- Home
- Entertainment
- రాజశేఖర్, జీవిత నాకు వెన్నుపోటు పొడిచారు, వాళ్లు ఎప్పటికీ సక్సెస్ కాలేరు.. స్టార్ డైరెక్టర్ బోల్డ్ స్టేట్‌మెంట్
రాజశేఖర్, జీవిత నాకు వెన్నుపోటు పొడిచారు, వాళ్లు ఎప్పటికీ సక్సెస్ కాలేరు.. స్టార్ డైరెక్టర్ బోల్డ్ స్టేట్‌మెంట్
రాజశేఖర్ హీరోగా వచ్చిన `ఎవడైతే నాకేంటి` మూవీ మంచి విజయం సాధించింది. అయితే ఈ మూవీ విషయంలో రాజశేఖర్, జీవిత తనపై కుట్ర చేశారని చెబుతున్నారు దర్శకుడు సముద్ర.

చిరంజీవి, బాలయ్యకి పోటీ ఇచ్చిన రాజశేఖర్
రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తో ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేశారు. స్టార్ హీరోగా రాణించారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ వంటి స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేశారు. చిరంజీవి సినిమాలు, బాలయ్య సినిమాలతో రాజశేఖర్ సినిమాలు పోటీ పడ్డాయి. కొన్నిసార్లు రాజశేఖర్ గెలిచారు. మాస్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాజశేఖర్ కొన్ని పొరపాట్లు, కొన్ని రాంగ్ స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుని డౌన్ అయ్యారు. ఆయన సినిమాలు ఆడకపోవడంతో ఇప్పుడు హీరగా డౌన్‌లో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఖాళీగానే ఉన్నారు.
దర్శకుడికి రాజశేఖర్ అన్యాయం
ప్రస్తుతం రాజశేఖర్ కెరీర్ పరంగా దైలామాలో ఉన్నారు. హీరోగా కొనసాగాలా? క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకోవాలా? అనే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ గురించి దర్శకుడు వీ సముద్ర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు చేసిన అన్యాయాన్ని బయటపెట్టారు. తనకు ఓ సినిమా విషయంలో వెన్నుపోటు పొడిచిన విషయాన్ని పంచుకున్నారు. తాను సినిమా మొత్తం డైరెక్షన్ చేస్తే తనని తప్పించాలని ప్రయత్నించారని వెల్లడించారు. తనపై కుట్ర చేశారని ఆరోపించారు.
`ఎవడైతే నాకేంటి`తో హిట్ అందుకున్న రాజశేఖర్
దర్శకుడు వీ సముద్ర దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా `ఎవడైతే నాకేంటి` సినిమా వచ్చింది. 2007లో విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. వరుసగా పరాజయాల్లో ఉన్న రాజశేఖర్‌కిది మంచి హిట్‌నిచ్చింది. ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. ఈ సినిమా మలయాళంలో వచ్చిన `లయన్`కి రీమేక్. పరుచూరి బ్రదర్స్ కథ సిద్ధం చేయగా, సముద్ర దర్శకత్వం వహించారు. వీరి కాంబినేషన్‌లో అప్పటికే `సింహారాశి` మూవీ వచ్చింది. అది మంచి ఆదరణ పొందింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఆ రిలేషన్‌తోనే `ఎవడైతే నాకేంటి` సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ సముద్రకి ఇచ్చారు రాజశేఖర్, జీవిత.
దర్శకుడిగా నన్ను తప్పించేందుకు కుట్ర
తెలుగుకి తగ్గట్టుగా మార్పులు చేసి రాజశేఖర్ హీరోగా `ఎవడైతే నాకేంటి` సినిమాని తెరకెక్కించారు సముద్ర. సినిమా బాగా వచ్చింది. బ్లాక్ బస్టర్ పక్కా అని ముందే అర్థమైపోయింది. దీంతో పక్కన ఉన్న కొందరు రాజశేఖర్, జీవితలకు లేనిపోనివి చెప్పారట. వారికి, దర్శకుడు సముద్రకి మధ్య కొన్ని గొడవలు క్రియేట్ చేశారట. ఇందులో భాగంగా సముద్రని దర్శకత్వం నుంచి తొలగించేందుకు కుట్ర జరిగిందని, రాజశేఖర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది, ఆయన చాలా హడావుడి చేశారు. మరోవైపు జీవిత కూడా ఏదో నటిస్తుంది. అప్పుడే తనని తప్పించేందుకు కుట్ర జరుగుతుందని తనకు అర్థమయ్యిందని దర్శకుడు వీ సముద్ర వెల్లడించారు.
వాళ్లు దర్శకులుగా ఎప్పటికీ సక్సెస్ కాలేరు
``చివరికి నన్ను తొలగించారు. ఆ తర్వాత కొందరు ప్రముఖులు కల్పించుకుని సెట్ చేశారు. దీంతో మళ్లీ ప్రాజెక్ట్ లోకి వచ్చి సినిమాని కంప్లీట్ చేశా. సినిమా అయిపోయాక మళ్లీ గొడవలు అయ్యాయి. నన్ను తప్పించేందుకు మళ్లీ ప్రయత్నించారు. దీంతో పెద్ద ఇష్యూ అయ్యింది`` అని అన్నారు సముద్ర. అయితే రాజశేఖర్, జీవిత ఎందుకు అలా ప్రవర్తించారనేది రివీల్ చేస్తూ, జీవితకి దర్శకురాలిగా సక్సెస్ లేదు. ఎలాగైనా సక్సెస్ కొట్టాలని, `ఎవడైతే నాకేంటి` మూవీ బాగా వచ్చింది, సక్సెస్ పక్కా అని భావించి ఈ సక్సెస్ క్రెడిట్ కోసం తనకు వెన్నుపోటు పొడిచినట్టుగా సముద్ర తెలిపారు. అయితే భగవంతుడు ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వాళ్లకి ఇస్తారని, రాజశేఖర్ అంటే హీరో, జీవిత అంటే హీరోయిన్, సముద్ర అంటే దర్శకుడు. అది వారు చేస్తేనే బాగుంటుంది. అలా కాదని చేస్తే తప్పు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ విషయంలోనూ రాజశేఖర్, జీవిత అలా చేశారని తెలిపారు సముద్ర. వాళ్లు ఇలా చేస్తే ఎప్పటికీ దర్శకులుగా సక్సెస్ కాలేరని తెలిపారు. తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు సముద్ర. అయితే ఆ తర్వాత అంతా సెట్ అయ్యిందని, ఇప్పటికీ తాము టచ్‌లోనే ఉన్నామని, కలిసి మాట్లాడుకుంటామని తెలిపారు సముద్ర. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.