందీప్ రెడ్డి వంగ వాటా రూ. 200 కోట్లు అని ప్రచారం జరిగింది. ఇంత మొత్తంలో వంగ బ్రదర్స్ ఆర్జించడం అంటే జాక్ పాట్ అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా రాని సంపాదన ఒక్క సినిమాతో వంగ బ్రదర్స్ రాబట్టారు. 
 

46


సందీప్ రెడ్డి వంగ డెబ్యూ మూవీ అర్జున్ రెడ్డి ని కూడా ఆయన స్వయంగా నిర్మించాడు. అమెరికాలో జాబ్ చేస్తున్న ప్రణయ్ రెడ్డిని ఇక్కడకు రప్పించి నిర్మాతను చేశాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సక్సెస్ తో వచ్చిన డబ్బులు యానిమల్ మూవీలో పెట్టుబడి పెట్టి లాభ పడ్డారు. యానిమల్ మూవీ బడ్జెట్ రూ. 200 కోట్లని సమాచారం. 

56


ట్విస్ట్ ఏమిటంటే.. ఈ చిత్ర హీరో రన్బీర్ కపూర్ రెమ్యునరేషన్ రూ. 70 కోట్లు అని తెలుస్తుంది. అంతకు మూడు రెట్లు సందీప్ రెడ్డి ఆర్జించారు. ఒక స్టార్ హీరో రెమ్యూనరేషన్ కంటే దర్శకుడు అధికంగా పొందడం అరుదుగా జరిగే అంశం. యానిమల్ కి సందీప్ రెడ్డి వంగ దర్శక నిర్మాత కావడంతో ఈ ఫీట్ సాధ్యమైంది. 

66

ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ కి జంటగా రష్మిక మందాన నటించింది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక రోల్స్ చేశారు. మూడున్నర గంటల నిడివి కలిగిన యానిమల్ ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం విశేషం. యానిమల్ కి సీక్వెల్ గా యానిమల్ పార్క్ సందీప్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే!
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా

Latest Videos
Recommended Stories
Recommended image1
రామ్ చరణ్ కి టీనేజ్ లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? మెగా మదర్ సురేఖ వెల్లడించిన టాప్ సీక్రెట్ ..?
Recommended image2
OTT Movies: ఒకే రోజు ఓటీటీలోకి 46 సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు.. తెలుగు మూవీస్‌ ఇవే
Recommended image3
KH vs RK: కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ స్వాగ్‌కి పూనకాలే.. కోలీవుడ్‌లో ఫస్ట్ 1000 కోట్ల మూవీ లోడింగ్‌, ఇంతకి హీరో ఎవరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved